అశోక చెట్టు మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా? ఆధ్యాత్మికంగా, సైంటిఫిక్ గా…!
ఈ భూప్రపంచంలో అనేక వేల వృక్ష జాతులు ఉన్నాయి. అయితే వాటిలో కేవలం కొన్నింటిని మాత్రమే దేవతా వృక్షాలుగా హిందువులు కొలుస్తారు. వాటిని పవిత్ర వృక్షాలుగా పేర్కొంటూ ఎప్పటి నుంచో మన పూర్వీకులు వాటికి పూజలు కూడా చేస్తున్నారు. అలాంటి వాటిలో చెప్పుకోదగిన వృక్షం అశోక. అశోక చెట్టు గురించిన వర్ణనలు పురాణాల్లో మనకు ఎక్కువగా కనిపిస్తాయి. నిజానికి అశోక అనేది సంస్కృత పదం. అశోక అనే పదానికి అర్థమేమిటంటే బాధలు కలిగించనిది, దుఃఖాలను దూరం చేసేది…