ఈ ఆలయాన్ని దర్శించుకుంటే చాలు.. ఎలాంటి రోగాలు అయినా సరే పోతాయి..!
జ్యోతిర్లింగం అంటే అందరికీ గుర్తువచ్చే శ్లోకం సౌరాష్ట్రే సోమనాథంచ… మొట్టమొదటి జ్యోతిర్లింగం సోమనాథ్. సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే, జ్యోతిర్మయం చంద్రకలవతంసం, భక్తిప్రదానాయ క్రుపావతీర్థం, తం సోమనాథం శరణం ప్రపద్యే. స్వామి సోమనాథునిగా వెలసిన కథ స్కాంద పురాణంలో ఉంది. బ్రహ్మదేవుని మానసపుత్రుడైన దక్షప్రజాపతికి అశ్విని నుంచి రేవతి వరకు 27 కుమార్తెలున్నారు. తన కుమార్తెలను చంద్రునికి ఇచ్చి ఘనంగ వివాహం జరిపించాడు దక్షుడు. అయితే చంద్రుడు రోహిణిని మాత్రం అనురాగంతో చూస్తూ, మిగిలినవారిని అలక్ష్యం చేయసాగాడు. మిగిలినవారు…