దుర్గాదేవికి ఈ పూలతో పూజ చేస్తున్నారా… అయితే జాగ్రత్త!
సాధారణంగా మనం పూజ చేయడం కోసం వివిధ రకాల పువ్వులను ఉపయోగిస్తాము. రంగు రంగు పువ్వులతో సువాసనలు వెదజల్లే పుష్పాలతో ఆ దేవ దేవతలకు పూజ చేయడం వల్ల వారి అనుగ్రహం కలుగుతుందని భావిస్తారు. అయితే కొన్ని పువ్వులు కొంతమంది దేవుళ్లకు ఎంతో ప్రీతికరం. అదేవిధంగా మరికొన్ని పుష్పాలతో ఇతర దేవుళ్లకు పూజలు అస్సలు చేయకూడదు. భారతీయ సంప్రదాయాల ప్రకారం దుర్గమాత పూజకి ఎటువంటి పరిస్థితులలో కూడా జిల్లేడు, నందివర్ధనం, పారిజాత పుష్పాలు, నాగ చంపా, బృహస్పతి,…