ఎరుపు రంగును చూస్తేనే ఎద్దులు ఎందుకు దాడి చేస్తాయి ? ఎరుపంటే వాటికి ఇష్టం ఉండదా ?
ఎరుపు రంగును చూడగానే ఎద్దులు కోపంతో ప్రవర్తిస్తాయని, అడ్డు వచ్చిన వారిని కొమ్ములతో కుమ్మేస్తాయని చెబుతుంటారు. ఇలాంటి సన్నివేశాలను మనం సినిమాల్లోనూ చాలా చూశాం. ఇక స్పెయిన్ దేశంలో అయితే బుల్ ఫైట్‌లను నిర్వహిస్తుంటారు. ప్రత్యేక వేషధారణల్లో ఉండే బుల్ ఫైటర్స్ ఎద్దులకు ఎరుపు రంగు వస్త్రాలను చూపుతూ వాటిని రెచ్చగొడుతుంటారు. ఆ ఫైట్‌ను చూసేందుకు స్పెయిన్ ఏటా ఎన్నో కోట్ల మంది కూడా వస్తుంటారు. అయితే ఎద్దులు నిజంగానే ఎరుపు రంగును చూస్తే కోపంగా ప్రవర్తిస్తాయా…