హైబీపీ సమస్య అనేది ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. బీపీ నియంత్రణలో ఉండకపోతే అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ ల బారిన పడేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల బీపీని తగ్గించుకోవచ్చు. ఈ విషయాన్ని సైంటిస్టులు పలు అధ్యయనాల ద్వారా వెల్లడిస్తున్నారు.

ఎరుపు రంగు వైన్, బెర్రీలు, యాపిల్స్, బేరి పండ్లు (పియర్స్), టీ వంటి ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల బీపీ తగ్గుతుంది. వీటిల్లో ఫ్లేవనాయిడ్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి బీపీని తగ్గించడంలో సహాయ పడతాయి. అందువల్ల ఆయా ఆహారాలను తీసుకుంటే హైబీపీని తగ్గించుకోవచ్చు.
ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల హైబీపీ వచ్చే అవకాశాలు తగ్గుతాయని, అలాగే ఇప్పటికే ఈ సమస్య ఉన్నవారిలో బీపీ తగ్గుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బెల్‌ఫాస్ట్‌కు చెందిన క్వీన్స్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ వివరాలను వెల్లడించారు.
మనం ఏం తింటున్నామనే దానిపై మన ఆరోగ్యం ఆధార పడి ఉంటుంది. మనం తినే ఆహారాల వల్ల మన శరీరం ప్రభావితమవుతుంది. ముఖ్యంగా చాలా మందిలో హైబీపీ సమస్య వస్తోంది. అలాంటి వారు ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉండడమే కాదు, హైబీపీ తగ్గుతుంది.. అని ప్రొఫెసర్ కాస్సిడీ తెలిపారు.
ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా పలు రకాల బెర్రీలతోపాటు ఎరుపు రంగు క్యాబేజీ, ఉల్లిపాయలు, కొత్తిమీర, గ్రీన్ టీ, రెడ్ వైన్, డార్క్ చాకొలెట్, కీరదోస, టమాటాలు, క్యారె్లు, ఆకుపచ్చని కూరగాయల్లో ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే హైబీపీ తగ్గుతుంది.











