Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home food

Avakaya Pulihora : ఆవ‌కాయ పులిహోర‌ను ఇలా చేయండి.. రుచి చూస్తే మ‌ళ్లీ కావాలంటారు..!

D by D
September 23, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Avakaya Pulihora : ఆవ‌కాయ పులిహోర‌.. ఈ పేరు విన‌గానే అంద‌రికి మామిడికాయ‌ల‌తో చేసే పులిహోర‌నే గుర్తుకు వ‌స్తుంది. కానీ మామిడికాయ నిల్వ ప‌చ్చ‌డితో కూడా మ‌నం ఎంతో రుచిగా ఉండే పులిహోర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ పులిహోర లంచ్ బాక్స్ లోకి కూడా చాలా చ‌క్క‌గాఉంటుంది. ఇంట్లో మామిడికాయ ప‌చ్చ‌డి ఉంటే చాలు దీనిని 5 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు ఇలా పులిహోర‌ను త‌యారు చేసుకుని తింటే క‌డుపు నిండా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. ఎంతో క‌మ్మ‌గా ఉండే ఈ ఆవ‌కాయ పులిహోర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆవ‌కాయ పులిహోర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – పావు క‌ప్పు, ఆవాలు – ఒక టేబుల్ స్పూన్, ప‌ల్లీలు – 3 టేబుల్ స్పూన్స్, పొట్టు మిన‌పప్పు – ఒక టేబుల్ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 5, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, ఎండుమిర్చి – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, ఇంగువ – రెండుచిటికెలు, త‌రిగిన ట‌మాటాలు – 2, ప‌సుపు – పావు టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – గుప్పెడు, ఉప్పు – కొద్దిగా, ఆవ‌కాయ ప‌చ్చ‌డి – అర క‌ప్పు, అన్నం – పావుకిలో బియ్యంతో వండినంత‌, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్.

Avakaya Pulihora recipe in telugu very tasty how to make it
Avakaya Pulihora

ఆవ‌కాయ పులిహోర త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఆవాలు, ప‌ల్లీలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత మిన‌పప్పు, శ‌న‌గ‌ప‌ప్పు, వెల్లుల్లి రెబ్బ‌లు, క‌రివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, ఇంగువ వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌బ‌డే వ‌ర‌కు వేయించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌బ‌డిన త‌రువాత ప‌సుపు, ఉప్పు, కొత్తిమీర వేసి క‌ల‌పాలి. త‌రువాత ఆవ‌కాయ ప‌చ్చ‌డి వేసి క‌ల‌పాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత అన్నం వేసి క‌ల‌పాలి. దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత చివ‌ర‌గా నెయ్యి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆవ‌కాయ పులిహోర త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. వంట చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు మామిడికాయ పులిహోర‌ను త‌యారు చేసుకుని క‌డుపు నిండా తిన‌వ‌చ్చు.

Tags: Avakaya Pulihora
Previous Post

Korrala Pongali : కొర్ర‌ల‌తో పొంగ‌లి ఇలా చేయండి.. ఎంతో ఆరోగ్య‌క‌రం..!

Next Post

Gym : జిమ్‌లో వ్యాయామం చేసేట‌ప్పుడు హార్ట్ ఎటాక్ వ‌చ్చే చాన్స్ ఉంటుందా..?

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
food

Paneer Mushroom Dum Biryani : ప‌నీర్‌, మ‌ష్రూమ్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేసి చూడండి.. ఎంతో బాగుంటుంది..!

by D
March 12, 2023

...

Read more
హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
September 26, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Shiva Darshan : నందికొమ్ముల నుంచి శివ‌లింగాన్ని ద‌ర్శిస్తారు.. ఎందుకంటే..?

by Admin
November 26, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

by Admin
September 23, 2025

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.