క‌డుపులో మంట‌గా ఉంద‌ని అంటాసిడ్‌ల‌ను ఎక్కువ‌గా వాడుతున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

మ‌ద్యం అతిగా సేవించ‌డం… ఒత్తిడి.. జీర్ణ స‌మ‌స్య‌లు.. మ‌సాలాలు, కారం ఉన్న ప‌దార్థాలు ఎక్కువ‌గా తిన‌డం.. అల్స‌ర్లు.. త‌దిత‌ర అనేక కార‌ణాల వ‌ల్ల మ‌న‌లో అధిక శాతం మందికి క‌డుపులో మంట‌గా అనిపిస్తుంటుంది. అయితే క‌డుపులో మంట‌కు మెడిక‌ల్ షాపుల్లో దొరికే అంటాసిడ్ల‌ను చాలా మంది వాడుతుంటారు. కొంద‌రు టాబ్లెట్లు వేసుకుంటే, కొంద‌రు అంటాసిడ్ సిర‌ప్‌ల‌ను తాగుతుంటారు. అయితే నిజానికి అంటాసిడ్ల‌ను ఎక్కువ‌గా వాడ‌డం మంచిది కాదు. వాటితో మ‌న‌కు అనేక దుష్ప‌రిణామాలు క‌లుగుతాయి. అంటాసిడ్లు స‌హ‌జంగానే … Read more

మీ గుండె వేగంగా కొట్టుకుంటుందా ? అందుకు కార‌ణాలివే తెలుసా..?

మీకు మీ గుండె వేగంగా కొట్టుకుందేమోన‌ని అనుమానంగా ఉందా ? బీపీ చెక్ చేయించుకుంటే ఎక్కువ‌గా ఉందా ? మీ గుండె గ‌న‌క నిమిషానికి 100 సార్ల క‌న్నా ఎక్కువ‌గా కొట్టుకుంటే దాన్ని టాకీకార్డియా (tachycardia) అంటారు. అయితే ఇలా ఎందుకు జ‌రుగుతుంది ? అంటే.. గుండె నుంచి శ‌రీరంలోని ఇత‌ర అవ‌య‌వాల‌కు ర‌క్తం స‌ర‌ఫ‌రా అయ్యేందుకు ఒక ర‌క‌మైన ఎల‌క్ట్రిక‌ల్ ఇంప‌ల్స్ (విద్యుత్ ప్ర‌వాహం) స‌హాయ ప‌డుతుంది. ఈ విద్యుత్ ప్ర‌వాహంలో ఏవైనా తేడాలు వ‌స్తే … Read more

హార్ట్ ఎటాక్ వ‌చ్చేముందు క‌నిపించే సంకేతాలు, ల‌క్ష‌ణాలు ఇవే..!

గుండె పోటు సైలెంట్ కిల్ల‌ర్‌.. అది వ‌చ్చేదాకా చాలా సైలెంట్‌గా ఉంటుంది. కానీ ఒక‌సారి హార్ట్ స్ట్రోక్ వ‌స్తే మాత్రం.. బాధితులు విల‌విల‌లాడిపోతారు. అది వ‌చ్చేదాకా ఎలాంటి ల‌క్ష‌ణాలు మ‌న‌కు క‌న‌బ‌డ‌వు. కానీ హార్ట్ స్ట్రోక్ వ‌స్తుందంటే చాలు.. కొన్ని ల‌క్ష‌ణాల‌ను మాత్రం మ‌నం సుల‌భంగా క‌నిపెట్ట‌వ‌చ్చు. అవేమిటంటే… 1. గుండె పోటు వ‌స్తుంద‌నగా.. తీవ్ర‌మైన అల‌స‌ట క‌లుగుతుంది. అవ‌య‌వాల‌కు ర‌క్త ప్ర‌వాహం ఆగిపోతుంది. దీని వ‌ల్ల ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా జ‌ర‌గ‌దు. దీంతో అల‌స‌ట వ‌స్తుంది. అయితే … Read more

మూత్రం దుర్వాసన వస్తుందా..? అయితే కారణాలు ఇవే కావచ్చు..!

ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తులు మూత్ర విసర్జన చేస్తే మూత్రం ఎలాంటి దుర్వాసనా రాదు. కానీ అనారోగ్య సమస్యలు ఉన్నవారి మూత్రం దుర్వాసన వస్తుంది. అయితే ఎవరికైనా సరే మూత్రం దుర్వాసన వస్తుందంటే.. అందుకు అనేక కారణాలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారి మూత్రం దుర్వాసన వస్తుంటుంది. అయితే ఈ సమస్య పురుషుల కన్నా స్త్రీలకే ఎక్కువగా ఉంటుంది. కనుక స్త్రీలు ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వారి మూత్రం దుర్వాసన … Read more

అథ్లెట్స్ ఫుట్ అంటే ఏమిటో..? ఆ వ్యాధి ఎలా వ‌స్తుందో తెలుసా..?

ఫంగస్ వ‌ల్ల మ‌న కాలి వేళ్ల‌కు వ‌చ్చే ఓ ర‌క‌మైన చ‌ర్మ వ్యాధినే అథ్లెట్స్ ఫుట్ (Athlete’s foot) అంటారు. ఇది Trichophyton rubrum, Epidermophyton floccosum, Trichophyton mentagrophytes అనే 3 ర‌కాల ఫంగ‌స్‌ల వ‌ల్ల వస్తుంది. అలాగే కాలివేళ్ల‌కు చెమ‌ట ఎక్కువ‌గా ప‌ట్ట‌డం, రోగ నిరోశ‌క శ‌క్తి త‌క్కువగా ఉండ‌డం, పాదాల‌కు ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా లేక‌పోవ‌డం, స‌రిగ్గా శుభ్రం చేయ‌ని సాక్సులు వాడ‌డం, ప‌బ్లిక్ స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్ట‌డం, కాళ్ల‌కు ర‌క్ష‌ణ … Read more

టాబ్లెట్లు చేదుగా ఉన్నాయా..? ఇలా మింగేందుకు ట్రై చేయండి..!

మనకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే.. హాస్పిటల్‌కు వెళ్లి డాక్టర్లచే పరీక్ష చేయించుకుని వారు రాసే మందులను తెచ్చుకుని మింగుతుంటాం. దీంతో ఆ అనారోగ్య సమస్యల నుంచి మనకు ఉపశమనం లభిస్తుంది. వాటి నుంచి మనం బయటపడతాం. అయితే దాదాపుగా ఏ టానిక్ లేదా మందు బిళ్ల అయినా సరే.. చేదుగానే ఉంటుంది. దీంతో ఆ చేదు మందులను మింగాలంటే కొందరు జంకుతుంటారు. అయితే అసలు నిజానికి ఏ మందు బిళ్లలనైనా ఎలా మింగాలో తెలుసా..? అదే … Read more

మీ నోట్లో ఇలా ఉందా.. అయితే జాగ్ర‌త్త‌.. ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌ల‌వండి..

ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం చాలా మంది క్యాన్స‌ర్ బారిన ప‌డుతున్నారు. క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారి చాప కింద నీరులా విస్త‌రిస్తోంది. మ‌న శ‌రీరంలో అనేక భాగాల‌కు క్యాన్స‌ర్ వ‌స్తుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఏటా కొన్ని కోట్ల మంది క్యాన్స‌ర్‌తో చ‌నిపోతున్నారు. ప్ర‌స్తుతం ఉన్న ప్రాణాంత‌క వ్యాధుల్లో క్యాన్స‌ర్ ఒక‌టిగా మారింది. రోజూ ఎంతో మంది ఎన్నో ర‌కాల క్యాన్స‌ర్‌ల బారిన ప‌డి ప్రాణాల‌ను కోల్పోతున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుమారుగా ఏడాది 3 ల‌క్ష‌ల‌కు పైగా నోటి క్యాన్స‌ర్ బారిన ప‌డుతున్నార‌ని … Read more

ఎముక‌లను గుల్లగా మార్చే ఆస్టియోపోరోసిస్.. ఇవి తింటే వ‌స్తుంది..!

వ‌యస్సు మీద ప‌డిన కొద్దీ మ‌న‌కు వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ఆస్టియోపోరోసిస్ కూడా ఒక‌టి. ఎముక‌లు రాను రాను గుల్ల‌గా మారి పోయి బ‌ల‌హీన‌మైపోతాయి. దీంతో చిన్న దెబ్బ త‌గిలినా అవి విరుగుతాయి. దీన్నే ఆస్టియోపోరోసిస్ అంటారు. ఇది చాలా నెమ్మ‌దిగా వృద్ధి చెందుతుంది. ఆరంభంలో ఈ వ్యాధి ఉంటే గుర్తించ‌డం క‌ష్ట‌మే. ఎముక‌లు విరిగిన‌ప్పుడు, ఫ్రాక్చ‌ర్ అయిన‌ప్పుడు ప‌రీక్ష‌లు చేస్తే తెలుస్తుంది. అయితే మ‌నం నిత్య జీవితంలో తీసుకునే ప‌లు ఆహార పదార్థాలు కూడా ఆస్టియోపోరోసిస్ … Read more

ప‌సి పిల్ల‌ల‌ను 5 సెక‌న్ల‌లోనే ఏడుపు ఆపేలా చేసే టెక్నిక్‌..!

చిన్న పిల్లలు అన్నాక ఏడ‌వ‌డం స‌హ‌జం. వారు ఆకలి వేసినా, ఏదైనా ఇబ్బంది క‌లిగినా, అనారోగ్యంగా ఉన్నా.. బ‌య‌ట‌కు చెప్ప‌లేరు క‌నుక‌.. ఏడుస్తారు. అయితే ఆక‌లి వేసిన‌ప్పుడు పాల‌ను ప‌ట్టిస్తే సుల‌భంగా ఏడుపు ఆపేస్తారు. కానీ కొన్ని సార్లు వారు అస‌లు ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాదు. అలాంట‌ప్పుడు కింద చెప్పిన చిట్కా పాటిస్తే వారు కేవ‌లం 5 సెక‌న్ల‌లోనే ఏడుపు ఆపేస్తారు. మ‌రి ఆ చిట్కా ఏమిటంటే.. చిన్నారులు బాగా ఏడుస్తున్న‌ప్పుడు పాల కోసం కాకపోతే.. … Read more

గర్భధారణ సమయంలో ఛాతిలో నొప్పిగా ఉందా ? ఏ మాత్రం ఆలస్యం చేయకండి !

సాధారణంగా మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యేవరకు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గర్భధారణ సమయంలో రోజురోజుకు గర్భాశయం పరిమాణం పెరగడం చేత ఒత్తిడి అధికంగా ఊపిరితిత్తులపై పడటం వల్ల చాలామందిలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది తలెత్తుతుంది. ఈ క్రమంలోనే మరికొందరిలో చాతిలో మంట నొప్పి కలిగి ఉంటుంది.ఈ విధంగా ఛాతిలో నొప్పి కలిగి ఉండటం చేత మహిళలు ఎంతో కంగారుపడుతూ ఉంటారు.అయితే గర్భం దాల్చిన మహిళలు తరచూ ఛాతిలో నొప్పిగా ఉంటే ఏ … Read more