న‌గ‌రానికి దూరంగా ఫామ్ హౌస్ ఏర్పాటు చేసిన వ్య‌క్తి.. అందులో వాస్తు మార్పులు చేయించాలని చూస్తే..?

హైదరాబాద్ కి చెందిన సత్యనారాయణ ప్రముఖ వ్యాపార వేత్త, హైదరాబాద్ శివారు పల్లెటూరులో కొంతభూమిని కొని, అక్కడ ఒక ఫామ్ హౌస్ ని కట్టుకున్నారు. ఆ ఫామ్ హౌస్ వెనుక వైపు ఒక చక్కని స్విమ్మింగ్ పూల్, గార్డెన్ కూడా ఏర్పటుచేసుకున్నారు. వాటితో పాటూ అక్కడ ఒక పెద్ద ఆహ్లాదపరిచే 50 ఏళ్ళ నాటి మామిడి చెట్టు కూడా ఉంది. నిజానికి ఆయన ఆ ఆస్తి కొన్నది కూడా ముఖ్యంగా ఆ పెద్ద మామిడిచెట్టును చూసి ముచ్చటపడే. … Read more

నిజ‌మైన విప్ల‌వ‌కారుడు.. గొప్ప ప్రేమికుడు.. చేగువేరాపై క‌థ‌నం..

విప్ల‌వం అంటే ఏమిటో చైత‌న్యం అంటే ఎలా వుంటుందో ఆచ‌ర‌ణ‌లో చూపించిన వాడు. మ‌హోన్న‌త మాన‌వుడు, ఉద్య‌మానికి ఊపిరి పోసిన వ్య‌క్తి. పోరాటానికి ప్ర‌తిరూపం. ప్ర‌పంచానికి ఆద‌ర్శం. నిత్య చైత‌న్య‌దీప్తి ఆయ‌న‌. ఎంత చెప్పినా త‌నివి తీర‌దు. గుండె కొట్టుకోవ‌డం ఆగ‌దు. జ‌ల‌పాతం ఎలా ఉంటుందో స‌ముద్రం ఎలా ఉప్పొంగుతుందో సునామీ ఎలా ఉంటుందో ఆయుధాన్ని ధ‌రించిన వాడు అత‌డే జ‌నం మెచ్చిన యోధానుయోధుడు. కోట్లాది ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాలు పొందుతున్న పోరాట స్ఫూర్తి – చేగ‌వేరా. అడుగులు … Read more

ఛార్లీ చాప్లిన్ చెప్పిన జీవిత సత్యం.. అది కూడా ఒక జోక్ తో…!

అతను నవ్వుకు, నవ్వించాడినికి కేరాఫ్ అడ్రస్.. సంపూ స్టైల్లో చెప్పాలంటే కామెడీకి ఎప్పుడైనా కామెడీ కావాలనిపిస్తే వెళ్లి ఆయన తలుపు కొడుతుంది. ఉపోద్ఘాతాలు అవసరం లేని పేరు ఆయనది. ఆ పేరు చెబితేనే ఎవరో గిలిగింతలు పెడతుతూ నవ్విస్తున్నారే ఫీల్ కలుగుతుంది. అతనే చార్లీ చాప్లిన్. అలాంటి కామెడీ కింగ్ ఓ స్టేజ్ షోలో జీవిత సత్యాన్ని తన జోక్ కు లింక్ చేసి అందరినీ ఏడిపించాడు. అదేంటో మనమూ చూద్దాం! ఓ స్టేజ్ షో లో … Read more

ప్ర‌పంచాన్నంత‌టినీ త‌న హాస్యంతో న‌వ్వించిన చార్లీ చాప్లిన్ జీవితంలో ఇంత‌టి విషాదాలు దాగి ఉన్నాయ‌ని మీకు తెలుసా..?

బ్ర‌ష్ మాదిరిగా ఉండే చిన్న మీసం.. బిగుతైన చిరిగిన కోటు.. వ‌దులు ప్యాంటు… పెద్ద సైజు బూట్లు.. చేతిలో వంకీ కర్ర‌… వంక‌ర టింక‌ర న‌డ‌క‌… ఇవ‌న్నీ విన‌గానే ఇప్ప‌టికే మేం చెప్ప‌బోతున్న వ్యక్తి ఎవ‌రో మీకు గుర్తుకు వ‌చ్చే ఉంటుంది క‌దా. అవును, ఆయ‌నే.. చార్లీ చాప్లిన్‌. ఈ పేరు వింటేనే ఆయ‌న చేసిన హాస్య సినిమాలు గుర్తుకు వ‌స్తాయి. ఎన్నో సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా ఇప్ప‌టికీ చాప్లిన్ సినిమాల‌ను ఆస‌క్తిగా చూసేవారు చాలా మంది ఉన్నారు. … Read more

కాల్ గ‌ర్ల్ తో నేను.. చివ‌రి క్ష‌ణంలో మారిన నిర్ణ‌యం.. నిల‌బ‌డిన జీవితం.. రియ‌ల్ స్టోరీ..!

అవి నేను ఇంజ‌నీరింగ్ చ‌దివే రోజులు. మా ఫ్రెండ్ పండు గాడి బ‌ర్త్ డే….అప్ప‌టి వ‌ర‌కు బ‌ర్త్ డే అంటే…ఏ రెస్టారెంట్ కో, దాబాకో వెళ్ళి తిన‌డం, తాగ‌డం లాంటివి చేసేవాళ్లం…కానీ ఇంజ‌నీరింగ్ థ‌ర్డ్ ఇయ‌ర్ కు వ‌చ్చే స‌రికి మా ఆలోచ‌న‌ల్లో ఛేంజ్ వ‌చ్చేసింది. అందుకే ఈ సారి పండు గాడి బ‌ర్త్ డేను డిఫ‌రెంట్ గా ప్లాన్ చేశాం.! అంద‌రం త‌లా కొంత వేసుకొని….ఓ కాల్ గ‌ర్ల్ కు ఫోన్ చేశాం..రేట్ ఫిక్స్ చేసుకున్నాం, … Read more

గారాబం చేస్తే ఇలా అవుతుందా..? థైరోకేర్ వ్యవస్థాపకుడి అద్భుతమైన పేరెంటింగ్‌ పాఠం..

అతిగారాబం ఎన్నటికీ అనర్థమే అని మన పెద్దలు చెబుతుంటారు. పిల్లల్ని ముద్దు చేయాల్సినప్పుడూ ముద్దు చేయాలి, బాధ్యతయుతంగా ప్రవర్తించకపోతే గట్టిగా మందలించాలి కూడా. రెండూ సమతూకంలో ఉండాలి లేదంటే..ఎందుకు పనికిరానివారుగా తయారవుతారని హెచ్చరిస్తున్నారు థైరోకేర్ వ్యవస్థాపకుడు. గారాబం వల్ల చిన్నారులు పాడైపోవడమే గాక అది మొత్తం కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో..తెలియజేసే అద్భుతమైన రియల్‌ స్టోరీని షేర్‌ చేసుకున్నారు థైరోకేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏ. వేలుమణి. మంచి పేరేంటింగ్‌ కుటుంబానికి ఎలా శ్రీరామరక్షలా ఉంటుందో హైలెట్‌ చేసి … Read more

వృద్ధుల‌ను త‌న తల్లిదండ్రులుగా భావించి అన్నీ తానై సేవ చేస్తున్న డాక్ట‌ర్ ఇత‌ను.. హ్యాట్సాఫ్‌..

ఆయన ముంబైకి చెందిన డాక్టర్ ఉదయ్ మోడీ. 11 సంవత్సరాల క్రితం, ఒక వృద్ధుడు చికిత్స కోసం అతని వద్దకు వచ్చాడు. అతన్ని చూసిన తర్వాత అతను పేదవాడని గ్రహించాడు. ఆ వృద్ధుడు ఏడవడం ప్రారంభించి, తనకు ముగ్గురు కుమారులు ఉన్నారని, కానీ వారు త‌న‌ కోసం డబ్బు ఖర్చు చేయరని, తిండి కూడా పెట్ట‌రని చెప్పాడు. అతని భార్యకు పక్షవాతం వచ్చింది, ఆమె లేచి నడవలేదు. అతని వయస్సు 84 సంవత్సరాలు అయినప్పటికీ ఆ వృద్దుడు … Read more

ప్ర‌పంచానికి మ‌ద‌ర్ థెరిస్సా చెప్పిన అద్భుత‌మైన సూక్తులు, సందేశాలు ఇవే..!

మ‌ద‌ర్ థెరిస్సా గురించి అంద‌రికీ తెలిసిందే. ఈమెది వేరే దేశం అయిన‌ప్ప‌టికీ మ‌న దేశాన్ని ప్రేమించింది. ఇక్క‌డ ఉన్న పేద‌ల‌కు, అనాథ పిల్ల‌ల‌కు ఎంత‌గానో సేవ‌లు చేసింది. అందుక‌నే సేవాగుణాన్ని ఆమె నుంచి పుణికి పుచ్చుకోవాల‌ని చెబుతుంటారు. ఈ క్ర‌మంలోనే మ‌ద‌ర్ థెరిస్సా ప్ర‌పంచానికి అనేక సందేశాలు ఇచ్చింది. వాటి వివ‌రాల‌ను ఇప్పుడు చూద్దాం. నేను విరుద్ధ స్వభావమును కనుగొన్నాను, అది మిమ్మల్ని బాధించేవరకు మీరు ప్రేమిస్తే, అక్కడ ఏ బాధా ఉండదు, మరింత ప్రేమ తప్ప. … Read more

చార్లీ చాప్లిన్ చెప్పిన అద్భుత‌మైన స‌త్యాలు.. ఇవి గ‌న‌క పాటిస్తే ఎలాంటి క‌ష్టాలు కూడా ఎవ‌రినీ ఏమీ చేయ‌లేవు..

చార్లీ చాప్లిన్ కళాకారుడు. ఇతను అనేక కలల్లో నిష్ణాతుడు. తెరపైన అమాయకుడిలా కనిపించే చాప్లిన్ నిజానికి మంచి రచయిత, అందగాడు, గాయకుడు కూడా. యుద్ధాన్ని నిరంతరం విమర్శించే శాంతిప్రియుడు. ఛార్లీ చాప్లిన్ దయార్థ్ర హృదయుడు. అందానికి ఆరాధకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ప్రపంచాద్భుతాల్లో ఒకడు. ఆయ‌న త‌న జీవితంలో ఎంతో అనుభ‌వం గ‌డించాడు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న చెప్పిన కొన్ని ముఖ్య‌మైన సూత్రాల‌ను, విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరికైనా కీడు చేయాలన్నప్పుడే మాత్రమే మనకు శక్తి … Read more

ఆ మహిళలు పసిపిల్లలతోపాటు జింక పిల్లలకు కూడా పాలిచ్చి పెంచుతున్నారు..! ఎందుకో తెలుసా..?

భారతదేశంలో ఎన్నో వర్గాలకు చెందిన ప్రజలు జీవనం సాగిస్తున్నారన్న విషయం విదితమే. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు తమ ఆచారాలు, సాంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో కొన్ని వర్గాలు కనుమరుగై పోగా, మరికొందరు తమ తమ ఆచారాలను, వ్యవహార శైలిని మరిచిపోయారు. కానీ రాజస్థాన్‌లోని ఆ వర్గానికి చెందిన ప్రజలు మాత్రం కొన్ని వందల ఏళ్ల కిందటి తమ ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. అయితే అదేదో మూఢాచారం మాత్రం … Read more