మ‌ల‌బ‌ద్ద‌కంతో బాధ‌ప‌డుతున్నారా.. రోజూ ఈ పండ్ల‌ను తినండి..!

భారతదేశంలో దాదాపు 22శాతం జనాభా మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారని నిపుణుల అభిప్రాయం. చాలా మందికి ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. పేగులని ఖాళీ చేసుకోకపోతే వచ్చే అనేక ఇబ్బందులు చికాకు కలిగిస్తుంటాయి. మలబద్దకం సమస్య రావడానికి గల ముఖ్య కారణాల్లో మొదటిది మన జీవన విధానం. ప్రాసెస్డ్ ఫుడ్ కి అలవాటు పడడం అతిగా తాగడం, పొగ పీల్చడం వంటి వాటివల్ల మలబద్దకం అనేది సమస్యగా తయారవుతుంది. ఈ సమస్య నుండి బయటపడడానికి వాముని(ఓమ) నీటిలో … Read more

పిల్ల‌ల‌కు డైప‌ర్లు వేస్తున్నారా..? ర్యాషెస్ రావొద్దు అంటే ఇలా చేయండి..!

చిన్న పిల్లలు రోజంతా డైపర్ వేసుకోవడంతో ఒక్కోసారి ర్యాషెస్ ఏర్పడుతాయి. దాంతో వాళ్లు చాలా ఇబ్బంది పడతారు. కానీ కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల డైపర్ ర్యాషెస్ రావు. డైపర్ వేసే ముందు ఒక బట్టను వేడి నీటిలో ముంచి ఒళ్ళు తుడవాలి. తర్వాత పొడి బట్ట తో తుడిచి, పౌడర్ రాసి అప్పుడు డైపర్ వేయాలి. ఒకసారి డైపర్ వల్ల ర్యాషెస్ వస్తే అవి తగ్గే వరకు డైపర్ వేయకూడదు. ఇలా చేయడం వల్ల తొందరగా … Read more

గ్రీన్ టీని ఎలా త‌యారు చేస్తారో తెలుసా..? దీన్ని ఎవ‌రు తాగ‌కూడ‌దు అంటే..?

గ్రీన్ టీ… నేడు చాలా మంది నోట వినిపిస్తున్న మాట ఇది. గ్రీన్ టీ తాగితే బ‌రువు త‌గ్గుతామ‌ని, సాధార‌ణ టీ క‌న్నా గ్రీన్ టీ ఎంతో బెట‌ర‌ని ఇప్పుడు చాలా మంది దీన్ని తాగేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. అయితే నిజానికి గ్రీన్ టీ అంటే ఏమిటి..? ఆ టీ పొడిని ఏ ఆకుల‌తో త‌యారు చేస్తారు..? అస‌లు గ్రీన్ టీ వల్ల కేవ‌లం బ‌రువు మాత్ర‌మే త‌గ్గుతారా..? ఇంకా మ‌న‌కు దాని వ‌ల్ల ఎలాంటి లాభాలు … Read more

హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను చెవిలో ఉన్న డస్ట్‌ను శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చా?

చెవిలో సహజంగా పేరుకునే దుమ్ము,గుబిలిని శుభ్రం చేయడానికి శరీరం ఒక వ్యవస్థను ఏర్పరుచుకుని ఉంది… ఒకటి చెవి నిర్మాణం. చెవి లోపల ఉన్న నూనూగు వెంట్రుకలు దుమ్మును లోపలికి చేరకుండా ఆపుతాయి. మిగతాది గుబిలికి అంటుకుంటుంది.(గుబిలి అనేది చెవిలో సహజంగా గ్రంధుల నుండి ఉత్పత్తి అయ్యే ఒక ద్రావణం. దానికి చర్మ మృతకణాలు,దుమ్ము కలిసి ఘనీభవిస్తుంది.) ఆ గుబిలిని బయటికి పంపేందుకు ముందుగా మనం అనుకున్నట్టు చెవి సహజ నిర్మాణం సహకరిస్తే మరొకటి మన దవడ కదలికలు. … Read more

టీ తాగితే గుండె పోటు రాకుండా అడ్డుకోవ‌చ్చ‌ట‌..!

మహిళలు ప్రతిరోజూ 3 కప్పుల టీ తాగుతూంటే గుండె సంబంధిత వ్యాధులు, గుండె పోట్లు రావని ఒక పరిశోధనలో కనుగొన్నారు. ఒక ఫ్రెంచి పరిశోధన మేరకు ప్రతి రోజూ 3 కప్పుల‌ టీ తాగితే మహిళలకు రక్తనాళాలలో కొవ్వు, కొల్లెస్టరాల్ మొదలైనవి గడ్డలు కట్టి అడ్డంకులు ఏర్పడవని, ఈ కారణంగా వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా వుంటుందని వెల్లడైంది. ఈ పరిశోధన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ డి లా శాంటి ఎట్ డిలా … Read more

జారిపోయిన వ‌క్షోజాలు మ‌ళ్లీ బిగువుగా మారాలంటే.. మ‌హిళ‌లు ఈ వ్యాయామాల‌ను చేయాలి..!

వక్షోజాలు సాగి కిందకు వాలినట్లు మీ ఫొటోలు చూపుతున్నాయా? అవి ఎంత టైట్ బ్రాసరీలు వేసినా అవుట్ ఆఫ్ షేప్ అయిపోయాయనుకుంటున్నారా? మార్గం మేం చెపుతాం! మీ స్తన సౌందర్యాన్ని ఆకర్షణీయంగా వుంచుకోవాలంటే మరోమారు వ్యాయామాలతో రీ ఛార్జ్ చేయాల్సిందే! బిగువైన స్తన సౌందర్యానికి చిన్నపాటి వ్యాయామాలెలా చేయాలో చూడండి! బ్రెస్ట్ బిగువుగా వుండాలంటే బ్రాండెడ్ బ్రా లు చాలవు. టీనేజ్ పిల్లలకు ఏ దుస్తులు వేసినా బిగువే. కాని వయసు పైబడిందంటే, పిల్లలకు పాలిస్తే, గర్భవతులుగా … Read more

వేస‌వి కాలం మొదలైంది.. కీర‌దోస‌ను తింటున్నారా.. లేదా..?

ఎక్కువగా కీరదోసకాయను ఉపయోగించి సలాడ్స్ వంటివి చేసుకుంటూ ఉంటాము. దీంట్లో విటమిన్ సి, వాటర్ కంటెంట్, మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ మరియు క్యాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ప్రతి రోజూ తీసుకోవడం చాలా మంచిది. దీనిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల పొట్ట శుభ్రపడుతుంది. కీరదోస కాయ ఒకటి కాకుండా క్యారెట్ ఆపిల్స్ వంటి వాటితో కలిపి సలాడ్ చేసుకుని తీసుకుంటే రుచిగా ఉంటుంది. కీర దోసని తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఇప్పుడు … Read more

నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌డం లేదా..? అయితే ఈ ఆహార ప‌దార్థాల‌ను తిని చూడండి. నిద్ర త‌న్నుకు వ‌స్తుంది..!

నిత్యం వివిధ సంద‌ర్భాల్లో మ‌నం ఎదుర్కొనే ఒత్తిడి, ప‌ని భారం, ఆందోళ‌న‌, మానసిక స‌మ‌స్య‌లు, దీర్ఘ కాలిక ఆరోగ్య స‌మ‌స్య‌లు… తదిత‌ర అనేక కార‌ణాల వ‌ల్ల మ‌న‌లో చాలా మంది స‌రిగ్గా నిద్ర‌పోవ‌డం లేదు. బెడ్‌పై ప‌డుకున్న ఏ 2, 3 గంట‌ల‌కో అటు దొర్లి, ఇటు దొర్లి అతి క‌ష్టంగా నిద్ర‌పోతున్నారు. దీంతో తెల్ల‌వారుజామున ఆల‌స్యంగా నిద్ర లేస్తున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. అయితే అలా ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా … Read more

ఇవి పేరుకే హెల్దీ ఫుడ్స్…..తిన్నారంటే మీకు త‌ప్ప‌వు సైడ్ ఎఫెక్ట్స్.!!

నిజ‌మే… ఒక‌ప్ప‌టి కంటే ఇప్పుడు మ‌న‌లో చాలా మందికి ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ బాగా పెరిగింది. అందులో భాగంగానే నిత్యం ఏదో ఒక విధంగా శారీర‌క శ్ర‌మ చేస్తున్నారు. ఒంట్లో చేరిన అద‌న‌పు కొవ్వును, అధిక బ‌రువును త‌గ్గించుకుంటున్నారు. అది సరే..! అంత వ‌ర‌కు బాగానే ఉంది. కానీ ఆహారం విష‌యానికి వ‌చ్చే సరికి మాత్రం ప‌ప్పులో కాలేస్తున్నారు. అదేనండీ… ఈ మ‌ధ్య ఇన్‌స్టంట్ నూడుల్స్ మాదిరిగానే ప‌లు ఇన్‌స్టంట్‌, ప్యాక్డ్ ఫుడ్స్ మ‌న‌కు అందుబాటులోకి వ‌చ్చాయి … Read more

తరచు అనారోగ్యంతో బాధపడ్తున్నారా ?? శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరగాలంటే ఇది చేయండి..

నిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతుంటాం. ప్రధానంగా తీసుకునే ఆహారపదార్థాలు, మానసిక రుగ్మతల కారణంగా అనారోగ్యం బారిన పడుతుంటాం. వ్యాధినిరోధక శక్తి తగ్గడం వల్ల వెంటనే అనారోగ్యానికి గురవుతుంటాం. వ్యాధి నిరోధక శక్తి పెంపొందించాలంటే నిత్యం కొన్ని ఆహారపదార్థాలను తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. అందులో సిట్రస్ ఫలాలు.. విటమిన్ – సి సిట్రస్ ఫలాల్లో ఎక్కువగా ఉంటుంది. నిమ్మ, నారింజ రసాలు ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ -సి శరీరంలో తెల్లరక్తకణాలను … Read more