మంగళ, శుక్రవారాల్లో ఇతరులకు డబ్బులు ఇవ్వరు ఎందుకంటే..?

మన భారతదేశంలో అనేక సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. ఇవి పూర్వకాలం నుంచి వస్తున్న సాంప్రదాయాలు. ఇక ఈ సాంప్రదాయాలను డబ్బు విషయంలో ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. ఎందుకంటే డబ్బులు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి. అలాంటి డబ్బును ఒక వారంలో రెండు రోజులు ఇతరులకు అస్సలు ఇవ్వరు. వారిస్తే తీసుకుంటారు కానీ ఇతరులకు డబ్బులు మాత్రం ఇవ్వరు.. మరి అలా ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.. బృగు మహర్షి బ్రహ్మదేవుడికి మానస పుత్రుడు. సప్త ఋషుల్లో అయిన‌ … Read more

హిందువులు ఎరుపు రంగుకు అత్యంత ప్రాధాన్య‌త‌ను ఎందుకు ఇస్తారో తెలుసా..?

ఎరుపు రంగు ప్రేమకు చిహ్నం. మీకు తెలుసా?…డెస్టినీ కలర్ కూడా ఎరుపే. అయోమయం చెందకండి. ఎరుపు రంగుకున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఎరుపు రంగుకి సంబంధించి ఎన్నో సర్ప్రైజింగ్ సీక్రెట్స్ ఉన్నాయి. అవన్నీ ఈ ఆర్టికల్ లో మీకు తెలియచేస్తాం. ఇక చదవండి మరి.. అందమైన రంగు ఎరుపు. హిందూయిజానికి చెందిన దాదాపు ప్రతి పండగలో అలాగే ఆచారంలో ఎరుపు రంగుకి అవినాభావ సంబంధముంది. హిందూ మతానికి చెందిన పెళ్లి వేడుకలలో ఎరుపు రంగుకి ఎంతో … Read more

దేవుడిని 2 సార్లు చూశాన‌ని చెప్పిన ఈ నాగ సాధువు గురించి ఈ విష‌యాలు తెలుసా..?

దేవుడిని రెండుసార్లు చూశాను. రూ.40 లక్షల వార్షిక ప్యాకేజీని వదిలి ఎంటెక్ బాబాగా మారిన దిగంబర్ కృష్ణ గిరి ఈ సత్యాన్ని వెల్లడించారు. ఎంటెక్ బాబా ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌లో, వివిధ సాధువులు తమ ప్రత్యేకమైన జీవిత కథ, ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ బాబాలలో కొందరు కుంభ్ ముగిసిన వెంటనే అదృశ్యమయ్యారు. ఇటీవల ఐఐటి బాబా గురించి చాలా చర్చలు జరిగాయి, కానీ ఇప్పుడు ఎంటెక్ బాబా పేరుతో పిలువబడే మరొక ప్రత్యేక బాబా ముఖ్యాంశాలలో … Read more

గోమాత ఇంత‌టి ప్రాధాన్య‌త‌ను కలిగి ఉంటుందా..? అందుక‌నేనా అందరూ పూజిస్తారు..?

భారతీయులు ఆవును గోమాత అని పిలుస్తారు. గోవు పవిత్రతకు, శుభానికి చిహ్నం. గోవు పాలు, మూత్రము, పేడ ఎంతో పవిత్రమైనది. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించడం ఎంతో శుభశకునంగా భావించబడింది. శ్రీ కృష్ణ పరమాత్మ గోపాలకుడిగా వ్యవహరించాడని పురాణాలు చెబుతున్నవి. ఒక గోవును దానం చేస్తే సహస్ర గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుంది. కపిల గోవును దానం చేస్తే ఏడు తరాలను తరింపజేస్తుంది. గోదానం చేస్తే పితృ దేవతలు ఘోరమైన వైతరణి నది దాటి … Read more

దేవుడికి క‌ర్పూరంతో హార‌తి ఎందుకు ఇస్తారు..?

భగవంతుని ప్రార్ధన, పూజ లేదా భజన చివర్లో లేక గౌరవనీయులైన అతిథిని లేక మహాత్ముడిని ఆహ్వానించేటప్పుడు హారతి ఇస్తాము. ఇదెప్పుడూ ఘంటా నాదం తోను కొన్ని సమయములలో పాటలు ఇతర సంగీత వాయిద్యాలతోను, చప్పట్లతోను కలిసి ఉంటుంది. ఇది పదహారు అంచెలుగా చేసే షోడశోపచార పూజా కార్యక్రమములోని ఒక భాగము. ఇది శుభసూచకమైన మంగళ నీరాజనముగా సూచింప బడుతుంది. భగవంతుని రూపాన్ని ప్రకాశింప చేయడానికి మనము కుడిచేతిలో వెలుగుతున్న దీపాన్ని పట్టుకొని వలయాకార దిశలో హారతి ఇచ్చేటప్పుడు … Read more

శివుడికి పూజ చేసేట‌ప్పుడు వీటిని ఉప‌యోగించండి.. అనుగ్ర‌హం ల‌భిస్తుంది..

శివుడిని పూజించేటప్పుడు ఈ విషయాలని గుర్తు పెట్టుకుని శివుడిని పూజిస్తే ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయి. సమస్యలనుండి గట్టెక్కచ్చు. శివ పురాణం ప్రకారం శివుడికి జమ్మి అంటే ఎంతో ఇష్టం. జమ్మి ఆకులతో శివలింగాన్ని పూజించడం వలన ఎంతో మంచి జరుగుతుంది భక్తుల సమస్యలన్నీ తొలగిపోతాయి. శని దోషం కూడా ఉండదు. అదేవిధంగా బిల్వపత్రాన్ని సోమవారం శివుడికి సమర్పిస్తే కష్టాల నుండి గట్టెక్కొచ్చు శివుడికి బిల్వపత్రం అంటే చాలా ఇష్టం. అదే విధంగా రావి ఆకులతో శివుడిని … Read more

ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌లిగిన వారి ఇంట్లో ల‌క్ష్మీదేవి ఎల్ల‌ప్పుడూ ఉంటుంది..!

చాలామంది డబ్బులు లేక బాధపడుతూ ఉంటారు. ఎంత కష్టపడినా కూడా దానికి తగ్గట్టుగా ఫలితం దొరకదు. అయితే మీరు కనుక ఆచార్య చాణక్య చెప్పినట్లు చేశారంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది ఎక్కడికి వెళ్ల‌దు. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలి ఎటువంటి అలవాటులకి దూరంగా ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం… పండితులని జ్ఞానులని మేధావులని గౌరవించే ఇంట్లో లక్ష్మీదేవి కచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళని ఇష్టపడుతూ ఉంటుంది. మూర్ఖుల పొగడ్తలను వినడం కంటే … Read more

ఆధ్యాత్మిక ప‌రంగా ప‌సుపుతో ఎన్ని ఉప‌యోగాలు ఉన్నాయో తెలుసా..?

భారతీయ వంటగదిలో వంటల కోసం పసుపును విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. భారతీయ కుటుంబాలు వారు చేసే వంటలలో తప్పనిసరిగా పసుపును వాడతారు. కానీ పసుపు కేవలం వంట పదార్ధం కాదు. పసుపుకు భారతదేశంలో అనేక ఆధ్యాత్మిక ఉపయోగాలున్నాయి. హిందూ మత ఆచారాలను విస్తరించటానికి పసుపుతో అనేక ఆధ్యాత్మిక ఉపయోగాలు ఉన్నాయి. భారతదేశంలో పసుపు లేదా హల్దికి ఔషధ శక్తులు ఉన్నాయి. హల్ది అనేది ఒక పూర్వ వివాహ వేడుక పేరు. ఈ వేడుకలో వధువు, వరుడు పసుపు పేస్ట్, … Read more

త‌మ‌ల‌పాకుల్లో ఏయే దేవుళ్లు, దేవ‌త‌లు కొలువై ఉంటారో తెలుసా..?

ప్రతి పూజకి కూడా తమలపాకు అవసరం. తమలపాకు లేక పోతే పూజ అనేది అవ్వదు తమలపాకు గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈరోజు తెలుసుకుందాం.. తమలపాకులో దేవతలు ఉంటారు. కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు అందుకే తమలపాకుని పూజించాలి. పూజించెందుకు ఉపయోగించాలి. తమలపాకుల‌లో అనేక దేవత రూపాలు కొలువై ఉన్నాయని శాస్త్రం అంటోంది. మరి ఇక ఏ దేవతలు ఉన్నారు అనేది చూస్తే.. తమలపాకు చివర మహాలక్ష్మి దేవి ఉంటుంది … Read more

హ‌నుమంతుడికి సింధూరం అంటే ఎందుకు అంత ఇష్టం..?

పూర్వం శ్రీరామ పట్టాభిషేకం తర్వాత ఒక రోజు సీతమ్మ తలస్నానం చేసి, నుదుటన తిలకం దిద్ది, పాపిటన సింధూరం పెట్టుకొని, శ్రీరామునితో కలిసి విశ్రాంతి మందిరానికి వెళుతున్న సమయంలో అప్పటి వరకూ శ్రీరాముని సేవకై వేచి ఉన్న ఆంజనేయుడు వారి వెనుకనే వెళ్ళసాగాడు. ఇది గమనించిన సీతారాములు వెనుకకు తిరిగి చూడగా, సీతాదేవి హనుమంతునితో మేము విశ్రాంతి మందిరానికి వెళుతున్నాము, నీవు రాకూడదు, వెళ్ళు హానుమా…తరువాత రావచ్చు అనెను. రాములవారు కూడా సీతమ్మవారు చెప్పినట్లు చేయుము హనుమా..ఇప్పుడు … Read more