భ‌గ‌త్ సింగ్ గురించి మాట్లాడాలంటే…ఫ‌స్ట్ ఈ రెండు విష‌యాలు తెల్సుకోవాల్సిందే.!!

స‌న్నివేశం-1: 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలా బాగ్ దురంతం చోటు చేసుకుంది. స‌మావేశ‌మైన వేలాది జ‌నాల‌పై, బ్రిటీష్ ద‌ళాలు విచ‌క్ష‌ణా ర‌హితంగా కాల్పులు జ‌రిగాయి. వంద‌ల మంది ప్రాణాలు పోయాయి…తూటాల మోత‌, తొక్కిస‌లాట‌…ఎక్క‌డ చూసిన తెగిప‌డిన చెప్పులు, గుట్టలుగా శ‌వాలు….అస్త‌వ్య‌స్తం, ర‌క్త‌సిక్తం. ఈ సంఘ‌ట‌న జ‌రిగిన‌ స‌మ‌యంలో విద్యార్థిగా ఉన్న భ‌గ‌త్ సింగ్…. ఈ విష‌యం తెల్సుకొని….నేరుగా స్కూల్ నుండి సంఘ‌ట‌న స్థ‌లానికి వ‌చ్చాడు…. జ‌లియ‌న్ వాలా బాగ్ లోని భారతీయుల రక్తంతో తడిచిన మట్టిని … Read more

ఐఐటీ బాంబేలో చదువు ఎందరికో కల.. కారణం ఏంటో చెప్పిన ఓ విద్యార్థి..

ఐఐటీ బాంబేలో చదువుకోవడం లక్షలాది మంది విద్యార్థులకు ఒక కల. అక్కడ సీటు పొంది చదువుకుంటే కెరీర్‌లో తిరుగుండదని భావిస్తుంటారు. కలలు కనడమే కాదు సీటు కూడా సాధించి అక్కడ చదువుకుంటున్న ఓ విద్యార్థి తన ఐఐటీ బాంబే క్యాంపస్ అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఎక్స్ వేదికగా అతడి పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. విజేంద్ర కుమార్ వైశ్య అనే విద్యార్థి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ ప్రోగ్రామ్‌ చదివేందుకు క్యాంపస్‌లో చేరిన ఒక నెల … Read more

బ్రెస్ట్ ట్యాక్స్‌ను ఎదిరించి ప్రాణాల‌ను కోల్పోయిన మ‌హిళ‌.. ఈమె చేసిన త్యాగం గురించి తెలుసా..?

18వ శతాబ్దం, కేరళ, త్రివాంకూర్ రాజ్యం. అప్పుడు సమాజంలో కులవ్యవస్థ చాలా దారుణంగా ఉంది. బ్రాహ్మణులు మరియు ఉన్నతకులాల వారు అన్ని రకాల ప్రత్యేక హక్కులను అనుభవిస్తున్నప్పుడు, తక్కువ కులాల వారు గౌరవం, ఆస్తి, స్వేచ్ఛల నుండి పూర్తిగా వంచించబడ్డారు. ఆ అణచివేతలో అత్యంత క్రూరమైన విధానం మూలక్కారం (బ్రెస్ట్ టాక్స్). ఈ చట్టం ప్రకారం, తక్కువ కులానికి చెందిన మహిళలు తమ ఛాతిని కప్పుకోవాలంటే పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇది ఆ మహిళలకు అపారమైన అవమానంగా … Read more

తెనాలి పానీపూరి వ్యాపారికి రాష్ట్రపతి నుంచి ఆహ్వానం.. ఎందుకో తెలుసా..?

అది తెనాలిలోని బాలాజీరావు పేట.. అక్కడ రైల్వే స్టేషన్ వీధిలో మెఘావత్ చిరంజీవి పానీ పూరి అమ్ముతుంటాడు.. ఆర్థికంగా ఇబ్బందులు పడినా ప్రేవేటు వడ్డీ వ్యాపారుల వద్ద వడ్డీకి డబ్బులు తీసుకునేవాడు కాదు. అయితే మెప్మా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనే చిరంజీవి ఆ సంస్థ ఇప్పించే బ్యాంక్ రుణాలనే తీసుకునేవాడు. అలా 2021లో 10 వేలు, 2022లో 20 వేలు, 2023లో50 వేల రూపాయల చొప్పున రుణం తీసుకున్నాడు. తీసుకోవడమే కాదు వాటిని సకాలంలో చెల్లించాడు. దీంతో … Read more

ఇండియన్ ఆర్మీ లో ఎక్కువగా పంజాబీ వాళ్లే ఎందుకు ఉంటారు ? దానికి కారణం ఏంటి ?

మన దేశంలో అన్ని రాష్ట్రాల మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఆర్మీలో పనిచేసే వారిలో ఎక్కువగా పంజాబీ వాసుల పేర్లే వినిపిస్తూ ఉంటాయి. సిపాయి నుండి బ్రిగేడియర్ స్థాయి వరకు మిలటరీలో వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇండియన్ ఆర్మీలో చేరడాన్ని పంజాబ్ వాసులు గర్వంగా ఫీల్ అవుతారు. వాళ్ల తల్లిదండ్రులు కూడా మా కొడుకు ఆర్మీలో ఉన్నాడు అని గర్వంగా చెప్పుకుంటారు. అయితే వారికి చిన్నప్పటినుండి ఆర్మీ మీద అవగాహన ఉండడం.. శారీరకంగా బలంగా ఉండడం … Read more

భారతీయ పైలట్ ని పాకిస్తాన్ ఎందుకు విడిచిపెట్టింది..?

F16 కూలిపోయిన వెంటనే అమెరికాకు తెలిసింది. భారతదేశంపై దాని వాడకంపై అమెరికా కోపంగా ఉంది. కానీ ఆ సమయంలో భారతదేశం కోపం నుండి పాకిస్తాన్‌ను కాపాడటం కూడా ముఖ్యం. ఎందుకంటే ఒక భారతీయ పైలట్ పాకిస్తాన్ చేత పట్టుబడిన వెంటనే, భారతదేశం ఒక పెద్ద చర్య కోసం బ్రహ్మోస్ క్షిపణులను సిద్ధం చేసింది. పాకిస్తాన్ వైమానిక దళాన్ని ఆ రాత్రిలోనే నాశనం చేయడమే పథకం. అమెరికాకు దీని గురించి ఒక సూచన వచ్చింది. పట్టుబడిన భారత పైలట్‌కు … Read more

ఈ-మెయిల్‌ను క్రియేట్ చేసింది మ‌న భార‌తీయుడే అని మీకు తెలుసా..?

ఈ-మెయిల్‌… ఈ పేరు విన‌ని వారు బ‌హుశా ఎవ‌రూ ఉండ‌రు. కంప్యూట‌ర్లు వాడుతున్న వారంద‌రికీ, ఆ మాట‌కొస్తే ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల‌ను వాడుతున్న ప్ర‌తి ఒక్క‌రికీ కూడా ఈ-మెయిల్ గురించి తెలుసు. అయితే దాన్ని మొద‌ట ఎవ‌రు క్రియేట్ చేశారో తెలుసా? ఏముందీ ఎవ‌రో ఇంగ్లిష్ పెద్ద‌మ‌నిషి అయి ఉంటాడులే అన‌బోతున్నారా? కానీ వారు మాత్రం కాదు. ఈ-మెయిల్‌ను క్రియేట్ చేసింది సాక్షాత్తూ మ‌న భార‌తీయ యువ‌కుడే. అత‌నిది త‌మిళ‌నాడు రాష్ట్రం. త‌మిళ‌నాడులో జ‌న్మించిన వీఏ శివ అయ్య‌దురై … Read more

ప్ర‌పంచంలోని అత్యంత ధ‌నికుల్లో ఒక‌రైన వారెన్ బ‌ఫెట్ ఇండియాలో పెట్టుబ‌డులు ఎందుకు పెట్ట‌లేదో తెలుసా..?

ప్ర‌పంచంలోని అత్యంత ధ‌న‌వంతులైన జాబితాలో ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త వారెన్ బ‌ఫెట్ టాప్ స్థానంలో ఉంటారు. కొన్ని ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల ఆస్తి ఈయ‌న సొంతం. ఫోర్బ్స్ మ్యాగ‌జైన్ ప్ర‌క‌టించిన ప్ర‌పంచంలోని టాప్ బిలియ‌నీర్ల జాబితాలో ఈయన టాప్‌ స్థానంలో ఉంటారు. వారెన్ బ‌ఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాత్‌వే కంపెనీ ఆస్తి విలువే సుమారుగా రూ.7.75 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని అంచ‌నా. ఈ మొత్తం మ‌న దేశంలోని బ్యాంకులన్నింటి వ‌ద్ద ఉన్న మొత్తం నిర‌ర్థ‌క ఆస్తుల విలువ … Read more

కోటు, ప్యాంటు ధ‌రించే గాంధీ ధోవ‌తి లోకి ఎందుకు ఛేంజ్ అయ్యారు? దానికి గ‌ల కార‌ణాలేంటి?

మహాత్మగాంధీ… స్వాతంత్ర్య ఉద్యమంలో చెరగని స్థానం సంపాదించుకున్న గొప్ప వ్య‌క్తి. మన అందరి గుండెల్లో కలకాలం కొలువుండే మహనీయుడుగా, జాతిపితగా నిలిచిపోయారు. స్వాతంత్ర్యోద్య‌మంలో గాంధీ పాత్ర‌ను మ‌నం మ‌రువ‌లేం. అహింసే ఆయుధంగా ఆయ‌న మ‌న‌కు స్వాతంత్ర్యాన్ని తెచ్చి పెట్టారు. అయితే గాంధీజీ.. అన‌గానే ముందుగా మ‌న‌కు ఆయ‌న ధోవ‌తి రూపం క‌ళ్ల ముందు క‌నిపిస్తుంది. మ‌రి అస‌లు ఆయ‌న ధోతి ఎందుకు ధ‌రించారో తెలుసా..? సౌతాఫ్రికాలో లా కోర్సు చ‌దివారాయ‌న‌. అయిప్ప‌టికీ ధోవ‌తి ధ‌రించారు. ఇందుకు గల … Read more

చదివింది పదో తరగతే.. కేరాఫ్ రైల్వే ప్లాట్‌ఫామ్‌.. కట్ చేస్తే, రూ.39,000 కోట్లకు అధిపతి..

జీవితంలో కొందరు కష్టాలను అడ్డంకిగా కాకుండా.. అవకాశాలుగా భావిస్తారు. అలాంటి వారి లైఫ్‌ ఎందరికో స్ఫూర్తినిస్తుంది. చిన్న వయసులోనే డబ్బు లేక రైల్వే స్టేషన్‌లో రాత్రులు గడిపిన ఒక వ్యక్తి ఈ రోజు రూ. 39,000 కోట్ల సంపదతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. అతని పేరు సత్యనారాయణ నువ్వాల్‌. రాజస్థాన్‌లోని ఒక సాధారణ గ్రామంలో పుట్టి, ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నాడు. ఈ రోజు దేశంలో పేలుడు పదార్థాల తయారీలో అగ్రస్థానంలో ఉన్న కంపెనీని నడిపిస్తున్నారు. ఆయన లైఫ్‌ … Read more