Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home sports

Team India : టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌.. శ్రీ‌లంక‌తో టీ20లు, టెస్టుల‌కు భార‌త జ‌ట్టు ఇదే..!

Admin by Admin
February 19, 2022
in sports, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Team India : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు కెప్టెన్‌గా త‌ప్పుకున్న విష‌యం విదిత‌మే. అయితే గ‌తంలో రోహిత్ శ‌ర్మ అందుబాటులో లేక‌పోవడంతో.. అత‌ను కేవ‌లం వ‌న్డేలు, టీ20ల‌కు మాత్ర‌మే కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే రోహిత్‌ను తాజాగా టెస్టుల‌కు కెప్టెన్‌గా నియ‌మిస్తూ బీసీసీఐ నిర్ణ‌యం తీసుకుంది. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో శ్రీ‌లంక‌తో జ‌ర‌గ‌నున్న టెస్టు సిరీస్‌కు రోహిత్‌ను కెప్టెన్‌గా నియ‌మించారు. ఇక భార‌త్‌లో శ్రీ‌లంక ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో టీ20, టెస్టు సిరీస్‌ల‌కు జ‌ట్ల‌ను కూడా బీసీసీఐ ప్ర‌క‌టించింది.

Team India cricket members announced for upcoming Sri Lanka series
Team India

ఈ నెల 24వ తేదీ నుంచి భార‌త్‌లో శ్రీ‌లంక టూర్ ప్రారంభ‌మ‌వుతుంది. ముందుగా మూడు టీ20 మ్యాచ్‌లు, త‌రువాత రెండు టెస్టు మ్యాచ్‌ల‌ను శ్రీ‌లంక‌తో భార‌త్ ఆడుతుంది. ఈ నెల 24, 26, 27 తేదీల్లో టీ20 మ్యాచ్ లు జ‌ర‌గ‌నుండ‌గా.. మార్చి 4, 12 తేదీల్లో టెస్టు మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఇక పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న కార‌ణం అజింక్యా ర‌హానే, చ‌టేశ్వ‌ర్ పుజారాల‌ను సెలెక్ష‌న్ క‌మిటీ ప‌క్క‌న పెట్టింది. వీరికి రంజీల్లో అవ‌కాశం ఇచ్చారు. అక్క‌డ మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేస్తే మ‌ళ్లీ జ‌ట్టులోకి వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. అలాగే వృద్ధిమాన్ సాహా, ఇషాంత్ శ‌ర్మ‌ల‌ను కూడా టెస్టు జ‌ట్టులోకి తీసుకోలేదు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్న‌ర్ సౌర‌భ్ కుమార్ కొత్త‌గా జ‌ట్టులోకి వ‌చ్చాడు.

శార్దూల్ ఠాకూర్‌కు ఈ రెండు సిరీస్‌ల‌కు రెస్ట్ ఇచ్చారు. విరాట్ కోహ్లి, రిష‌బ్ పంత్‌ల‌కు టీ20 సిరీస్‌కు రెస్ట్ ఇచ్చారు. వీరు టెస్టు మ్యాచ్‌లు ఆడ‌తారు. ఇక వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, కేఎల్ రాహుల్‌లు కూడా ఈ రెండు సిరీస్‌కు దూర‌మ‌య్యారు. ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఫిట్‌నెస్ నిరూపించుకుంటే జ‌ట్టులోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. అలాగే అక్ష‌ర్ ప‌టేల్ గాయం నుంచి కోలుకుంటుండగా.. రెండో టెస్టుకు ఇత‌ను అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి.

ఇక శ్రీలంకతో ఆడనున్న భారత టీ20, టెస్టు జట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

భారత టీ20 జట్టు ఇదే..
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్య కుమార్‌ యాదవ్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, వెంకటేష్‌ అయ్యర్‌, దీపక్‌ హుడా, జస్‌ప్రిత్‌ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), భువనేశ్వర్ కుమార్‌, హర్షల్‌ పటేల్‌, మహమ్మద్‌ సిరాజ్‌, సంజు శాంసన్‌, యజువేంద్ర చాహల్‌, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, రవి బిష్ణోయ్‌, అవేష్‌ ఖాన్‌.

భారత టెస్టు జట్టు ఇదే..
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), మయాంగ్‌ అగర్వాల్‌, ప్రియాంక్‌ పాంచల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయాస్‌ అయ్యర్‌, హనుమ విహారి, శుబమన్‌ గిల్‌, రిషబ్‌ పంత్‌, కేఎస్‌ భరత్‌, ఆర్‌.అశ్విన్‌ (ఫిట్‌నెస్‌), రవీంద్ర జడేజా, జయంత్‌ ఠాకూర్‌, కుల్దీప్‌ యాదవ్‌, జస్‌ప్రిత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీ, మహమ్మద్‌ సిరాజ్‌, ఉమేష్‌ యాదవ్‌, సౌరభ్‌ కుమార్‌.

Tags: cricketSri LankaTeam Indiaటీ20టెస్ట్రోహిత్ శ‌ర్మశ్రీ‌లంక‌
Previous Post

Prabhas : ప్ర‌భాస్‌తో రొమాన్స్‌కి సిద్ధ‌మైన అందాల ముద్దుగుమ్మ‌.. ఆ కాంబినేష‌న్ అద్దిరిపోవ‌ల్సిందే..!

Next Post

Guava Leaves Water : జామ ఆకుల నీళ్ల‌ను రోజూ తాగాల్సిందే.. ముఖ్యంగా పురుషులు త‌ప్ప‌క తీసుకోవాలి..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

No Content Available
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.