మున్నార్ వెళ్తున్నారా..? ఈ ప్రదేశాలను చూడడం మరువకండి..!
మున్నార్… కేరళలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. పచ్చని ప్రకృతి అందాలతో ఎప్పుడూ అలరారుతూ ఉంటుంది. ఎటు చూసినా పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, కొండ చరియలు.. పర్యాటకులకు మధురమైన అనుభూతులను కలిగిస్తుంటాయి. కేరళ రాజధాని కొచ్చికి 130 కిలోమీటర్ల దూరంలో మున్నార్ ఉంది. అయితే పర్యాటక ప్రేమికులు మున్నార్‌లో చూడదగిన అందాలు, ఆస్వాదించదగిన అద్భుతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మున్నార్‌ను సందర్శించే పర్యాటకులు చాలా మంది అక్కడి మౌంటేన్ బైకింగ్‌ను అనుభూతి చెందుతారు….