జయం సినిమాను మిస్ చేసుకున్న అల్లు అర్జున్.. కారణం ఏమిటంటే..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. పుష్ప సినిమాతో ఆయన క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ మూవీలో ఆయన మాస్ పాత్రలో ప్రేక్షకులను అలరించారు. దేశవ్యాప్తంగా పుష్ప మొదటి భాగం ఊహించని స్థాయిలో హిట్ అందుకుంది. దీంతో అల్లు అర్జున్‌కు అటు బాలీవుడ్‌లో కూడా డిమాండ్ ఏర్పడింది. అల్లు అర్జున్ తో బాలీవుడ్ దర్శక నిర్మాతలు సినిమాలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప పార్ట్ -2 రిలీజ్…