దోమ‌ల‌ను నిర్మూలించే ఎఫెక్టివ్ ట్రిక్ ఇదిగో..!

దోమ‌లు కుట్ట‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి అనారోగ్యాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. మ‌లేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ వంటి విష జ్వ‌రాలు ఎప్పుడు వ‌ద్దామా అని పొంచి ఉంటాయి. ప్ర‌ధానంగా సీజ‌న్ మారే స‌మ‌యంలోనైతే దోమ‌ల బెడ‌ద వ‌ర్ణ‌నాతీతం. వ‌ర్షానికి క‌రెంట్ పోతే రాత్రి పూట ఇక దోమ‌లు దాడి చేస్తాయి నా సామిరంగా, ఆ దెబ్బ‌కు రాత్రంతా నిద్ర ఉండ‌దు స‌రిక‌దా మ‌రుస‌టి రోజు తెల్ల‌వారు జామున కూడా దాని ఎఫెక్ట్ అలాగే ఉంటుంది. క‌రెంట్ ఉంటే … Read more

మీరు వీధి కుక్క‌లకి తిండి పెడుతున్నారా.. ఈ 10 పద్ధతులు తప్పక పాటించండి..

2016 వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం మన భారత దేశం లో సుమారు 3 కోట్లకు పైగా వీధి కుక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఆ లెక్క గణనీయంగా పెరిగి ఉండొచ్చు. వీధి జంతువులకి సరైన ఆహారం అంద‌క‌ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. మారే జీవన శైలి ప్రకారం ఒక‌ప్పుడుతో పోలిస్తే నేడు చాలా మంది జంతువులను పెంచుకుంటున్నారు. అయితే ఇప్పడు విపరీతంగా వీధి కుక్కలు మన దేశంలో ఉన్నాయి. వాటికి మీరు తిండి పెడితే ఈ సమాచారం … Read more

రైల్లో చైన్ లాగాడు.. ఎందుకు అని అడిగితే కారణం చెప్పాడు.. అందరూ షాకయ్యారు!

రైలు ఎక్కిన తర్వాత మనందరికీ ఒక ఫీలింగ్ ఉంటుంది.. ఆ చైన్ లాగితే ఎలా ఉంటుంది అని. చైన్ లాగితే రైలు ఆగుతుంది అని మనకు తెలుసు. కానీ మనం లాగం ఎందుకంటే, ఉత్తినే లాగితే ఫైన్ వేస్తారు కదా. కచ్చితమైన కారణం ఉంటే లాగొచ్చు. మరి ఆ కుర్రాడు ఏం చెప్పాడో తెలుసుకుందాం. ఢిల్లీ-ఆగ్రా రూట్‌లో మధుర జంక్షన్ రైల్వేస్టేషన్ దగ్గర జరిగిన ఓ ఘటన కలకలం రేపింది. రైలు మధుర జంక్షన్ నుంచి బయలుదేరింది. … Read more

నెయ్యి ఎంత తిన్నా ఫరవాలేదని, అది ఒబెసిటీ కలిగించేదైతే కాదని వస్తున్న వాదనలు ఎంతవరకు నిజం?

నెయ్యి ఎంత తిన్నా ఫరవాలేదని, అది ఒబెసిటీని కలిగించదనే వాదనలు పూర్తిగా నిజం కాదు. నిజానికి, ఈ వాదన చాలా పాత కాలం నుండి వస్తున్నది. అయితే, ఆధునిక పోషకాహార శాస్త్రం దీనికి భిన్నమైన వివరణ ఇస్తుంది. నెయ్యిలో విటమిన్ కె, విటమిన్ ఎ, విటమిన్ డి లాంటి కొన్ని ముఖ్యమైన పోషకాలు ఉంటాయి నెయ్యి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. నెయ్యిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఒక … Read more

క్యాబ్ డ్రైవ‌ర్ నేర్పిన చెత్త బండి సూత్రం.. అంద‌రూ ఇది పాటిస్తే చాలు..

క్యాబ్ లో ఏర్ పోర్ట్ కు బయల్దేరాను. క్యాబ్ సరైన ట్రాక్ లోనే పోతోంది. పక్కనున్న పార్కింగ్ ప్లేస్ నుండి ఒక కారు అకస్మాత్తుగా సర్రున దూసుకొచ్చింది. మా క్యాబ్ డ్రైవర్ వేగంగా బ్రేకులేసి ఆ కారుకు తగలకుండా ఆగిపోయాడు. ఆ కారు డ్రైవర్ పెద్దగా తిడుతూ కేకలు వేస్తున్నాడు. మా క్యాబ్ డ్రైవర్ చిన్నగా నవ్వి, చేయి వూపుతూ ముందుకు సాగి పోయాడు. నాకు ఆశ్చర్యం వేసి, నువ్వు అతన్నెందుకు వదిలేశావ్. క్షణంలో నీ కారు … Read more

టైట్ జీన్స్ ధరిస్తున్నారా… మీ ఆరోగ్యం మీరే పణంగా పెడ్తున్నారు…

మారుతున్న కాలానికి అనుగుణంగా యువతీయువకుల‌ అభిరుచి కూడా మారుతుంది.. వారి ఇష్టాలకు తగినట్టుగానే రకరకాల దుస్తులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. అమ్మాయిలకైతే బోలెడన్నీ మోడ్రన్ దుస్తులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో స్కిన్ టైట్ జీన్స్, స్కిన్ టైట్ లెగ్గింగ్స్, స్కిన్ టైట్ షాట్స్ ఇలా చాలా రకాలున్నాయి.. కానీ ఇలాంటి టైట్ దుస్తులను ధరించడం మన ఆరోగ్యానికి ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు… చాలామంది లావుగా ఉన్నవాళ్లు వారి పిరుదులు, తొడల భాగంలో ఉన్న అనవసర ఫ్యాట్ ని కనిపించకుండా … Read more

పండ్ల రంగు మారకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో తెలుసా.? ఈ సులువైన పద్దతులను ప్రయత్నించండి..!!

పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని అందరు అంటారు, ముఖ్యంగా రోజుకి కనీసం ఒక యాపిల్ పండు అయినా తినాలని డాక్టర్లు కూడా చెబుతారు, యాపిల్ పండును కోసిన కొద్ది సేపటికే రంగు మారుతుంది, యాపిల్ అనే కాదు చాలా పండ్లు కోసిన కొద్దిసేపటి తరువాత రంగు మారుతాయి, ఇలా మారకుండా ఉండాలంటే కొన్ని సులువైన పద్ధతులు పాటిస్తే చాలు. టేబుల్ స్పూన్ తేనెను తీసుకుని గోరు వెచ్చని నీటిలో వేసి కలిపి అందులో 30 సెకన్ల పాటు … Read more

సెల్‌ఫోన్‌లో సిగ్న‌ల్ స‌రిగ్గా ఉండ‌డం లేదా..? అయితే ఈ టిప్స్ పాటించండి సిగ్నల్ బాగా పెరుగుతుంది..

నేటి త‌రుణంలో సెల్‌ఫోన్ వాడ‌కం ఎంత ఎక్కువైందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి మళ్లీ ప‌డుకునే వర‌కు సెల్‌ఫోన్ వాడ‌కం మ‌న నిత్య కార్య‌క్ర‌మాల్లో ఒక‌టిగా మారిపోయింది. ఏం ఉన్నా లేకున్నా చేతిలో ఒక ఫోన్ ఉంటే చాలు, దాంతో మ‌స్త్ టైం పాస్ చేస్తున్నారు. అయితే సెల్‌ఫోన్ల వాడ‌కం ఎక్కువ‌వ‌డం ఏమోగానీ ఇప్పుడు చాలా మంది వినియోగ‌దారులు ఎదుర్కొంటున్న పెద్ద స‌మ‌స్య నెట్‌వ‌ర్క్‌. కాల్స్‌ క‌ల‌వ‌క‌పోవ‌డం, ఒక వేళ … Read more

యూట్యూబ్ చాన‌ల్స్‌లో వంట‌లు చేసేది ఇలాగా..?

నాకు తెలిసిన ఒకత‌ను వంటలకు సంబంధించింది యూట్యూబ్ ఛానల్‌ పెట్టాడు. చూద్దురు రండి అంటే వెళ్ళాను. ఊరికే రుచి చూడడానికి వెళ్లాను.(తేరగా తినడానికి కాదు ). అక్కడికి వెళ్లాక చూస్తే అత‌ను కెమెరా….లైట్ లు పెట్టి…..గంట టైం పట్టింది. తీరా వంట మొదలు పెట్టిన తరువాత మధ్య‌లో ఎరుపు, న‌లుపు పెయింట్ లాంటి వాసన వచ్చే దాన్ని స్ప్రే చేశాడు. తర్వాత దాని మీద మైనం లాంటిది పోశాడు. ఎందుకు రా అంటే…అది తినడానికి కాదు చక్కగా … Read more

కుక్క చెప్పిన పాఠం.. నీకు ఎన్ని తెలివి తేట‌లు ఉన్నా స‌రైన చోట లేక‌పోతే వృథాయే..

ఒక కిరాణా షాపు అత‌ను తన షాపు కట్టేస్తూ ఉండగా…అక్కడికి ఒక కుక్క వచ్చింది. దాని నోట్లో సరుకుల లిస్టు, డబ్బునోట్లు ఉన్నాయి. షాపు అత‌ను ఆశ్చర్యపోతూనే… లిస్ట్ చదివి సరుకులన్నీ సంచిలో ప్యాక్ చేసి దాని నోటికందించాడు. అది అక్కడినుంచి కదిలింది. షాపు అత‌నికి ఇదంతా ఎంతో ముచ్చటగా అనిపించింది. షాపు కట్టేసి కుక్కని ఫాలో అయ్యాడు. కుక్క చాలా క్రమశిక్షణతో గ్రీన్‌ లైట్ దగ్గర ఆగి, రెడ్‌ లైట్ వెలిగాక రోడ్ క్రాస్ చేసి … Read more