ముక్కు దిబ్బడను తగ్గించే సహజసిద్ధమైన చిట్కా.. సింపుల్ గా ఇలా చేయండి చాలు..!
సీజన్ మారిందంటే చాలు రకరకాల సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. వాతావరణం మారడం వల్ల జలుబు చాలా తొందరగా వ్యాపిస్తుంది. జలుబు వల్ల ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ముక్కు దిబ్బడ కారణంగా చికాకు పెరుగుతుంది. ఏ పనీ చేయాలనిపించదు. ముక్కులోకి గాలి వెళ్ళకుండా ఏదో అడ్డుపడినట్లు భావన. ఐతే దీని తరిమి కొట్టడానికి మార్కెట్లో చాలా మెడిసిన్లు అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటికంటే మనం ఇంట్లోనే తయారుచేసుకునే ఆయుర్వేద ఔషధం గురించి ఇక్కడ తెలుసుకుందాం. సాధారణంగా…