మన తాత ముత్తాలు వరి అన్నాన్ని కేవలం పండుగలప్పుడు మాత్రమే తినేవారా..? అసలు అప్పట్లో వారు ఏం తిన్నారు..?
మన తాతముత్తాతల్లో చాలామంది వరి అన్నాన్ని పండగ పూట మాత్రమే తినేవారు. కానీ ఈ రోజు మనం ప్రతి రోజు తెల్ల అన్నాన్ని తింటున్నాము. మనకు తెల్ల అన్నంతో విడదీయ రాని బంధం ఏర్పడింది. పూర్వం అంటే ఓ డెబ్భై ఏళ్ళ క్రితం చాలా తెలుగు ప్రాంతాల్లో వరిఅన్నం పండగలప్పుడే తినే వారట. ఎందుకూ అంటే.. వరి పండడానికి మాగాణి నేలలు కావాలి. అంటే నీరు ఎక్కువగా అవసరం అవుతుంది. అంటే ఎల్లప్పుడూ పారే నీటి వసతి…