అరటి ప్రాముఖ్యతేంటో మీకు తెలుసా..? ఎందుకు అరటి పవిత్రంగా మారింది..?
‘అరటి’’ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే… ప్రాచీనకాలం నుండి ప్రస్తుత కాలం వరకు మన భారతీయ సంస్కృతిలో ఏ శుభకార్యం జరిగినా.. అందులో అరటాకుగాని, అరటిపళ్లుగాని, అరటిచెట్టుకు సంబంధించిన కాండాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఈ అరటి ప్రాముఖ్యత గురించి రామాయణంలో వివరించబడితే.. ఇదే అరటి ఆవిర్భావం గురించి భాగవతంలో వివరించబడింది. అరిటిని ‘కదళి’, ‘రంభా’ అనే పేర్లతో కూడా చాలామంది పిలుచుకుంటారు. ముఖ్యంగా ఇవి పల్లెటూళ్లలో జరిగే ప్రతిఒక్క కార్యక్రమంలోను ఉపయోగించుకుంటారు….