సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగులు పెన్‌ డ్రైవ్‌తో పట్టుబడితే ఉద్యోగానికే ప్రమాద‌మా..? ఎందుకు..?

మేము హోసూర్‌లో టాటా (తనిష్క్) వారి నగలు, వాచీల తయారీ కేంద్రానికి సందర్శకులుగా వెళ్ళినపుడు లోపలకు వెళ్ళేముందు (ఆడవారు తాళితో సహా) వొంటిపై ఒక్క ఆభరణమూ ఉంచుకోకుండా తీసేయమని చెప్పారు. ఫోన్లు, పర్సులు ఏవీ ఉండకూడదు – వారిచ్చిన లాకర్లలో భద్రపరచాలి. తరువాత బాగా తనిఖీ చేశాకే లోనకు పంపారు. అంతే కాక లోపలి నుండి బయటకు వచ్చేప్పుడు ముందుగా నేలలోని పెద్ద ఫానుపై నిలబెట్టి (పొరబాటున ఏమైనా పసిడి ధూళి బట్టలకు అంటుకుంటే దులిపేసెందుకు), ఆపై … Read more

టైట్‌గా ఉండే బ్రాల‌ను ధ‌రిస్తే మ‌హిళ‌ల‌కు ఏం జ‌రుగుతుందో తెలుసా..?

వేసుకునే బ్రాసరీ సరి అయిన సైజు కాకుంటే మహిళలకు అది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. బ్రెస్ట్ కేన్సర్ కూడా వచ్చే అవకాశాలున్నాయంటారు వైద్యులు. వక్షోజాలు బిగువుగా వుంటే మంచి షేప్లో కనపడతామని మహిళలు భావిస్తారు. కాని అది ఆరోగ్యరీత్యా చాలా ప్రమాదకరం. ఆధునిక ఫ్యాషన్ తీరులో ఆరోగ్యాలు అడుగంటుతున్నాయనటానికి ఇదొక ఉదాహరణ కాగలదు. నేటి ఫ్యాషన్ ట్రెండ్ బిగువైన బ్రాసరీలపై వుంది. కాని వారికి తెలియకుండానే మహిళలు దీని కారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. టైట్ … Read more

భార‌తీయుల్లో అధికంగా వ‌స్తున్న గుండె పోటు.. కార‌ణం అదే..?

తాజా పరిశోధనల మేరకు 2026 నాటికి భారత దేశంలో సంవత్సరానికి 2.6 మిలియన్ల గుండె పోటు కేసులు వుంటాయని అంచనాగా తేలింది. కారణం కొల్లెస్టరాల్ స్ధాయి పెరగటం. డెన్మార్క్ లో చేసిన తాజా పరిశోధనలో భారతదేశంలో వచ్చే గుండెపోట్లు చెడు కొల్లెస్టరాల్ కంటే కూడా ట్రిగ్లీసెరైడ్స్ స్ధాయి అధికంగా వుండటం వలనే వస్తున్నట్లు తేలింది. ఆహారం అధికంగా తినటం వలన మహిళలలోను, పురుషులలోను ట్రిగ్లీసెరైడ్స్ స్ధాయి పెరుగుతోందని, ఈ అదనపు కేలరీలు లివర్ లో ఫ్యాట్ సెల్స్గా … Read more

టైప్‌2 డ‌యాబెటిస్ ఉందా.. అయితే ఈ సూచ‌న‌లు పాటించండి..!

మీరు లేదా మీ ఇంటిలోని సభ్యులు టైప్ 2 డయాబెటీస్ తో బాధ పడుతున్నారా? ఈ టైప్ 2 డయాబెటీస్ ను నియంత్రించేందుకు కొన్ని చిట్కాలు చూడండి. ఎపుడూ ఊహించుకోకండి – ఏం తినాలి? ఏం తినకూడదు లాంటివి ఊహించకండి. వైద్యుడిని సంప్రదించండి. తినకుండా వుండవలసినవి కొవ్వులు, షుగర్, నూనెలవంటివే కాదు. ఆహార సమతుల్యతకు ఇంకా అనేక పదార్ధాలుంటాయి. వైద్య నిపుణుల సలహా తీసుకొని ఆహారాన్ని మెయిన్టెయిన్ చేయడం అవసరం. మీరు ఏం తింటున్నారనేది తెలుసుకోవాలి – … Read more

వంటింట్లో ఉండే ఈ మ‌సాలా దినుసుల‌ను రోజూ వాడండి.. ఆరోగ్యంగా ఉండండి..

ప్రతి రోజు మనం తినే ఆహారంలో ఎన్నో రకాల మసాలా దినుసులును వాడుతున్నాము. అవి రుచిని పెంచడానికి మాత్రమే అని అనుకుంటే పొరపాటే. మసాలా దినుసుల‌ వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. జీలకర్ర వల్ల జీర్ణప్రక్రియ ఎంతో మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరంగా ఉండటం, అజీర్తి వంటి సమస్యల తో బాధపడుతున్న వారికి జీలకర్ర ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి సమస్యలున్నప్పుడు జీలకర్రను నిమ్మ రసం తో కలిపి ఉదయం మరియు సాయంత్రం తినడం మేలు. ఇలా … Read more

రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే చాయ్‌.. వీటిని వేసి త‌యారు చేయ‌వ‌చ్చు..

భారతదేశ ప్రజలకు తెల్లవారగానే ఛాయ్ నోట్లో పడితే గానీ రోజు మొదలవదు. ఛాయ్ తాగగానే అదోలాంటి కొత్త ఉత్తేజం ఏదో వచ్చినట్టు అవుతుంది. ఛాయ్ తాగకపోతే రోజంతా ఏదో కోల్పోయినట్టుగా ఫీలవుతారు. మనసుకి ఉత్తేజాన్నిచ్చి, మరలా మరలా తాగాలనిపించే కోరిక కలిగించే ఛాయ్ ని తాగని వారు చాలా తక్కువ. ఐతే ఛాయ్ తో ప్రశాంతత మాత్రమే కాదు ఆరోగ్యం కూడా వస్తుంది. గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వుని కరిగించడంతో పాటు ఆరోగ్యాన్ని … Read more

పెద‌వులు త‌ర‌చూ పొడిబారుతున్నాయా..? అయితే అలా ఎందుకు జ‌రుగుతుందో తెలుసా..?

చాలా మందికి తరచుగానే పెదవుల పై పొర రాలుతూ ఉంటుంది. దీనికి కారణం శరీరం లో జరిగే మార్పులు మరియు వాతావరణం లో వచ్చే మార్పులు. అంతేకాదు పెదవులు పొడిబారడానికి చాలా కారణాలు ఉన్నాయి. పెదవులు ఎందుకు పొడిబారతాయి? ఎక్కువగా పని చేయడం వల్ల వచ్చే ఒత్తిడికి శరీర వ్యవస్థ లో మార్పులు వస్తాయి, దాంతో ముందుగా మార్పు కనిపించేది పెదవుల లోనే. ఎక్కువగా యాంటీ బయోటిక్స్ వాడటం వల్ల శరీరం తేమను కోల్పోతుంది, దాని వల్ల … Read more

శివ‌లింగం క‌నిపించని ఆల‌యం.. ఎక్క‌డ ఉందో, దీని ప్ర‌త్యేక‌త ఏమిటో తెలుసా..?

మన దేశంలో అతిపురాతన అద్భుత ఆలయాలు ఉన్నాయి. మ‌రి కొన్ని ఆలయాల్లో మనం చూసే అద్భుతాలకు ఇప్పటికీ కూడా సమాధానాలు లేవు. అలాంటి ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. అయితే శివలింగం లేని శివాలయాన్ని ఎక్కడైనా చూసారా? కానీ కేరళలో అలాంటి శివాలయం కనిపిస్తుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన త్రిస్సూర్‌లో వడక్కునాథన్‌ ఆలయం ఉంది. కేరళలోని పురాతన ఆలయాల్లో ఇది ఒకటి. శివుణ్ని వీరు వడక్కునాథన్‌గా ఆరాధిస్తారు. ఈ ఆలయం కేరళీయుల నిర్మాణ శైలికి … Read more

కేవ‌లం కొద్ది రోజులు మాత్ర‌మే క‌నిపించే శివ‌లింగం ఇది.. దీని ప్ర‌త్యేక‌త ఏమిటో తెలుసా..?

అమర్నాథ్ గుహ హిందువుల పుణ్యక్షేత్రం. ఈ గుడి భారత్ లోని జమ్మూ కాశ్మీర్ లో ఉంది. అమర్నాథ్ కేవలం ఒక గుహ మాత్రమే కాదు. దాని వెనుక ఒక విశిష్ట గాథ ఉంది. ఈ అమరనాథ్ దేవాలయం అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రం. ఈ క్షేత్రానికి పహల్ గాం గ్రామం నుంచి వెళ్ళాలి. జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని కోరుకుంటారు. ఈ గుహ చుట్టూ ఎత్తైన మంచుకొండలు ఉంటాయి. వేసవి కాలంలో తప్ప మిగిలిన సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడే … Read more

ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే దీర్ఘాయువు పొంద‌వ‌చ్చ‌ట తెలుసా..?

భీమకాళీ దేవాలయం ప్రధానమైన పుణ్యక్షేత్రం. ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లోని సరహన్‌లో ఉంది. ఈ దేవాలయాన్ని దాదాపు 800 ఏండ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణం జరిగిందని భావిస్తారు. విలక్షణమైన భారతీయ హిందూ, బౌద్ధుల నిర్మాణ శైలిల సమ్మేళనంతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. తెల్లవారుఝామున, సాయంత్రం హారతి వేళల్లో మాత్రమే ఈ పురాతన ఆలయం భక్తుల సందర్శనార్ధం తెరచి ఉంటుంది. భారత దేశంలోనే శక్తి పీఠాలలో ఒకటి ఈ భీమకాళీ ఆలయం. ఈ ఆలయంలో భీమకాళీ … Read more