గింజ నేర్పిన పాఠం.. ఎప్పటికీ పాజిటివ్ దృక్పథంతోనే ఉండాలి..!
ఒక ఇంటి అరుగు మీద కూర్చుని రేగుపళ్ళు తింటున్నాడో పదేళ్ళ పిల్లాడు. ఒకో పండూ తిని గింజను మట్టిలోకి ఊస్తున్నాడు. వాటిలో ఒక గింజ తోటిగింజలతో ఆశగా ఇలా అంది. ఇప్పుడు మనం ఆ మట్టిలో పడి మొలకెత్తుతాం కదూ. ఇంత చిన్నగా ఉన్న మనం మొలకై, మొక్కై, మానై మన అమ్మంత పెద్దవుతాం. నీడను, పళ్ళను ఇచ్చేంత గొప్పస్థాయికి వెళ్తాం. తలుచుకుంటేనే ఎంతో ఉత్సాహంగా ఉంది.. అంటూ మురిసిపోయింది. ఇంకో గింజ అంత ఆశ పడకు. … Read more









