చాలా రిస్క్ తీసుకుంటున్న మ‌హేష్ బాబు.. ఎందుకంటే..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం త‌న నెక్ట్స్ సినిమాను రాజ‌మౌళితో చేస్తున్న విష‌యం విదిత‌మే. ఈ మూవీకి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక అధికారిక అప్‌డేట్ కూడా రాలేదు. కేవ‌లం షూటింగ్‌ను మాత్ర‌మే ప్రారంభించారు. ప్ర‌స్తుతం 2 షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా మ‌హేష్ త‌న నెక్ట్స్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు గాను మ‌హేష్ చాలా రిస్క్ తీసుకోబోతున్న‌ట్లు తెలుస్తోంది. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మూవీలో మ‌హేష్ యాక్ష‌న్ సీన్లు అన్నింటినీ … Read more

వేల కోట్ల ఆస్తులు ఉన్నా అక్కినేని అమల తులం బంగారం కూడా ఎందుకు పెట్టుకోరంటే ?

సినీ ఇండస్ట్రీలో నాగార్జున భార్య అమల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె నాగర్జున భార్యగా మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. నాగార్జునతో శివ, నిర్ణయం వంటి చిత్రాలలో కలిసి నటించింది. 1987లో నాగార్జున హీరోగా వచ్చిన కిరాయి దాదా సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది అమల. వివాహానికి ముందు సుమారుగా 50 చిత్రాలలో తమిళ్, మలయాళం, తెలుగు చిత్రాలలో నటించిన ఈమె … Read more

పెద్ద‌ల పాదాల‌కు న‌మ‌స్క‌రించ‌డం వెనుక ఉన్న కార‌ణాలు ఇవే..!

పెద్దవాళ్లు కనిపించగానే కాళ్లకు దండం పెట్టుకోవడం హిందువులు పాటించే ముఖ్యమైన సంప్రదాయం. ఎన్నో ఏళ్లుగా ఆచారంగా పాటిస్తున్నారు. ఇంట్లో పెద్దవాళ్లకు లేదా బంధువులకు, తల్లిదండ్రులకు, అమ్మమ్మలకు, తాతయ్యల గౌరవసూచకంగా కాళ్లకు నమస్కరించడం అనేది సంప్రదాయంగా వస్తోంది. కానీ ఇప్పుడు, ప్రస్తుత జనరేషన్ లో ఎవరు కనిపించినా హాయ్, హల్లో అని పలకరించడమే.. కష్టంగా మారింది. ఇక పాదాలకు నమస్కరించేవాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు. కానీ.. ఈ సంప్రదాయం కొన్ని సందర్భాల్లో, కొన్ని కార్యక్రమాల్లో మాత్రం ఖచ్చితంగా పాటిస్తుండటం … Read more

జుట్టు రాలిపోతుంద‌ని చింతిస్తున్నారా..? అయితే ఇలా చేయండి..!

ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ప్రతిఒక్కరూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. పైగా.. వాతావరణ పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవు. ఈ కారణాల వల్ల కొందరికి జుట్టు మాటిమాటికీ రాలిపోతుంటుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు సెలూన్స్, స్పాలకు వెళ్ళినా.. ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా, ఆ ప్రాబ్లమ్ అలాగే ఉండిపోతుంది. మరెన్నో మార్గాలు వినియోగించినప్పటికీ.. ఫలితం మాత్రం దక్కదు. ఇలాకాకుండా.. అందుబాటులో ఉండే హోమ్ రెమెడీస్‌తో ప్రయత్నిస్తే, మంచి ఫలితాలు కలుగుతాయని పరిశోధకులు అంటున్నారు. ఆ చిట్కాల్లో రెండు … Read more

ఎక్కువ‌గా కూర్చుని ఉంటున్నారా..? రోజుకు క‌నీసం 20 నిమిషాలు అయినా వ్యాయామం చేయాల‌ట‌.. ఎందుకంటే..?

ప్రస్తుతం మనిషి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు. కానీ ఇప్పుడు శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది. పేరుకు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారనే కానీ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఊబకాయం మొదలు మెడ నొప్పి, కండరాల నొప్పులు ఇలా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం వల్ల ఏర్పడుతోన్న ఇబ్బందుల నుంచి బయటపడడానికి రోజుకు 20 నిమిషాలు సమయం కేటాయిస్తే చాలని నిపుణులు చెబుతున్నారు. ఇదేదో … Read more

ఒక భర్త నుండి ఇంకో భర్త దగ్గరకి వెళ్లేముందు ద్రౌపది కన్యత్వాన్ని తిరిగి పొందడానికి ఏం చేసేదో తెలుసా.?

హిందూ పురాణాల్లో మహాభారతానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మనం చిన్నప్పటి నుంచి మహాభారతాన్ని అనేక సందర్భాల్లో తెలుసుకుంటూనే ఉన్నాం. మహాభారత గాథకు చెందిన పుస్తకాలను చదువుతున్నాం. టీవీల్లో సీరియల్స్‌, థియేటర్స్‌లో సినిమాలు చూస్తున్నాం. అయితే ఎన్ని చూసినా, చదివినా మనకు ఇంకా మహాభారతం గురించి తెలియని అనేక విషయాలు ఉన్నాయి. వాటిల్లో ఒక విషయం గురించే ఇప్పుడు మేం చెప్పబోయేది. అది కూడా ద్రౌపదికి సంబంధించినది. ఆమెకు సంబంధించి చాలా మందికి తెలియని విషయాలను … Read more

షుగ‌ర్ ఫ్రీ స్వీట్లు, ఆర్టిఫిషియ‌ల్ స్వీటెన‌ర్ల‌ను తింటున్నారా..? అయితే జాగ్ర‌త్త‌, క్యాన్స‌ర్ వ‌స్తుంద‌ట‌..!

షుగర్‌ వచ్చిన వాళ్లు స్వీట్స్‌ తినకూడదు. తీపిగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. కానీ చాలామంది నాచురల్‌ స్వీట్‌ను వదిలేసి ఆర్టిఫీషియల్‌ స్వీట్‌గా అలవాటు పడతారు. ఇది తియ్యగా ఉన్నా తిన్నా ఏం కాదట. మంచిదేనట. మనకు తీపి తినాలన్న కోరిక కూడా తీరుతుంది ఆరోగ్యానికి కూడా ఏ విధమైన హానీ ఉండదు అనుకుంటారు. కానీ ఇవి అంత సురక్షితం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization – WHO) హెచ్చ‌రిస్తోంది. చూయింగమ్‌లు, యోగర్ట్ … Read more

శ్రీ‌రాముడు, రామాయ‌ణానికి సంబంధించిన ఈ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు మీకు తెలుసా..?

కొన్ని గ్రంథాలలో శ్రీరాముని సోదరి, ఆమె పేరు శాంత వర్ణన ఉంది. దశరథ రాజు తన స్నేహితుడు అంగ రాజు రోంపాద్‌కు పిల్లలు లేనందున శాంతను దత్తత తీసుకున్నాడు. శ్రీరాముడు బ్రహ్మాస్త్రంతో సహా అనేక దివ్య ఆయుధాలను కలిగి ఉన్నాడు. రాముడి విల్లు కూడా చాలా దివ్యమైనది, ఆ విల్లు పేరు కోదండ. వాల్మీకి రామాయణం ప్రకారం.. శ్రీరాముడు సీతా స్వయంవరానికి వెళ్లలేదు. రాముడు విశ్వామిత్ర మహర్షితో కలిసి జనకపురికి వెళ్ళినప్పుడు, దానిని ఎత్తినప్పుడు శివుడి విల్లు … Read more

మీ జుట్టు రాలుతోందా..టెన్షన్ వద్దు ఈ చిన్న చిట్కాలతో ఒత్తయిన జుట్టు..!!

సాధారణంగా వ‌ర్షా కాలం వచ్చిందంటే కాలుష్యం, దుమ్ము, వ‌ర్షం వల్ల చాలామందికి జుట్టు సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే చాలామందిలో దీని కారణంగా జుట్టు మూలాలు బలహీనంగా మారుతాయి. దీనివల్ల జుట్టు రాలడం సమస్య పెరుగుతుంది. ఈ సమస్య ఎక్కువైతే బట్టతల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలా జుట్టు రాలుతోందని బాధపడేవారు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. గోరువెచ్చని నూనెతో మసాజ్.. జుట్టు పొడిబారకుండా ఉండాలంటే ప్రతి రోజు గోరువెచ్చని నూనెతో మసాజ్ చేసుకోవాలి. … Read more

పిల్ల‌ల‌కు పుట్టు వెంట్రుక‌లు ఎందుకు తీయిస్తారు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

సంప్రదాయాలు, ఆచారాలకు పెట్టింది పేరు హిందువులు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు హిందువులు చాలా సంప్రదాయాలు పాటిస్తారు. పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్లు పెద్దవాళ్లు అయ్యేవరకు.. ఏదో ఒక సంప్రదాయం పాటిస్తారు. తలనీలాలు, అన్నప్రాసన, నామకరణం ఇలా రకరకాల సంప్రదాయాలు హిందువులకు ప్రత్యేకం. కొన్ని సందర్భాల్లో ఈ ఆచారాలు, సంప్రదాయాలు.. వాళ్ల ప్రాంతాన్ని బట్టి విభిన్నంగా ఉండవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సంప్రదాయం పుట్టు వెంట్రుకలు తీయించడం. అంటే.. పుట్టిన పిల్లలకు మొదటిసారి తల వెంట్రుకలు తీయించడమని అర్థం. … Read more