ఈ ఇంటి చిట్కాలను పాటిస్తే చాలు.. నోటిపూత నుంచి బయట పడవచ్చు..!
నోటిపూత చాలా సాధారణమైన సమస్య. నోటిలో పుళ్ళు ఏర్పడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది పెద్దగా హాని చేయకపోయినా చికాకుని కలిగిస్తుంది. నోటిపూతకి చాలా కారణాలున్నాయి. మలబద్దకం, విటమిన్ బీ, సీ లోపం, ఐరన్ లోపం, అసిడీటీ వంటివి కారణాలుగా కనిపిస్తాయి. ఆశ్చర్యం ఏమిటంటే ఈ సమస్య ఆడవాళ్లలోనే ఎక్కువగా కనిపిస్తుంది. హార్మోన్లలో మార్పులు కూడా నోటిపూతకి కారణం అవుతాయి. చెంపలు, పెదవులు.. లోపలి భాగాల్లో అయ్యే నోటిపూతని తగ్గించుకోవడానికి చాలా మార్గాలున్నాయి. ఇంట్లో ఉన్న వస్తువులతో…