అశ్వ‌త్థామ ఎంత‌టి ఘోరం చేశాడో తెలుసా..?

పురాణాల్లో అస్ర్తాల గురించి చాలాసార్లు విన్నాం. ఘోరమైన తపస్సు చేసి వరంగా పొందిన అస్ర్తాలను ఆయా యుద్ధాల్లో వాడిన సందర్భాలు అనేకం. అలాంటి అస్ర్తాలలో బ్రహ్మాస్త్రం ఒకటి. నేడు అణుబాంబులంటే ఎంత తీవ్రమైనవో అంతకంటే ఘోరమైనది ఈ బ్రహ్మాస్త్రం. దీన్ని అనేక యుద్ధాల్లో ఆయా వీరులు వాడారు. ఇక మహాభారతంలో బ్రహ్మాస్త్ర విద్య తెలిసినవారు ద్రోణుడు, అర్జునుడు, అశ్వత్థామ తదితరులు ఉన్నారు. అయితే వీరిలో బ్రహ్మాస్త్ర ప్రయోగం, ఉపసంహారం తెలిసినవారు ద్రోణార్జునులు. ఇక అశ్వత్థామ విషయానికి వస్తే … Read more

కురుక్షేత్ర యుద్ధం తొలి రోజు ఎలా జ‌రిగిందంటే..?

కర్ణుడు సైన్యాధ్యక్షుడిగా మొదటిరోజు మకరవ్యూహం అంటే మొసలి ఆకారంలో సైన్యాన్ని నిలపడం. మొసలి ఎలా నీటిలో చొచ్చుకుని పోతుందో అలా శత్రు సైన్యంలోకి చొచ్చుకపోవడం. మొసలి వ్యూహంలో- నోరు ఉన్న ప్రదేశంలో కర్ణుడు, కన్నుల వద్ద శకుని, ఆయన కుమారుడు ఉలూకుడు నిల్చున్నారు. తలభాగంలో అశ్వత్థామడు, మెడప్రాంతంలో తన తమ్ములను నిలిపాడు ధుర్యోధననుడు. మొసలి ఆకారంలో ఉన్న వ్యూహంలో పాదాల ప్రాంతంలో కృతవర్మ, కృపాచార్యుని నియమించాడు. కడుపు వద్ద సుయోధనుడు అంటే ధుర్యోధనుడు తానే స్వయంగా నిల్చున్నాడు. … Read more

ఇద్ద‌రు మిత్రుల మ‌ధ్య వ‌చ్చిన వైర‌మే మ‌హాభార‌త యుద్ధం..!

ద్రోణుడు భరాద్వాజుని కొడుకు, ద్రుపదుడు వృషతుని కొడుకు. భ‌రద్వాజుడు, వృషతులు ఇద్దరు మంచి మిత్రులు. అలాగే వారి కొడుకులు మంచి మిత్రులు. ఇద్దరు ఒకే గురువు దగ్గర విద్యను అభ్యసిస్తారు. తర్వాతి కాలాలలో ద్రుపదుడు పాంచాల రాజుయ్యాడు. ద్రోణుడు వివాహం చేసుకున్నాక ఆయనకు అశ్వత్థాముడు జన్మించాడు. కానీ ఆయన దారిద్య్రంతో పిల్లవాడికి పాలు దొరకనిస్థితి. ఆ పరిస్థితిలో పరుశరాముడి దగ్గరికి వెళ్లిన ద్రోణుడికి ఆయన శస్ర్తాస్త్ర విద్యలను నేర్పిస్తాడు. కానీ ద్రోణుడికి ఆ సమయంలో కావల్సింది ధనం. … Read more

ద్రోణుడు త‌న విద్య‌ల‌ను ఎవ‌రి వ‌ద్ద నేర్చుకున్నాడో తెలుసా..?

ద్రోణుడు,ద్రుపదుడు ఇద్దరు సహాధ్యాయులు. వీరిద్దరికి విద్యను నేర్పింది ద్రోణుడి తండ్రియైన భరద్వాజుడు. అనంతర కాలంలో ద్రుపదుడు పాంచాలదేశానికి రాజు అవుతాడు. ద్రోణుడు దరిద్రుడు. అందుచేత కుటుంబ పోషణ కోసం ధనాన్ని సంపాదించాలనుకుంటాడు. జమదగ్ని కుమారుడైన పరుశరాముడు బ్రాహ్మణులకు ఎడతెగకుండా ధనాన్ని దానం చేస్తున్నాడని వింటాడు. వెంటనే మహేంద్ర పరత్వంపైన తపస్సు చేసుకుంటున్న పరుశరాముడి దగ్గరకి ద్రోణుడు వెళ్తాడు. ద్రోణుని చూసిన పరుశరాముడు చూసి వచ్చిన పని ఏమి అని అడుగుతాడు. దానికి జవాబుగా ద్రోణుడు తన బీదరికాన్ని … Read more

గ‌రుడ పురాణం ప్ర‌కారం న‌ర‌కంలో పాపుల‌కు విధించే శిక్ష‌లు ఇవే..!

గరుడపురాణం మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మన పెద్దలు రాసిన ఒక మహత్తరమైన గ్రంథం. గరుడ పురాణాన్ని వేదవ్యాసుడు రచించాడు. విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతునికి ఒకసారి మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు? ఆ జీవుడికి ఏయే గతులు కలుగుతాయి… తదితర సందేహాలు కలిగాయట. వాటన్నింటికీ విష్ణువే సమాధానాలు చెప్పి, గరుడుని సందేహ నివృత్తి చేశాడట. గరుడుని కోసం చెప్పింది కాబట్టి దీనికి గరుడ పురాణం అని పేరొచ్చింది.ఇందులో వ్య‌క్తులు చేసిన పాపాల‌కు గాను న‌రకంలో విధించే శిక్ష‌ల వివ‌రాలు … Read more

64 కళలు అంటారు..అవి ఏమిటో తెలుసా..?

చతుష్టష్టి కళలు అంటారు. అనగా 64. వీటినే విద్య‌లని కూడా అంటారు. ఈ లెక్కలో కూడా కొన్ని మత భేదాలున్నాయి. కొందరు వేదాలన్నింటిని ఒక్కటిగా లెక్కించారు. కొందరు వాటిని నాలుగుగా చూపారు. వేదం, శాస్త్రం, ధర్మశాస్త్రం (స్మృత్రి), వ్యాకరణం, జ్యోతిశ్శాస్త్రం, ఆయుర్వేదం, సంగీతశాస్త్రం (గాంధర్వం), కవిత్వం, స్వరశాస్త్రం, సాముద్రికశాస్త్రం, కొక్కోకం (కామశాస్త్రం), శకునశాస్త్రం, మల్లయుద్ధవిద్య, గారుడం, వాక్చమత్కృతి, అర్థవేదం, దేశభాషా పాండిత్యం, వివిధ లిపిజ్ఞానం, లేఖనం, రథగమనం, రత్నపరీక్ష, అస్త్రవిద్య, పాకశాస్త్రజ్ఞానం, శిక్ష, వృక్షదోహదాలు, ఆగమశాస్త్రం, ఇంద్రజాలికం … Read more

చందమామలో కుందేలు ఎలా ఉంటోంది..?

పౌర్ణమి నాటి రాత్రి మనం పూర్ణచంద్రుడి కేసి చూసినట్లయితే చంద్రబింబం తెల్లగా ఉంటుంది. కానీ దాని మధ్య కుందేలు ఆకారంలో మచ్చ ఉంటుంది. చందమామలో ఈ కుందేలు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఒకప్పుడు, అంటే చాలా వేల ఏళ్ల క్రితం, చందమామ తెల్లగా, వెండిపళ్లెంలాగా ఉండేవాడు. ఆ కాలంలో భూమిమీద ఒక అరణ్యంలో ఒక కుందేలూ, ఒక కోతీ, ఒక నక్కా, ఒక మానుపిల్లీ సఖ్యంగా ఉంటూ ఉండేవి. కుందేలు తన ముగ్గురు మిత్రులకూ ఉత్తమ … Read more

రామసేతు నీటిలో తేలే రాళ్ళు.. ఎలా మునిగిపోయాయి?

రామసేతు గురించి తెలియని వాళ్లు ఉండరు. ఇది నీటిపై తేలే రాళ్లతో నిర్మించిన ఒక వంతెన. లంకలో ఉన్న సీతమ్మను తీసుకురావడానికి.. శ్రీరాముడు తన వానరసేనతో కట్టించిన బ్రిడ్జి లాంటి కట్టడం. మరి ఆ రామసేతువు ఎలా మునిగిపోయిందో మీకు తెలుసా? తెలుసుకోండి మరి. రామాయణం గురించి తెలిసిన వాళ్లందరికీ రామసేతువు గురించి తెలిసే ఉంటుంది. రావణుడు సీతా మాతను అపహరించి లంకలో ఉంచినప్పుడు, సీతమ్మను తీసుకురావడానికి శ్రీరాముడు వానరుల సహాయంతో సేతువును నిర్మించాడు. తద్వారా లంకకు … Read more

చనిపోయిన వారు మాత్రమే తిరిగి జన్మిస్తే, పెరుగుతున్న జనాభా ఎక్కడి నుంచి వస్తున్నారు?

హిందూ మతం…. ఆత్మ మరణం తర్వాత మరొక శరీరంలోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. కర్మ సిద్ధాంతం ప్రకారం, మన ప్రస్తుత జీవితంలోని చర్యలు భవిష్యత్ జన్మలను ప్రభావితం చేస్తాయి. మోక్షం పొందడం ద్వారా పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందవచ్చు. బౌద్ధ మతం… ఆత్మ లేదని, కానీ మనస్తత్వం మరొక రూపంలో పునర్జన్మ ఎత్తుతుందని నమ్ముతారు. కర్మ మరియు పునర్జన్మ సిద్ధాంతాలను అంగీకరిస్తారు. నిర్వాణం చేరుకోవడం ద్వారా పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందవచ్చు. జైన మతం…. పునర్జన్మను … Read more

రాముడు, సీత‌, ల‌క్ష్మ‌ణుడు త‌మ అంత్య‌కాలంలో లోకాన్ని ఎలా విడిచివెళ్లిపోయారో తెలుసా..?

హిందూ పురాణాల్లో ఒక‌టైన రామాయణం గురించి దాదాపు ప్రతి ఒక్క హిందువుకి, ఆ మాట కొస్తే దాదాపు అంద‌రికీ తెలుసు. రాముడి జ‌న‌నం, రాక్ష‌సుల‌ను సంహ‌రించ‌డం, సీత‌ను ప‌రిణ‌య‌మాడ‌డం, అడ‌వుల‌కు వెళ్లి వ‌న‌వాసం చేయ‌డం, రావ‌ణుడు సీత‌ను ఎత్తుకెళ్ల‌డం, రాముడు రావ‌ణున్ని సంహ‌రించ‌డం… ఇలా అనేక కాండ‌ల‌లో రామాయ‌ణాన్ని వాల్మీకి క‌వి అద్భుతంగా ర‌చించి భ‌క్తుల‌కు ఆ గ్రంథం ప‌విత్ర‌త‌ను తెలియ‌జేశాడు. అయితే రాముడు, సీత, ల‌క్ష్మ‌ణులు త‌మ అంత్య కాలంలో ఈ లోకాన్ని ఎలా విడిచిపెట్టి … Read more