రోజూ రావి చెట్టు నీడన నిలబడితే ఏ దోషాలు ఉండవు..!
భారతీయ సంప్రదాయాల ప్రకారం ఎన్నో వృక్షాలను దైవ సమానంగా భావిస్తారు. ఈ క్రమంలోనే ఆ దేవతా వృక్షాలకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించడం చేస్తుంటాము. ఈ విధంగా చేయడం వల్ల సకల సంపదలు చేకూరుతాయని భావిస్తారు. ఇందులో భాగంగానే రావి చెట్టును హిందువులు సాక్షాత్తూ విష్ణు స్వరూపం అని భావిస్తారు. ఈ రావిచెట్టునే అశ్వత్థ వృక్షం, బోధివృక్షం అని కూడా పిలుస్తారు. విష్ణు స్వరూపంగా పిలువబడే ఈ రావిచెట్టు మొదట్లో విష్ణువు బోదలో, కేశవుడు శాఖలో, నారాయణుడు…