ఈ మూడు లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా ? జాగ్రత్త అది మీకు గుండెపోటుకి దారి తీయొచ్చు..!

ఈమధ్య గుండెపోటు కేసులు ఎక్కువయ్యాయి. అప్పటివరకు బాగానే ఉన్నవారు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి తిరిగిరాని లోకాలకు చేరిపోతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న వారు పెరిగిపోతున్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతిరోజు వ్యాయామం చేసే యువతలో కూడా ఆకస్మాత్తుగా గుండెపోటు రావడం ప్రస్తుతం మనం ప్రధానంగా చూస్తున్నాం. అయితే ఈ మూడు లక్షణాలు మీలో ఉంటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. మన పని, షెడ్యూల్, జీవనశైలి అన్ని … Read more

వయస్సును బట్టి రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా?

ఆహారం, నీరు, ఆక్సిజ‌న్ త‌రువాత మ‌నిషికి అత్యంత అవ‌స‌ర‌మైన వాటిలో నిద్ర కూడా ఒక‌టి. నిద్ర వల్ల మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. శ‌రీరం క‌ణ‌జాలాల‌ను మ‌ర‌మ్మ‌త్తులు చేసేందుకు, కొత్త క‌ణ‌జాలం పెరిగేందుకు, శ‌రీరం ఎదుగుద‌ల‌కు, జీవ‌క్రియ‌ల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు, శ‌క్తికి, ఉత్తేజానికి నిద్ర చాలా అవ‌స‌రం. నిద్ర లేక‌పోతే అనేక ర‌కాల అనారోగ్యాలు వ్యాపించేందుకు పొంచి ఉంటాయి. అయితే వ‌య‌స్సుకు త‌గ్గ‌ట్టుగా మ‌నం రోజుకు ఎన్ని గంట‌లు నిద్ర పోవాలో తెలుసా..? తెలీదా..? అయితే ఎన్ని గంట‌లు … Read more

ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తి రోజుకు ఎన్ని సార్లు మూత్ర విస‌ర్జ‌న చేయాలో తెలుసా..?

మ‌న తిన్న ఆహారాన్ని, తాగిన ద్ర‌వాల‌ను క‌లిపి మూత్ర‌పిండాలు వ‌డ‌పోయ‌గా వ‌చ్చే వ్య‌ర్థ ద్ర‌వాన్ని మూత్ర‌మంటార‌ని మ‌నంద‌రికీ తెలుసు. మూత్ర విస‌ర్జ‌న చేయ‌డ‌మంటే వ్య‌ర్థాల‌ను బ‌య‌టికి పంప‌డ‌మే. ఈ క్ర‌మంలో రోజూ కొంద‌రు అధికంగా, మ‌రికొంద‌రు త‌క్కువ‌గా మూత్రానికి వెళ్తారు. అందుకు ర‌క ర‌కాల కార‌ణాలు ఉన్నాయి. అయితే ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తి రోజుకు ఎన్నిసార్లు మూత్ర విస‌ర్జ‌న చేయాలో మీకు తెలుసా..? తెలుసుకుందాం రండి. మ‌నిషికి నిత్యం 2 నుంచి 3 లీట‌ర్ల నీరు అవ‌స‌రం. క‌చ్చితంగా … Read more

డ‌యాబెటిస్ మొత్తం ఎన్ని ర‌కాలుగా ఉంటుందంటే..?

ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన మూడు డయాబెటిస్ మెల్లిటస్ రకాలు: వివిధ రకాల కారణాల వల్ల కలిగే డయాబెటిస్ మెల్లిటస్ టైప్ 1. 1వ రకం, డయాబెటిస్ మెల్లిటస్ టైప్ 2, జెస్టేషనల్ డయాబెటిస్ (గర్భిణీలలో వచ్చే డయాబెటిస్). అయినా, అన్ని రకాల మధుమేహాలకు మూల కారణం క్లోమ గ్రంధిలోని బీటా కణాలు పెరిగిన గ్లూకోస్ స్థాయిని అరికట్టడానికి సరిపడినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడమే. మొదటి రకం డయాబెటిస్ సాధారణంగా బీటా కణాలను మన శరీరం స్వయంగా … Read more

మీకు త‌ర‌చూ గుండెల్లో ద‌డ‌గా ఉంటుందా.. అయితే అందుకు కార‌ణాలు ఇవే..!

మామూలుగా గుండె యొక్క స్పందనలను మనం గుర్తించలేము. గుండెదడను ఆంగ్లంలో పాల్పిటేషన్స్ అని వ్యవహరిస్తారు. గుండె దడ అనగా తన గుండె తనలో వేగముగా కొట్టుకొంటున్నట్లు తోచుట. సాధారణంగా ఆందోళనగా ఉన్నప్పుడు, వ్యాయామం తరువాత కొందరిలో ఇది కొంతసేపు ఉంటుంది. గుండెదడ చాలాకాలంగా నిరంతరంగా కొనసాగేటట్లయితే దానివలన వచ్చే వ్యాధుల గురించి ఆలోచించాలి. వైద్యులను సంప్రదించి, మొదటి దశలోనే తగిన చికిత్స చేయించుకోవాలి. గుండెదడకు కారణాలు పరిశీలించండి. మానసిక ఒత్తిడి : మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైన … Read more

కొవ్వును క‌రిగించడ‌మా.. బ‌రువును త‌గ్గించ‌డ‌మా..? ఏది ముఖ్యం..?

నేటి రోజుల్లో చాలామంది లావుగా వుండటం, వారు సన్నపడిపోవాలని ఏదో ఒక ప్రయత్నం చేయటం, బరువు తగ్గుతానని భావిస్తూండటం జరుగుతోంది. వీరు సాధారణంగా ఈ అంశాలు పేపరు ప్రకటనలు, సెలిబ్రటీల ప్రకటనలనుంచి ఈ రకమైన వాటికి మొగ్గుచూపుతారు. అయితే, ఇవి సరైనవేనా, వాస్తవ ఫలితాలనిస్తాయా? అనేదానికి కొన్ని వాస్తవాలు పరిశీలించండి. కొన్నిమార్లు ఎంత కష్టపడినప్పటికి బరువు తగ్గరు. మరి కొన్ని మార్లు చిన్నపాటి చిట్కా వ్యాయామాలతో బరువు తగ్గుతారు. శరీరంలో అధికభాగం కొవ్వు చేరి లావెక్కామా? లేక … Read more

ప్లాస్టిక్ క‌వ‌ర్లను ఉప‌యోగించ‌డం ఇప్ప‌టికైనా మానేయండి.. ఎందుకంటే..?

హీరోయిన్ ప్లాస్టిక్ సంచిలో బీర్లు తీసుకువెళ్తుంటే అది చూసిన హీరో ఆ కవర్ దేశంలో బ్యాన్ చేసిన కూడా అమ్మేస్తున్నారా? అది 20 మైక్రాన్ కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ సంచి అని, దానివల్ల పర్యావరణానికి ఎంత హాని కలుగుతుందో తెలుసా అని షాప్ వాడితో గొడవకి దిగుతాడు. అసలు ఏమిటీ ప్లాస్టిక్ సంచి మైక్రాన్??? ప్లాస్టిక్ సంచి మందం కొలత యూనిట్ మైక్రాన్, ఒక మైక్రాన్ అంటే మిల్లిమీటర్ లో వెయ్యో వంతుతో సమానం (1 … Read more

ఉల్లిపాయ ముక్క‌ల‌ను చంక‌ల్లో పెట్టుకుంటే జ్వ‌రం ఎందుకు వ‌స్తుంది..?

ఈ జనరేషన్‌ వాళ్లకు తెలియదు కానీ 90s కిడ్స్‌ స్కూల్‌ ఎగ్గొట్టాలంటే ఉల్లిపాయను చంకల్లో పెట్టుకోవడం చేసే వాళ్లు.. అదే వారికి బెస్ట్‌ ఐడియా. రాత్రి చంకల్లో ఉల్లిపాయను పెట్టుకోని పడుకుంటే తెల్లారేసరికి జ్వరం వస్తుంది. స్కూల్‌కు డుమ్మా కొట్టొచ్చు. చాలా సినిమాల్లో కూడా ఈ సీన్‌ చూపిస్తారు. అసలు చంకలో ఉల్లిపాయ పెట్టుకుంటే జ్వరం ఎందుకు వస్తుంది..? ఉల్లిపాయకు, జ్వరానికి ఏంటి సంబంధం..? దీనిపై వైద్యులు ఏం అంటున్నారు.? ఉల్లిపాయ‌ను నిలువుగా కోసి దానిని రెండు … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారు పాటించాల్సిన జీవ‌న విధానం ఇది..!

డయాబెటీస్ వ్యాధి జీవన విధానం సరిగా లేని కారణంగా వస్తుంది. ఈ వ్యాధి బారిన పడటానికి సాధారణంగా మనం కలిగివుండే చెడు అలవాట్లు ఎలా వుంటాయో చూడండి. అతిగా పాలుత్రాగడం, పాల ఉత్పత్తులు భుజించడం. అతిగా చక్కెర ఉపయోగించడం, చక్కెర రసాలు త్రాగడం, క్రొత్తగా పండిన ధాన్యాలను, తెల్లని బియ్యాన్ని వంటలలో వాడడం, ఆల్కహాల్ వంటి మత్తు పానీయాలు సేవించడం, అతిగా నిద్ర పోవడం మరియు శరీరశ్రమ లేదా వ్యాయామం కావలసినంత చేయకపోవడం, మానసిక ఆందోళన, భారీ … Read more

డ‌యాబెటిస్ వ్యాధిలో రోగిదే ముఖ్య పాత్ర‌..!

మీకు వచ్చిన డయాబెటీస్ వ్యాధిని మీరే నియంత్రించుకోవాలి! అది ఎలా? ప్రతిరోజూ…ప్రతి భోజనంలోనూ, లేదా ప్రతి ఆహారంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. బ్లడ్ షుగర్ స్వయంగా చెక్ చేసుకోవడం, డాక్టర్ అపాయింట్ మెంట్లు, ల్యాబ్ పరీక్షలు వంటి వాటి ద్వారా మీ ఆరోగ్యాన్ని మీరు పరిరక్షించుకుంటున్నారు. మీకు తోడుగా ఒక వైద్యుడు, పోషకాహార నిపుణుడు, డయాబెటీస్ నిపుణుడు, వ్యాయామ శిక్షకుడు, ఫార్మసిస్టు ఇంకా ఎందరో ఈ అంశంలో మీకు సహకరిస్తారు. డయాబెటీస్ స్వయం నియంత్రణ అనేది 24/7 గంటల … Read more