పెరుగు తొందరగా తోడుకోవాలా..? అయితే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు..!

వంట చేయడం రానివాళ్లు కూడా ఈజీగా చేసే పని ఏదన్నా ఉందా అంటే పెరుగు తోడు పెట్టడం… వేడి అన్నం వండుకుని ,పెరుగు తోడు పెట్టుకుని, ఆవకాయ నంజుకు తింటే ఆ టేస్టే వేరు… కానీ పెరుగు తోడు పెట్టడం ఎంత ఈజీనో… కానీ కొన్ని సార్లు పెరుగు సరిగా తోడుకోదు… లేదంటే పులిసిపోయినట్టు గా ఉంటుంది….. ఈ కాలంలో పెరుగు సరిగా తోడుకోదు, దానికోసం చిన్న చిట్కా పాటిస్తే చాలు.. అదేంటంటే.. ఈ కాలంలో పెరుగు … Read more

పచ్చడి పెడుతున్నారా? ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించండి..!

బజారులో ఉసిరికాయలు నోరూరింపజేస్తున్నాయి. చాలామంది ఈపాటికి పచ్చడి పెట్టేసే ఉంటారు. సమయము ఉండదుకదా అని…వీలున్నప్పుడల్లా ఊరగాయలు పెడుతుంటే రెండురోజులకల్లా బూజు పట్టేస్తుంటాయి కొందరికి. ఇక్కడలోపం ఊరగాయకి కావలసిన దినుసులను ఎంచుకోవడంలో కాదు. తయారీలోనే ఉంది అందుకే మరి ఈ జాగ్రత్తలు పాటించమంటున్నది. నిర్లక్ష్యం చేయకుండా ఊరగాయలకు వాడే పాత్రలు, గిన్నెలు, గరిటలు పరిశుభ్రంగా కడిగి, పొడివస్త్రంతో తుడవాలి. లేదంటే ఆపాత్రలను స్టౌపై వుంచి వేడి తగలటంవల్ల వాటిల్లోని కొద్దిపాటి తడికూడా పోతుంది. ఇక పచ్చళ్ళు నిల్వచేసే గాజు … Read more

ప‌కోడీలు మెత్త‌గా రావాలంటే.. ఇలా చేయండి..!

మరుగుతున్న టీ పొడిలో చిటికెడు శొంఠి పొడి, రెండు యాల‌కులు వేసి, టీ ఇస్తే చాలా రుచిగా ఉంటుంది. లేత సొరకాయ తరిగినపుడు లోపల ఉండే మెత్తని గుజ్జును బాగా నానిన బియ్యానికి జోడించి మెత్తగా రుబ్బాలి. అందులో అల్లం, మిర్చి, ఉల్లిపాయముక్కలు, తగినంత ఉప్పు కలిపి దోసెలు పోస్తే రుచిగా ఉంటాయి. వేపుడులో నూనె ఎక్కువైతే కాస్త శనగపిండి చల్లండి. తినడానికి రుచిగా ఉండటమే కాక ఎక్కువయిన నూనె తగ్గుతుంది కూడా. వేరుశనగపప్పు వేయించాక బాగా … Read more

బెండ‌కాయ‌లు వేగుతున్న‌ప్పుడు జిగురు రావొద్దంటే.. ఇలా చేయండి..!

ఫ్రూట్ కేక్ తయారయ్యాక పొడి పొడిగా వుంటే ఒక టవల్ మడతపెట్టి కేక్ చల్లారే వరకు దానిమీద కప్పితే మెత్తగా అవుతుంది. బంగాళదుంపల చిప్స్ కరకరలాడాలంటే పసుపు రంగులో కనిపించే దుంపలను ఎంపికచేసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి తోలు తీసి, చిప్స్ వేయించేందుకు అనువైన ముక్కలుగా చేయాలి. నీళ్ళలోంచి తీసి వాటిపై మొక్కజొన్న పొడిని చల్లి వేయించాలి. బంగాళదుంప చిప్స్ మెత్తబడితే వాటిని నిముషం పాటు మైక్రోవేవ్ లో ఉంచితే కరకరలాడతాయి. బెండకాయ వేపుతున్నప్పుడు జిగురొచ్చి కూర … Read more

పూరీలు బాగా క్రిస్పీగా రావాలంటే.. ఇలా చేయండి..!

టమోటా సూప్ చేసేటప్పుడు క్యారెట్ వేస్తే పులుపు తగ్గటంతోపాటు పోషకవిలువలు వస్తాయి. టమోటాలు ఉడికించేటప్పుడు ఒక టేబుల్ స్పూను పంచదార, ఉప్పు కలిపితే త్వరగా ఉడుకుతాయి. దోసె పిండిలో ఒక చెంచా వెనిగర్ వేశారంటే, అట్టు చిల్లు చిల్లులుగా వస్తుంది. ముఖ్యంగా రవ్వట్టుకు ఇది చాల బాగుంటుంది. నిమ్మరసం ఎక్కువగా రావాలంటే పది నిముషాలపాటు గోరు వెచ్చటి నీటిలో వేసి ఉంచాలి. ఒకవేళ ఫ్రిజ్ లో ఉంటే రసం తీయటానికి పది నిమిషాల ముందు బయటపెట్టాలి. పరమాన్నం … Read more

చ‌పాతీలు మెత్త‌గా రావాలంటే ఇలా చేయండి..!

కూరల్లోగాని, పప్పులోగాని ఉప్పు ఎక్కువయినపుడు కాస్త నిమ్మరసం పిండాలి. గోధుమలు పిండి పట్టించే ముందు శుభ్రంగా కడిగి ఎండబోసి పట్టిస్తే పిండి మెత్తగా ఉంటుంది. ఆ పిండితో చేసిన రొట్టెలు ఎంతో మృదువుగా ఉంటాయి. గారెల పిండిలో, పులిసిన పెరుగు ఒక కప్పు, లేదా రెండు చెంచాల మైదా వేశారంటే గారెలు మృదువుగా, టేస్టీగా ఉంటాయి. గులాబ్ జాం తాయారు చేసేందుకు పిండి కలిపేటప్పుడు పిండిలో కాస్త పన్నీరు కలపండి. అవి మృదువుగా రుచిగా ఉంటాయి. గులాబ్ … Read more

కంది ప‌ప్పు త్వ‌ర‌గా ఉడ‌కాలంటే ఇలా చేయండి..!

ఊరగాయ పాతబడి ఎండిపోతే అరస్పూను చెరుకురసం కలిపి చూడండి. కంది పప్పు ఉడకాలంటే, ఉడుకుతున్నప్పుడు నాలుగైదు బియ్యపు గింజలు వేస్తే చాలు. అలాగే కంది పప్పు ఉడుకుతున్నప్పుడు పొంగితే, రెండు నూనె బొట్లు వేస్తే పొంగు తగ్గి పోతుంది. కేక్ తయారు చేసే సమయంలో పిండికి చిటికెడు సాల్ట్ కలిపితే కేక్ చాలా రుచిగా ఉంటుంది. కాకరకాయ కూర వండేటప్పుడు వీలైతే అందులో రెండు పచ్చి మామిడి కాయ ముక్కలు వేయండి. చేదు తగ్గడమే కాదు, కూరకు … Read more

ఇడ్లీలు త‌యారు చేస్తున్నారా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

ఇడ్లీలు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఇడ్లీల‌ను చ‌ట్నీ, కారం పొడి లేదా సాంబార్‌.. దేంతో తిన్నా స‌రే రుచిగానే ఉంటాయి. ఈ క్ర‌మంలోనే అనేక ర‌కాల ఇడ్లీలు కూడా మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇంట్లో ఇడ్లీల‌ను త‌యారు చేసేట‌ప్పుడు కొన్ని చిట్కాల‌ను పాటిస్తే ఇడ్లీలు మెత్త‌గా రుచిగా వ‌స్తాయి. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇడ్లీ పిండి పల్చగా ఉంటే కొద్దిగా బొంబాయి రవ్వ కలపాలి. ఇడ్లీ పిండి … Read more

ఎంతో రుచిగా ఉండే పూర్ణం బూరెలు.. ఇలా చేసేయండి..!

ఇప్పుడంటే చాలా మంది జంక్ ఫుడ్‌కు అల‌వాటు ప‌డిపోయి మ‌నం సంప్ర‌దాయంగా చేసుకునే పిండి వంట‌ల‌ను చేయ‌డం లేదు. కానీ ఒక‌ప్పుడు మ‌న ఇళ్ల‌లో ఇవి ఎల్ల‌ప్పుడూ ఉండేవి. పిల్ల‌లు చిరు తిండి కావాల‌ని మారాం చేసినా, పండ‌గ‌లు వ‌చ్చినా, శుభ కార్యాల స‌మ‌యంలోనూ చాలా మంది పిండి వంట‌ల‌ను చేసేవారు. ఇక అలాంటి పిండి వంట‌ల్లో పూర్ణం బూరెలు కూడా ఒక‌టి. కాస్త శ్ర‌మ, ఓపిక ఉండాలే కానీ ఎంతో రుచిక‌ర‌మైన పూర్ణం బూరెల‌ను ఎంచ‌క్కా … Read more

జంక్ ఫుడ్ తినేబ‌దులు ఈ ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్స్ తినండి.. ఎలా త‌యారు చేయాలి అంటే..?

మనం ప్రతిరోజు తినే ఆహారంలో ఎంతో కొంత హాని కలిగించే పదార్థాలు ఉంటాయి. ఎలా అంటారా… మనం ఏ కూర చేసుకున్నా అందులో ఉప్పు, కారం, నూనె వేయకుండా చేయలేము కదా, కొందరైతే వీటి పరిమాణాన్ని కాస్త ఎక్కువ చేసి వాడుతారు, అలాంటి వాళ్ళకు ఏ జబ్బైనా ఇట్టే వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళకోసం ఉప్పు, కారం తక్కువ మోతాదులో వేసి తయారుచేసిన ఆరోగ్యానికి ఔషధంలా పనిచేసే కొన్ని వంటకాలను మనం ఇప్పుడు చూద్దాం. తీపి గులాబీ రేకులు: … Read more