బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటే ఏమిటి..? ఇది మహిళలకు ఎందుకు వస్తుంది..?
బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అనే వ్యాధి కూడా గుండెకు సంబంధించినదే. ఇది ఎక్కువగా మహిళలలో వస్తుంది. తాత్కాలికంగా గుండె కండరం బలహీనపడి రక్తనాళాలు సాధారణంగా స్పందించలేవు. ఈ వ్యాధిని గతంలో టరోట్సుబో కార్డియోమయోపతీ అని పిలిచేవారు. అయితే ఇపుడు దీనిని ఒత్తిడి గుండెనొప్పి లేదా ఎపికల్ బెలూన్ సిండ్రోమ్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ రకమైన గుండె జబ్బు, ప్రత్యేకించి మహిళలకు అధిక ఒత్తిడి లేదా విచారకర సంఘటనలతో అంటే భాగస్వామి చనిపోవటం, భయం గొలిపే వైద్య…