ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు డైరెక్టర్ గారు.. !

ఈ మధ్యకాలంలో ఎంతో పెట్టుబడి పెట్టి, ఎన్నో అంచనాలతో థియేటర్ లోకి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా బోల్తా పడుతున్నాయి.. కాని సీతారామం సింపుల్ గా భారీ హైప్ లేకుండా థియేటర్లలోకి వచ్చింది. కానీ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా హీరో హీరోయిన్ల‌ను తెలుగు ఇండస్ట్రీలో స్టార్ నటులను చేసింది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుందని చెప్పవచ్చు. … Read more

ఒక్కో సినిమా విడుదలైనప్పుడు గొప్ప హిట్ అవుతుంది. కొన్నాళ్ళకు దాని గురించి ఎవరూ తలవను కూడా తలవరు. ఎందుకని?

ఆ రోజున రెండు సూపర్ హిట్ సినిమాలు విడుదల అయ్యాయి. అలాగే ఒక గొప్ప దర్శకుడు తెలుగు సినిమాకి పరిచయం అయ్యాడు. ఒకటి తెలుగు సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని మెగాస్టార్ అయిన చిరంజీవిది. ఇంకొకటి ఎవ్వరికీ పెద్దగా తెలీని, అప్పటికి డాలర్ డ్రీమ్స్ అన్న సినిమాతో జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు పొందిన శేఖ‌ర్ కమ్ముల‌ది. అందరి సినిమా ప్రేమికుల లాగే ఆ రోజు నేను స్నేహితులతో శంకర్ దాదా మొదటి రోజు చూసాను. … Read more

హృదయాన్ని తాకిన చిన్న కథ..!

అత్తవారింటికి వెళ్ళిన తన గారాల పట్టి, తన కుమార్తె తల్లిదండ్రులను చూడాలని పుట్టింటికి వచ్చింది. ప్రేమగా తన తండ్రి రెండు చేతులను ముద్దాడి ఇలా అడిగింది కుమార్తె నాన్నా, మీరు ఏరోజూ నన్ను ,చిన్న మాట అనలేదు.మీకారణంగా నేను ఏ ఒక్కరోజు కూడా బాధ పడినట్లు జ్ఞాపకం లేదు.కానీ నాకే ఎప్పుడూ ఒక ప్రశ్న వేధిస్తుంది నాన్నా, నేను మిమ్మల్ని ఎప్పుడైనా బాధ పెట్టానా? నా కారణంగా మీరెప్పుడైనా కన్నీరు కార్చారా? చెప్పండి నాన్నా అంటూ బతిమాలింది. … Read more

క్రాక్ సినిమాలో గాడిద రక్తం తాగుతారు. నిజ జీవితంలో అలా తాగేవారు ఉన్నారా?

స్టువర్ట్ పురం దొంగలు గాడిద రక్తం తాగుతారు, అది అరిగేలా సముద్రపు ఒడ్డున పరుగులు పెడతారు. రోజూ రాక్షసుల్లాగా వ్యాయామం చేస్తారు. మందు మాంసం పుచ్చుకుని పడుకుంటారు..గాడిద మాంసం కూడా తప్పనిసరిగా తింటారు. పిల్లలకి గాడిద రక్తం తగిస్తారు. గాడిద రక్తంతో చప్పరించే బిళ్ళలు చేసి ఇస్తారు. మామూలు ప్రపంచానికి భిన్నమయిన జీవన శైలి వారిది. తిండి కోసం హత్యలు, దొంగతనాలు చేయడం సర్వసాధారణం వాళ్లకి. పిల్లలకి కూడా చిన్నప్పటినించీ అదే ట్రైనింగ్ ఇస్తారు. పెద్దపెద్ద ధనవంతుల … Read more

వాకింగ్ ఉద‌యం చేస్తే మంచిదా..? లేక సాయంత్రం చేయాలా..?

ఆరోగ్యంగా ఉండాలంటే మ‌నం రోజూ వ్యాయామం చేయాల‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే చాలా మంది ఉద‌యం లేదా సాయంత్రం వ్యాయామం చేస్తుంటారు. కొంద‌రు వ్యాయామం కోసం జిమ్‌కు వెళ్తుంటారు. ఇంకా కొంద‌రు పార్కుల్లో, ఇంటి ద‌గ్గ‌ర వాకింగ్, ర‌న్నింగ్ లాంటివి చేస్తుంటారు. అయితే వాకింగ్ చేసే చాలా మందికి ఒక సందేహం వ‌స్తుంటుంది. అదేమిటంటే.. వాకింగ్‌ను ఉద‌యం చేయాలా, సాయంత్రం చేయాలా..? ఏ స‌మ‌యంలో వాకింగ్ చేస్తే మంచిది ? ఏ స‌మ‌యంలో వాకింగ్ చేయ‌డం … Read more

ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీకి మాన‌సిక స‌మ‌స్య‌లు ఉన్నాయా..?

రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న ప్రపంచంలోని టాప్ 10 ధ‌న‌వంతుల్లో ఒక‌రు. ఈయ‌న‌కు ఇద్ద‌రు కుమారులు ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ ఉన్నారు. ఒక కుమార్తె ఇషా అంబానీ కూడా ఉంది. ఈమ‌ధ్య‌నే అనంత్ అంబానీకి ఘ‌నంగా వివాహం కూడా జ‌రిపించారు. అయితే అనంత్ అంబానీని కొంద‌రు ఇప్ప‌టికీ ట్రోల్ చేస్తుంటారు. సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌పై జోకులు కూడా వేస్తుంటారు. కానీ అనంత్ అంబానీ గురించి ఈ విష‌యాలు … Read more

1960ల‌లో వివిధ ర‌కాల వ‌స్తువుల ధ‌ర‌లు ఎలా ఉన్నాయో తెలుసా..? షాక‌వుతారు..!

ఏయేటి కాయేడు వ‌స్తువుల ధ‌ర‌లు పెరుగుతూనే ఉంటాయి. పూర్వం ఒక‌ప్పుడు కొన్ని రూపాయ‌లు ఇస్తే బంగారం వ‌చ్చేది. పెట్రోల్ కూడా త‌క్కువ ధ‌ర‌కు ల‌భించేది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. జ‌నాభా పెరుగుతున్న కొద్దీ వారి అవ‌స‌రాల‌కు అనుగుణంగా సౌక‌ర్యాల‌ను క‌ల్పించాల‌న్నా, వ‌స్తువుల‌ను త‌యారు చేయాలన్నా అధికంగా ఖ‌ర్చవుతుంది. అందుక‌నే అన్ని వ‌స్తువుల ధ‌ర‌లు ఎప్పటిక‌ప్పుడు పెరుగుతుంటాయి.ఇక 1960ల‌లో ప‌లు ర‌కాల వ‌స్తువుల ధ‌ర‌లు ఎలా ఉన్నాయో ఒక్క‌సారి ప‌రిశీలిద్దాం. కింద ఇచ్చిన చిత్రంలో వెస్పా … Read more

గొంతు నొప్పి ఇబ్బందుల‌కు గురి చేస్తుందా.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

సీజ‌న్ మారుతుందంటే చాలు శ్వాసకోస సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. జలుబు, గొంతునొప్పి అందులో ముఖ్యమైనవి. ఐతే ఈ కాలంలో గొంతు నొప్పి ఇబ్బంది పెడుతుంటే దాన్నుండి ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలని తెలుసుకుందాం. దీని కోసం మన కిచెన్ లో పదార్థాలే ఉపయోగపడతాయి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు తీసుకుని నీళ్లలో పోసి గోరు వెచ్చగా అయ్యేంత వరకూ స్టవ్ మీదే ఉంచాలి. ఆ తర్వాత ఆ నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మివేయాలి. ఇలా ఒక … Read more

టాటూ వేసుకుంట‌న్నారా..? అయితే ముందు ఇది తెలుసుకోండి..!

ఒక్కప్పుడు ట్యాటూ ( పచ్చబొట్టు) కేవలం చేతులపై ప్రేమతో తల్లిదండ్రుల పేర్లు, భక్తితో దేవుడి బొమ్మలను పొడిపించుకునేవారు. అప్పుడు కేవలం అలివ్‌ గ్రీన్‌లోనే ఉండేవి. ప్రస్తుతం ట్యాటూ సౌంధర్య సాధనంగా మారడంతో ఏ రంగు అంటే ఆ రంగుల్లో వేస్తున్నారు. వీటితో శరీరానికి అందం వస్తుందన్న మాట పక్కన పెడితే జాగ్రత్తలు పాటించకపోతే కొన్ని జబ్బులు అంటుకునే ప్రమాదం కూడా ఉందంటున్నారు చర్మవ్యాధుల నిపుణులు. ట్యాటూ వేసేవారు ఓ పరికరంతో రంగురంగుల ద్రవ్యాలను శరీర పొరల్లోకి జొప్పిస్తారు. … Read more

శ‌రీర మెట‌బాలిజం పెరిగితే కొవ్వు దానంత‌ట అదే క‌రిగిపోతుంది.. మెట‌బాలిజంను ఇలా పెంచుకోవ‌చ్చు..!

బరువును అదుపులో పెట్టుకోవాలంటే జీవక్రియ (మెటబాలిజం)ను పెంచుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. శరీరంలో కొందరికి సహజంగానే కేలరీలు వేగంగా ఖర్చు అవుతాయి. స్త్రీల కంటే పురుషుల్లో విశాంత్రి తీసుకుంటున్నప్పుడు కేలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. సాధారణంగా 40 ఏళ్లు దాటిన తర్వాత జీవక్రియలో వేగం తగ్గినట్లు కనిపిస్తుంది. వయసు పెరిగినప్పుడు జన్యు స్వభావాలు మార్చుకోవచ్చు. జీవక్రియను పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.. మానవ శరీరం నిరంతరం కేలరీలను వినియోగించుకుంటూనే ఉంటుంది. పనిలేని సమయంలోనూ జీవక్రియ కొనసాగుతుంది కాబట్టి … Read more