ముత్యాల‌ను ఎల్ల‌ప్పుడూ ఎరుపు రంగు వ‌స్త్రంలోనే చుట్టి ఉంచుతారు.. ఎందుకని..?

ప‌ట్టు వ‌స్త్రాలు అయితే మడతలు పడకుండా పరిశుభ్రంగా భద్రపరచాలి. పురుగులు, దుమ్ము, ధూళి సోకకుండా, ఎక్కువ గాలి, కాంతి తగలకుండా కాపాడాలి. కలప మీద పట్టు వస్త్రాలను నేరుగా తాకేలా భద్రపరచరాదు. ప్లాస్టిక్ సంచులు ఉపయోగించరాదు. కాటన్ సంచులను మాత్రమే ఉపయోగించాలి. అప్పుడప్పుడు బయటకు తీసి గాలి సోకనీయాలి. పట్టు చీరలను భద్రపరిచే ప్రదేశంలో సిలికాన్‌జెల్ సంచులను ఉపయోగించాలి. అగరుబత్తీలు, బూడిదని ఉపయోగించి వెండి ఆభరణాలను శుభ్రం చేస్తే అవి తళతళ లాడతాయి. ఆలివ్ ఆయిల్ లో … Read more

పట్టు చీరలు ఉతికేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు.. మ‌ర‌క‌లను పోగొట్టే చిట్కాలు..!

పట్టుచీరలను మృదుజలంతో ఉతకాలి. కఠిన జలమైతే నీటిని మృదువు చేయడానికి చిటికెడు బోరాక్స్ లేదా అమోనియంను వాడాలి. నాణ్యమైన తటస్థ సబ్బులు పొడి రూపంలోకాని ద్రవరూపంలో కాని ఉపయోగించాలి. కఠిన జలమైతే లైట్ డిటర్జెంట్లను వినియోగించాలి. సబ్బులోని మట్టిని తొలగించడానికి పట్టు వస్త్రాలను వేడి నీటిలో రెండు మూడు సార్లు జాడించాలి. చివరగా చల్లని నీటితో జాడించేటప్పుడు కొన్ని చుక్కల సిట్రిక్ యాసిడ్ లేదా ఎసిటిక్ యాసిడ్‌ను ఉపయోగించాలి. అనుమానపు రంగు కల పట్టు వస్త్రాలు ఉతికే … Read more

సిల్క్ దుస్తుల‌ను ఇలా శుభ్రం చేయండి..!

సిల్క్ చీరలకి, డ్రస్సులకు అంటిన గ్రీజు, నూనె మరకలు వదిలించడానికి వాటిని ఒక బకెట్ నీళ్ళలో కొన్ని చుక్కలు షాంపూ వేసి నానబెట్టండి. కాసేపటి తరువాత ఉతికితే మరకలు మాయమవుతాయి. బట్టలకు తారు అంటితే, తారు తొలగించి, తరువాత మరక ఉన్న చోట యూకలిప్టస్ నూనెతో రుద్దితే మరక పోతుంది. బట్టలకు అంటిన చూయింగ్ గమ్‌ను గంజిపొడితో రుద్ది తొలగించవచ్చు. లేదా గమ్‌ ఉన్న చోట పైన పేపర్‌వేసి వేడిగా ఉన్న ఇస్త్రీపెట్టెను పైనపెడితే పేపర్‌కు అంటుకొని … Read more

దుస్తుల‌కు సిరా మ‌ర‌క‌లు అంటితే ఇలా తొల‌గించండి..!

బట్టలకు రక్తం, సిరా మొదలైన మరకలు అయినట్లయితే ఉప్పు కలిపిన నీటిలో ఉతికి వేడి నీటిలో జాడిస్తే మరకలు సులభంగా పోతాయి. బట్టలపై సిరా మరకలు పోవాలంటే నిమ్మరసం కాని, పుల్లని పెరుగుకానీ ఆ మరకపై వేసి రుద్దండి. ఆ పైన ఉప్పుతో సిరా మరక పోయేంత వరకు రుద్ది ఉతికేయాలి. బట్టలు నానబెట్టే ముందు ఆ నీళ్ళలో కాస్త వెనిగర్ ని కలిపితే బట్టలు రంగులు వెలిసి పోకుండా మెరుస్తూ ఉంటాయి. బట్టల్లో బొద్దింకలు చేరకుండా … Read more

దుస్తుల‌కు అంటిన తుప్పు మ‌ర‌క‌లు పోవాలంటే..?

తుప్పుపట్టిన తీగలపై బట్టలు ఆరేసినప్పుడు లేదా బట్టలకు ఉన్న హుక్స్ తుప్పు పడితే, బట్టలకు తుప్పు మరకలు అవుతాయి. ఆ తుప్పు మరకలు పోవాలంటే మరకల మీద నిమ్మ తొక్కలతో గానీ ఉప్పు కలిపిన నిమ్మరసంతో గానీ రుద్ది ఎండలో వేయాలి. తెల్లటి నూలు వస్త్రాలపై తుప్పుమరకలు పడితే వాటిమీద నిమ్మరసం, ఉప్పు రాసి రెండు గంటలు ఎండలో ఉంచి ఆ తర్వాత ఉతకాలి. తెల్లని బట్టమీద కూర మరకలు పడితే ఆ మరక మీద తెల్లని … Read more

జీన్స్ ప్యాంట్లు రంగు మార‌కుండా ఉండాలంటే ఇలా చేయాలి..!

ఇష్టపడి కొనుక్కున్న జీన్స్ రంగుమారకుండా ఉండాలంటే, అరబక్కెట్ నీటిలో నాలుగు టేబుల్ స్పూన్ల వెనిగర్ వేయాలి. ఈ నీటిలో దుస్తుల్ని కొద్ది సేపు నానబెట్టి ఆ తర్వాత ఉతకాలి. ఊలు, సిల్కు బట్టలు గోరువెచ్చటి నీటిలో పిండిన తరువాత ఒక కాటన్ టవల్లో ఉంచి రోల్ చేస్తే టవల్ వాటి తడిని పీల్చుకుంటుంది. తర్వాత ఆరేయాలి. ఐరన్ బాక్స్ అడుగున కొద్దిగా పారాఫిన్ రాస్తే గంజిపెట్టిన బట్టలు అతుక్కోకుండా ఉంటాయి. ఒక టేబుల్ స్పూను నిమ్మ చెక్కల … Read more

ఆహారపదార్థాలను భద్రపరచుకోవడం ఎలా..?

ఆహారపదార్థాల తయారీ, వాటిని భద్రపరచే విధానాలు తెలిసి ఉంటే అనేక రకాల ప్రమాదకర వ్యాధులను ఆదిలోనే అరికట్టవచ్చు. పదార్థ స్వభావాన్ని బట్టి వేడిగా లేదా చల్లగా ఉంచుతుంటాం. కానీ ఎంత ఉష్ణోగ్రత వరకు వేడిగా ఉంచవచ్చు. చల్లదనం అంటే ఎన్ని డిగ్రీలు? వాటిని వాడుకునేటప్పుడు గది ఉష్ణోగ్రతకు తీసుకురావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఆహారాన్ని ఎంత ఉష్ణోగ్రత వరకు వేడి చేయాలనే ఆయా పదార్థాల మీద, వంటకు వెచ్చించే సమయం మీద ఆధారపడి ఉంటుంది. ఉదా.కు … Read more

ఫ్రిజ్‌తో సమస్యా? చిట్కాలివిగో

వేసవి వచ్చిందంటే ఫ్రిజ్‌ల హడావుడి మొదలైనట్లే. చల్లటి నీళ్లు కావాలని ఒకరు. శీతల పానీయాల కోసం ఇంకొకరు, ఆదేశాలు జారీ చేస్తుంటారు. మండే ఎండాకాలంలో ఫ్రీజ్‌తో ఎలాంటి సమస్యలు వద్దంటే నిర్వహణలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే బాదరబందీలుండవు. మెకానిక్‌ల చుట్టూ ప్రదక్షిణాలు చేసే అవసరమూ రాదు. ఫ్రిజ్‌‌కు స్టెబిలైజర్ తప్పనిసరి. ఇది లేకపోతే వోల్టేజీల్లో తేడా వస్తే ఫ్రిజ్ పనికి రాకుండా పోతుంది. మరమ్మతులకు సుమారు రూ. 3,000 వరకు ఖర్చుతప్పదు. కంప్రెసర్ ఫ్రిజ్ కు … Read more

దోమల బాధ ఎక్కువగా ఉందా.. ఇలా చేయండి..!

చాలా గృహాల్లో దోమల బాధ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నగరాల్లో ఈ దోమలు మరీ ఎక్కువగా ఉంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని చిన్నపాటి చిట్కాల‌ను పాటిస్తే చాలు. దోమ‌లు అధికంగా ఉంటే చాలా మంది మ‌స్కిటో రీపెల్లెంట్స్‌ను వాడుతుంటారు. కానీ వీటిని వాడ‌డం వ‌ల్ల శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అయితే ఇందుకు బ‌దులుగా ప‌లు స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటిస్తే చాలు.. దాంతో దోమ‌ల బెడ‌ద నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ముఖ్యంగా ఇంట్లో విపరీతంగా దోమలు … Read more

ఈ ఆహారాల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ ఫ్రిజ్‌లో పెట్ట‌కూడ‌దు..!

నేటి సమాజంలో ఫ్రిజ్, టీవీ లేని ఇల్లు అంటూ లేదు. ఎంతపేద కుటుంబం అయినా ఇవి వాడుతూనే ఉన్నారు. ఇక మనం కూరగాయాలు బయట ఉంటే పాడైపోతాయని తప్పనిసరిగా ఫ్రిజ్‌లో పెట్టాలి అనుకుంటాం. అయితే అన్ని కూరగాయాలకు ఫ్రిజ్‌లో ఆశ్రయం ఇవ్వాల్సిన అవసరం లేదు. టమాటా ఫ్రిజ్‌లో పెడితే చల్లదనానికి పైపొర పాడవుతుంది. కావున రూం టెంపరేచర్‌లోనే వాటిని ఉంచాలి. ఎక్కువ టమాటాలు కొనేయకుండా అవసరం ఉన్న వరకే వాటిని కొనుగోలు చేయడం మంచింది. అంతేకాదు కీరదోస‌ను … Read more