రోజూ ఇలాంటి వ్యాయామాలు చేస్తే ఆరోగ్యం మీ వెంటే..!

ప్రతిరోజూ వ్యాయామం చేస్తే మీ జీవితంలో ఏర్పడే ఒత్తిడి సంఘటనలను తేలికగా ఎదుర్కొంటారు. జీవితం ఒత్తిడి తెచ్చే ఎన్నో సంఘటనలతో కూడుకొని వుంటుంది. కనుక సులభమైన వ్యాయామాల ద్వారా అధిక ఒత్తిడి ఎలా నియంత్రించుకోవాలో పరిశీలించండి. శారీరక వ్యాయామం – ఒత్తిడి ఆందోళన తగ్గాలంటే, ఏదో ఒక శారీరక చర్యలలో పాల్గొనండి. అది నడక లేదా వర్కవుట్ కావచ్చు. కొంతసేపు చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. స్విమ్మింగ్ లేదా మీ కిష్టమైన ఆటలాడటం చేస్తే బోర్ అనిపించకుండా వుంటుంది. … Read more

ఎక్స‌ర్‌సైజ్ చేసే వారు స‌డెన్‌గా దాన్ని ఆపేస్తే… లావై పోతారా? ఇందులో నిజమెంత??

ప్ర‌తి వ్య‌క్తికి పౌష్టికాహారం, స‌రైన వేళ‌కు భోజ‌నం చేయ‌డం ఎంత ఆవ‌శ్య‌క‌మో ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయ‌డం కూడా అంతే అవ‌స‌రం. లావుగా ఉన్న‌వారు స‌న్న‌బ‌డేందుకు వ్యాయామం చేయ‌డం, చ‌క్క‌ని షేప్‌కు రావ‌డం కొంత క‌ష్ట‌మైన ప‌నే. అయినా ఆరోగ్యం దృష్ట్యా త‌ప్ప‌దు క‌దా. అయితే ఆల్రెడీ ఎన్నో సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి వ్యాయామం చేసే వారు ఒక్క‌సారే స‌డెన్‌గా ఎక్సర్‌సైజ్ చేయ‌డం ఆపితే..? అప్పుడు ఎలాంటి ప‌రిణామాలు ఏర్ప‌డుతాయో తెలుసా..? ఏంటీ… ఎంతో కాలంగా వ్యాయామం … Read more

భార్యాభ‌ర్త ఇద్ద‌రూ క‌ల‌సి వ్యాయామం చేస్తే వ‌చ్చే మ‌జాయే వేరు తెలుసా..?

జీవిత భాగస్వామి లేదా గాల్ ఫ్రెండ్ తో కలిసి వర్కవుట్లు చేయటం ఎంతో ధ్రిల్లింగ్ గా వుంటుంది. వ్యాయామం ఎపుడెపుడే చేసేద్దామా అని వుంటుంది. ఒంటిరిగా చేసి బోర్ అనిపించుకోకుండా, జంటగా మంచి మ్యూజిక్ వింటూ వర్కవుట్లు చేస్తే, శరీరానికి ఆరోగ్యమే కాదు, మనసుకి ఉల్లాసంగా కూడా వుంటుంది. అంతేకాదు, జంటలు కొంత సమయం ఉపయోగకరంగాను గడిపినట్లు వుంటుంది. జంటలు చేసే వర్కవుట్లు ఎలా వుండాలో చూద్దాం . జంటలు సాధారణంగా డ్యాన్స్ చేయటానికి ఎక్కువ మక్కువ … Read more

వ్యాయామం చేస్తున్నారా.. అయితే గుండె ఆరోగ్యానికి ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

గుండె ఒక కండరం అది శరీరమంతా రక్తాన్ని ప్రసరింపజేస్తుంది. అన్ని కండరాలవలెనే దీనికి కూడా వ్యాయామం కావాలి. ఆరోగ్యంగా వుండాలంటే, వ్యాయామం మంచిది. శరీరం జబ్బులకు, వ్యాధులకు గురికాకుండా వుంటుంది. వ్యాయామం ఏం చేస్తుంది? వ్యాయామం అధిక కేలరీలను ఖర్చు చేస్తుంది. బరువు తగ్గేటందుకు తోడ్పడుతుంది. రక్తంలో వుండే కొల్లెస్టరాల్, కొవ్వు వంటివి తగ్గించటానికి సహకరిస్తుంది. వ్యాయామం రక్తప్రసరణ పెంచి గుండె సమర్ధవంతంగా పనిచేసేలా చేస్తుంది. మరి గుండెకు అవసరమైన వ్యాయామాలు ఏవి? ప్రతిరోజూ వేగంగా నడవండి. … Read more

ఈ ప‌రిస్థితుల్లో అస‌లు వ్యాయామం చేయ‌కూడ‌దు.. చేస్తే ప్ర‌మాదం..

ప్రతిరోజూ జిమ్ కు వెళ్ళి శరీరాన్ని కఠినంగా శిక్షిస్తున్నారా? శరీరానికి విశ్రాంతి కూడా ఏంతో ప్రధానం అంటారు వ్యాయామ నిపుణులు. అయితే, వ్యాయామాలు ఏ ఏ సందర్భాలలో మానేసి శరీరానికి విశ్రాంతి నివ్వాలో పరిశీలించండి. ఆరోగ్యం సరిగా లేనపుడు – ఆరోగ్యం సరిగా లేనపుడు డాక్టర్లు సైతం జిమ్ కు వెళ్ళవద్దంటారు. చిన్నపాటి జలుబు చేసినా సరే వ్యాయామం మానేయండి. జలుబుగా వున్నపుడు మీరు చేసే వర్కవుట్లు మీ శారీరక రోగ నిరోధక వ్యవస్ధపై ఒత్తిడి చూపి … Read more

రోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల మీ శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో తెలుసా..?

రోజూ వ్యాయామాలు చేస్తూ శారీరకంగా చురుకుగావుంటే ఎన్నో ప్రయోజనాలుంటాయి. అన్నిటికి మించి ఆరోగ్యం అద్భుతంగా వుంటుంది. రెగ్యులర్ గా చేసే వ్యాయామాలు ఎలా లాభిస్తాయో చూడండి…. ! శారీరక రూపాన్ని, సత్తాని చాటి మంచి శక్తి కలిగిస్తాయి. డిప్రెషన్, ఒత్తిడి వంటివి దగ్గరకు రావు గుండె సంబంధిత వ్యాధులు దరికి చేరవు. రక్తపోటు తగ్గిస్తాయి, చెడు కొల్లెస్టరాల్ పోయి, మంచి కొల్లెస్టరాల్ స్ధాయి శరీరంలో పెరుగుతుంది, ఎముకల అరుగుదల అసలేవుండదు. అధిక బరువు తగ్గించి, సమంగా వుండేలా … Read more

వ్యాయామం చేస్తున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను మ‌రిచిపోవ‌ద్దు..

ఫిట్ నెస్ పై దృష్టి పెడితే అది చర్మానికి కూడా మేలు చేస్తుంది. మీరు ఫిట్ గా ఉంటే మీ చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఐతే ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టి వర్కౌట్లు చేస్తున్నప్పుడు కొన్ని చర్మ సంరక్షణ చర్యలు తెలుసుకోవాలి. లేదంటే చర్మానికి వచ్చే ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి. పొద్దున్న లేచి డైరెక్టుగా వర్కౌట్ చేయవద్దు. ముందుగా ముఖాన్ని సబ్బుతో శుభ్రపర్చుకోండి. జిడ్డు చర్మతో వర్కౌట్లు చేస్తే చర్మం పగులుతుంది. మాయిశ్చరైజర్, సన్ … Read more

స‌న్న‌గా, నాజూకైన శ‌రీరం కావాలంటే ఈ వ్యాయామాల‌ను చేయ‌డం త‌ప్ప‌నిస‌రి..!

నాజూకు శరీరం కోరే మహిళలా? బికిని ధరించాలా? బికిని శరీరం కావాలంటే.. సన్నని కాళ్ళు, బలమైన ఛాతీ, ఆకర్షణీయమైన పిరుదులు వుండాలి. నేటి ఫ్యాషన్ యుగంలో మహిళలందరూ కోరేది ఇదే. బికిని ఆహారం తీసుకోవడమే కాదు. వేగంగా సన్నపడాలంటే కొన్ని వ్యాయామాలు కూడా చేయాలి. ఆ వ్యాయామాలేమిటో పరిశీలించండి. వర్కవుట్లు మార్చండి – మొదటగా బికిని వర్కవుట్లు చేసే వారు తరచుగా వారి వ్యాయామాలు మార్చాలి. కనీసం 4 వారాలకొకసారి వర్కవుట్లు మారుతూ వుండాలి. కనుక మీరు … Read more

ఎలాంటి ప‌రిక‌రాలు లేకుండానే సుల‌భంగా ఈ వ్యాయామాల‌ను చేయ‌వ‌చ్చు..!

పిక్క కండరాల వ్యాయామ ఫలితం మీ కాళ్ళపై అమోఘంగా వుంటుంది. అందంగా కనపడే కాళ్ళేకాదు కావలసింది…బలమైనవి గా కూడా వుండాలి. మీ మోకాళ్ళ వెనుక దిగువ భాగంలో వుండే పిక్కల బిగువును ఎపుడైనా పరీక్షించారా? నేటి రోజుల్లో రోజులో అధిక భాగం మనమంతా కుర్చీలలో కూర్చొని కంప్యూటర్ వర్క్ చేస్తున్నాం. అధికభాగం కూర్చుండిపోవటంతో కాళ్ళకు వ్యాయామం లేకుండా పోయి బలహీనపడుతున్నాయి. పిక్కల కండరాలను బలపరచుకోడానికి ఏ రకమైన వ్యాయామాలు చేయాలో పరిశీలించండి. కండరాలను బలపరచటానికి చేసే వ్యాయామం … Read more

గుండె జ‌బ్బుల బారిన ప‌డిన వారు ఈ వ్యాయామాలు క‌చ్చితంగా చేయాల్సిందే..!

గుండె జబ్బులుగల రోగులు వారి గుండెను పదిలంగా ఎప్పటికపుడు కాపాడుకుంటూ వుండాలి. డాక్టర్లు తమ రోగులకు రోజూ వ్యాయామం చేయాలని గుండె జబ్బులు మరిన్ని రాకుండా చూసుకోవాలని సలహానిస్తారు. గుండె జబ్బు గల రోగులకు ప్రతిరోజూ వారు ఏ రకమైన వ్యాయామాలు చేయాలనేది పరిశీలిద్దాం. గుండె రోగులకు ఏరోబిక్ వ్యాయామాలు మంచివి. వేరే ఇతర వ్యాయామాలు గుండెపై అధికంగా ప్రభావం చూపే అవకాశం వుంది. కనుక లైట్ గా వుండే ఏరోబిక్ వ్యాయామాలు వీరికి సూచించదగినవి. ప్రతిరోజూ … Read more