Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ప్ర‌శ్న - స‌మాధానం

మామిడి పండ్ల‌ను తిన‌డంలో చాలా మందికి ఉండే అపోహ‌లు ఇవే..!

Admin by Admin
June 8, 2021
in ప్ర‌శ్న - స‌మాధానం
Share on FacebookShare on Twitter

వేస‌వి కాలంలోనే ల‌భించే మామిడి పండ్ల‌ను తినేందుకు చాలా మంది ఆస‌క్తి చూపిస్తుంటారు. మామిడి పండ్ల‌లో అనేక ర‌కాలు ఉంటాయి. ర‌సాలు, కోత మామిడి.. ఇలా అనేక ర‌కాల మామిడి పండ్లు మ‌న‌కు ల‌భిస్తాయి. అయితే మామిడి పండ్ల‌ను తినేందుకు కొంద‌రు సంశ‌యిస్తుంటారు. వాటిని తింటే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని భావిస్తుంటారు. కానీ మామిడి పండ్ల‌ను రోజూ త‌గిన మోతాదులో తింటే ఏమీ కాదు. ఈ క్ర‌మంలోనే మామిడి పండ్ల‌ను తిన‌డంలో కొంద‌రికి ఉండే అపోహ‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

myths and doubts eating mangoes

1. మామిడి పండ్ల‌ను తింటే అధిక బ‌రువు పెరుగుతారు ?

మామిడి పండ్ల‌ను తింటే బ‌రువు అధికంగా పెరుగుతార‌ని భ‌య‌ప‌డ‌తారు. కానీ ఇందులో ఎంత మాత్రం నిజం లేదు. మ‌నం తినే జంక్ ఫుడ్, నూనె ప‌దార్థాల కార‌ణంగానే మ‌నం బ‌రువు పెరుగుతాం. వ్యాయామం చేయ‌క‌పోయినా, అతిగా ఆహారం తిన్నా బ‌రువు పెరుగుతాం. నిజానికి మామిడి పండ్ల‌ను తింటే బ‌రువు పెర‌గ‌రు. బ‌రువు త‌గ్గుతారు. ఈ పండ్ల‌లో విట‌మిన్ ఎ, సి, ఐర‌న్‌, పొటాషియం, కాప‌ర్ త‌దిత‌ర పోష‌కాలు ఉంటాయి. ఇవి అధిక బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డ‌తాయి. ఆక‌లిని నియంత్ర‌ణ‌లో ఉంచుతాయి. దీంతో బ‌రువును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు.

2. మామిడి పండ్ల‌ను తింటే మొటిమ‌లు, మ‌చ్చ‌లు వ‌స్తాయి ?

విట‌మిన్ ఎ లోపించినా, యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఆహారాల‌ను తీసుకోక‌పోయినా, మిన‌ర‌ల్స్ లోపం ఏర్ప‌డినా మొటిమ‌లు, మ‌చ్చ‌లు వ‌స్తాయి. అంతేకానీ మామిడి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల అవి రావు. పైగా ఈ పండ్ల‌ను తింటే కెరాటిన్ ఉత్ప‌త్తి పెరుగుతుంది. ఇది చ‌ర్మాన్ని సంర‌క్షిస్తుంది.

3. డ‌యాబెటిస్ ఉన్న‌వారు మామిడి పండ్ల‌ను తిన‌రాదు ?

డ‌యాబెటిస్ ఉన్న‌వారు మామిడి పండ్ల‌ను తిన‌రాద‌ని అనుకుంటుంటారు. కార‌ణం.. అవి తియ్య‌గా ఉంటాయ‌ని వారు ఆ పండ్ల‌ను తిన‌రు. కానీ వాటి గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ త‌క్కువే. క‌నుక వాటిని నిర్భ‌యంగా తిన‌వ‌చ్చు. ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌వు. కానీ ఈ పండ్ల‌ను తగిన మోతాదులో తీసుకోవాలి. అతిగా తిన‌రాదు. మామిడి పండ్ల‌లో ఉండే మాంగిఫెరిన్ అనే స‌మ్మేళ‌నం యాంటీ ఆక్సిడెంట్‌లా ప‌నిచేస్తుంది. ఇది ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రిస్తుంది. క‌నుక డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఎలాంటి జంకు లేకుండా ఈ పండ్ల‌ను తిన‌వ‌చ్చు.

4. మామిడి పండ్ల‌ను తింటే వేడి చేస్తుంది ?

అవును. ఇది మాత్రం నిజ‌మే. మామిడి పండ్ల‌ను అతిగా తింటే వేడి చేస్తుంది. కానీ త‌గిన మోతాదులో తింటే ఏమీ కాదు. శ‌రీరానికి మేలే జ‌రుగుతుంది. అయితే మామిడి పండ్ల‌ను కొన్ని గంట‌ల పాటు నీటిలో నాన‌బెట్టి తింటే ఎన్న‌యినా తిన‌వ‌చ్చు. వేడి చేయ‌దు. అలా అని చెప్పి కూడా మితిమీరి తిన‌రాదు. సాధార‌ణం క‌న్నా కొంచెం ఎక్కువ తినవ‌చ్చ‌న్న‌మాట‌.

5. గ‌ర్భిణీలు మామిడి పండ్ల‌ను తిన‌రాదు ?

గ‌ర్భిణీలు మామిడి పండ్ల‌ను తిన‌వ‌చ్చు. కాక‌పోతే కొద్ది మోతాదులో తీసుకోవాలి. బాగా పండిన పండ్ల‌నే తినాలి. స్వ‌ల్పంగా తీసుకుంటే ఏమీ కాదు. పైగా ఆ పండ్ల‌లో ఉండే పోష‌కాలు త‌ల్లికి, క‌డుపులో ఉండే బిడ్డ‌కు ఎంత‌గానో మేలు చేస్తాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Tags: mangomangoesమామిడిమామిడి పండ్లు
Previous Post

అల్లం, తేనె, మిరియాలు, నిమ్మరసంతో దగ్గు, జలుబుకు చెక్‌ పెట్టండిలా..!

Next Post

వికారం, వాంతులు త‌గ్గేందుకు ఇంటి చిట్కాలు..!

Related Posts

ప్ర‌శ్న - స‌మాధానం

డ‌యాబెటిస్ ఉన్నవారు రోజుకు అస‌లు ఎన్ని నీళ్ల‌ను తాగాలి..?

July 7, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

ప‌సుపు క‌లిపిన పాల‌ను గ‌ర్భిణీలు తాగ‌వ‌చ్చా..?

June 9, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

భోజ‌నం చేసేట‌ప్పుడు మ‌ధ్య‌లో నీళ్ల‌ను తాగ‌కూడదా..? ఎందుకు..?

June 2, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

డ‌యాబెటిస్ ఉన్న‌వారు మ‌ద్యం సేవించ‌వ‌చ్చా..? ట్యాబ్లెట్లు వేసుకుంటే ఏం జ‌రుగుతుంది..?

May 29, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

కాళ్ల దుర‌ద అధికంగా ఉంది.. ఇది త‌గ్గాలంటే ఏం చేయాలి..?

May 25, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Gadida Gadapaku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో.. చేల‌లో ల‌భించే మొక్క ఇది.. అస‌లు విడిచిపెట్ట‌వ‌ద్దు..!

by D
June 10, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.