మార్గంలో రైలు ప‌ట్టాలు విరిగిపోయి ఉన్నాయ‌ని చెప్పాడు.. త‌రువాత ఏమైంది..?

బ్రిటిష్ కాలంలో భారత్‌లో ఓసారి ఓ రైలు వెళ్తోంది. అందులో చాలామంది బ్రిటిషర్లే ఉన్నారు. వారితో పాటు ఓ భారతీయుడు కూడా కూర్చుని ప్రయాణిస్తున్నాడు.నల్లటి చర్మరంగు కలిగి, సన్నగా ఉన్న ఆ వ్యక్తి తెల్లటి దుస్తులు ధరించి ఉన్నాడు. అతడిని చూసిన బ్రిటిషర్లు.. అతడో తెలివితక్కువవాడని, నిరక్షరాస్యుడని వేళాకోళం చేయసాగారు. కానీ అతడు అవేమీ పట్టించుకోలేదు. కానీ, ఉన్నట్లుండి లేచి నిలబడిన ఆ వ్యక్తి రైలు చైన్ లాగాడు. వేగంగా వెళ్తున్న రైలు కొద్దిసేపట్లోనే ఆగింది. అందరూ … Read more

డ‌బ్బుకు లోకం దాసోహం అనేది అందుకే.. స్నేహితులు కూడా శ‌త్రువులు అయిపోతారు..

సిరిపురంలో రాజా, రంగాలవి పక్కపక్క ఇళ్లు. పక్కపక్క పొలాలూనూ. వాళ్లిద్దరూ చిన్న నాటి నుంచి ప్రాణస్నేహితులు. ఒక రోజు పని ఉండి పట్నం వెళ్లదలిచారు. ఉదయం బయల్దేరి అడ్డదోవన అడవి దారి గుండా వెళితే అదే రోజు సాయంత్రానికి ఇంటికి చేరుకోవచ్చు. అసలే పొలం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. చాలా సమయం ఆదా అవుతుందని భావించి అడవి దారి పట్టారు. మిత్రులిద్దరూ పాటలు పాడుకుంటూ కబుర్లు, నవ్వులతో దారంతా హోరెత్తిస్తూ సరదా సరదాగా ప్రయాణం సాగిస్తున్నారు. అది … Read more

త‌న ఆస్థానంలో ఉన్న ముగ్గురు మంత్రుల‌కు ప‌రీక్ష పెట్టిన రాజు.. చివ‌రికి ఏమైందంటే..?

ఒక రాజు తన ఆస్థానంలో ఉన్న ముగ్గురు మంత్రులను పిలిపించి.. వారికి ఒక్కొక్క ఖాళీ గోనె బస్తా బ్యాగ్ లను చేతికిచ్చి అరణ్యంలోనికెళ్ళి వాళ్లకు తోచిన పండ్లు,ఫలాలను అందులో నింపి..సాయంత్రం లోపు తీసుకు రావలసిందిగా ఆజ్ఞాపించాడు. మొదటి మంత్రి ఆలోచించాడు..రాజు గారు పండ్లు తెమ్మన్నారంటే ఏదో విశేషం ఉండిఉండాలి..కనుక మంచి పండ్లు తీసుకు వెళ్ళాలి..అనుకుంటూ అరణ్యం అంతా తిరుగుతూ పండ్లు నింపసాగాడు. రెండో మంత్రి ఆలోచన..రాజు గారికి పండ్లకి కొదవ లేదు..అయినా మాకు పంపారు..సరే ఏదోలా బస్తా … Read more

అమితాబ్ బచ్చన్ దగ్గర అప్పు తీసుకున్న రతన్ టాటా

జీవితాంతం విలువలతో కూడిన వ్యాపారాన్ని నిర్వహించి భారతీయుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూసిన విషయం తెలిసిందే. వేల కోట్లకు అధిపతి అయినప్పటికీ ఆయన ఎల్లప్పుడూ చాలా సాధారణ జీవితాన్ని గడిపారు. ఆయన ఎంత సామాన్యుడిలా గడిపారో తెలియజేసే రెండు ఆసక్తికరమైన సందర్భాలను బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. రతన్ టాటా చాలా సాధారణ మనిషి అని, ఎంతో గొప్ప వ్యక్తి అని అమితాబ్ కొనియాడారు. ఒకసారి నేనూ, రతన్ టాటా … Read more

మ‌నిషి రూపాన్ని చూసి ఎన్న‌డూ అంచ‌నా వేయ‌కూడ‌దు.. ఆలోచింప‌జేసే క‌థ‌..

పై పై మెరుగులు చూసి అంచనా వెయ్యకూడదు…. ఈ రోజుల్లో బాగా చదువుకొన్న వారు కూడా ఉద్యోగం దొరక్క టిఫిన్ సెంటర్లు పెట్టుకొని, ఆటోలు నడుపుకొని చిన్న పనులు చేసుకుంటున్నారు. అందుకని ఎవరిని చులకనగా చూడకూడదు.. మిమ్మల్ని ఎక్కడో చూసాను. ఎక్కడ చూసి వుంటానో గుర్తు రావటంలేదు. అంటూ సిటీబస్ లో ఒక అమ్మాయి పలకరించింది. ఎవరా నన్ను పలకరించారని నేను అమెకేసి తలతిప్పి చూసాడతను.. ఆమె చూడ్డానికి ఎలా వుందంటే గాలివేస్తే ఎగిరిపోయేలావుంది. సన్నగా, నల్లగా, … Read more

ట్రెయిన్ లో భిక్ష అడిగిన బిచ్చ‌గాడికి ఆ వ్యాపార‌వేత్త ఏమీ ఇవ్వ‌లేదు.. ఆలోచింప‌జేసే క‌థ‌..!

ఒకసారి ఒక బిచ్చ గాడు రైలులో భిక్షాటన చేస్తున్నప్పుడు చక్కగా దుస్తులు ధరించిన వ్యాపారి సూట్, బూట్లు ధరించి ఉండటం గమనించాడు. ఈ వ్యక్తి చాలా ధనవంతుడని అతను భావించాడు. కాబట్టి నేను అతనిని అడిగితే అతను ఖచ్చితంగా దానంచేస్తాడు అనుకొని అతని దగ్గరకు వెళ్లి ఆ వ్యక్తిని భిక్ష కోసం అడిగాడు. ఆ వ్యక్తి బిచ్చగాడిని చూసి… మీరుఎల్లప్పుడూ అడుక్కుంటూ, ప్రజల నుంచి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా… మరి మీరు ఎవరికైనా ఏదైనా … Read more

దేవుడు నాతో చేయించిన ప‌ని! నిజంగా అద్భుత‌మే.!!!

మా ఫ్రెండ్ కి 10 వేలు ఇవ్వాల్సి ఉంది, ఆరోజు డ‌బ్బులు ఉండ‌డంతో అత‌ని అకౌంట్లో వేశాను. పొర‌పాటున అవి వేరే వారి అకౌంట్ లోకి వెళ్లాయి.! మాఫ్రెండ్ ఫోన్ చేసి ఇంకా డ‌బ్బులు వేయ‌లేదా? అని అడిగాడు అప్పుడు తేరుకొని బ్యాంక్ కు వెళ్లి ఆరా తీస్తే కానీ తెలియ‌లేదు…ఆ డ‌బ్బులు వీడి అకౌంట్ కి బ‌దులు వేరే అకౌంట్ కి ట్రాన్ఫ‌ర్ అయ్యాయ‌ని….! బ్యాంక్ మేనేజ‌ర్ తెలిసిన వాడే అవ్వ‌డంతో..ఆ డ‌బ్బులు తిరిగొచ్చే మార్గం … Read more

టంగుటూరి ప్ర‌కాశం పంతులు చివ‌రి రోజుల్లో ఇంత‌టి పేద‌రికాన్ని అనుభ‌వించారా..?

నాన్నగారికి మందులు తీసుకురావాలి..ఓ ఐదు రూపాయలు ఉంటే సర్దుతారా..? తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ అడిగాడు ఆయన ! ఈ మాటలు అన్నది సాదా సీదా వ్యక్తి అయితే పెద్దగా ఆశ్చర్యం ఉండేది కాదేమో ! కానీ ఐదు రూపాయలు చేబదులు అడిగిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం గారి రెండో కుమారుడు హనుమంతరావు. అప్పు అడిగింది తుర్లపాటి కుటుంబరావుని ! సాక్షాత్తు ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి కొడుకు నోటినుంచి కన్నీటితో వచ్చిన మాటలు విన్న తరువాత … Read more

ర‌ణ‌జిత్ సింగ్ మ‌హారాజు గొప్ప‌త‌నం.. ఒక‌సారి ఏం జ‌రిగిందో తెలుసా..?

ఒకసారి రణజిత్ సింగ్ మహారాజు ఎక్కడికో వెళుతున్నారు. ఇంతలో ఒక రాయి వచ్చి ఆయనకు తగిలింది. సైనికులు నాలుగువైపులా పరికించి చూడగా ఒక వృద్ధురాలు కనబడింది. సైనికులామెను బంధించి రాజుగారి దగ్గరకు తీసుకొని వచ్చారు. వృద్ధురాలు రాజు గారిని చూస్తూనే భయంతో వణికి పోయింది. ప్రభూ! నా పిల్లవాడు నిన్నటి నుండి ఆకలితో ఉన్నాడు. ఇంట్లో తినడానికేమీ లేదు. అందుకే చెట్టు మీదకు రాళ్ళు విసురుతున్నాను. కనీసం కొన్ని రేగుపండ్లు రాలితే అవి తీసుకొని వెళ్ళి అతడికి … Read more

భారతదేశపు అత్యంత సంపన్న ఐఏఎస్ అధికారి ఇతడే.. నెల జీతం రూ.1; నికర విలువ ఇన్ని కోట్లా?

ఇండియన్ సివిల్ సర్వీస్ IAS ఆఫీసర్ ఉద్యోగం భారత ప్రభుత్వంలో అత్యున్నత ర్యాంక్‌లలో ఒకటి. ఐఏఎస్‌ అధికారుల గురించి చెప్పాలంటే టీనా తాబి, స్మితా సబర్వాల్‌, అన్సార్‌ షేక్‌ వంటి ప్రముఖుల పేర్లు గుర్తుకు వస్తాయి. ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకమైన కథ ఉంటుంది. అదేవిధంగా, అతని కథ గురించి చాలా మంది ఆసక్తిగల ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు ఆసక్తిగా మాట్లాడుతున్నారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో నివసిస్తున్న ఐఏఎస్ అధికారి అమిత్ కటారియా కూడా వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం … Read more