బెడ్‌పై అడ్డ దిడ్డంగా నిద్రిస్తున్నారా..? అలా ఎందుకు అవుతుందో, తగ్గేందుకు సూచనలు ఏమిటో తెలుసుకోండి..!

రాత్రి పూట ఎవరైనా చాలా పద్ధతిగా, నీట్‌గా బెడ్‌ సర్దుకుని బెట్‌ షీట్లు కప్పుకుని నిద్రిస్తారు. నిద్రించినప్పుడు బెడ్‌ కూడా బాగా నీట్‌గా ఉంటుంది. కానీ తెల్లారి లేచి చూసే సరికి బెడ్‌ చిందర వందర అయి ఉంటుంది. బెడ్‌ షీట్స్‌ అసలు బెడ్‌పై ఉండవు. అటో, ఇటో ఎటో ఒక పక్కకు పడిపోతాయి. ఇక బెడ్‌పై పడుకునే వారు అయితే రక రకాల భంగిమల్లో తిరిగి ఉంటారు. కొందరైతే పూర్తిగా రివర్స్‌ అవుతారు. అంటే.. నిద్రించినప్పుడు … Read more

వ్య‌వ‌సాయం చేసే రైతు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. ఇద్ద‌రూ స‌మాన‌మేనా..? లాజిక్‌గా ఆలోచిస్తే..?

ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే నాలుగు ఎకరాలు ఉన్న వ్యవసాయదారుడు, 60 ,70 వేల జీతం ఉన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇద్దరు సమానమే అంటారా లేదా? సమానమో కాదో తెలియాలి అంటే గణాంకాలు ఉండాలి. ఏ ప్రాతిపదికన లెక్క వేయాలో ప్రమాణాలు కూడా ఉండాలి. అవేం లేకుండా పోల్చలేం. నెలకు ఎవరు ఎంత సంపాదిస్తున్నారు అనేది చూడాలా? ఎవరు బ్యాంకులకు ఎంత కడుతున్నారో చూడాలా? నెలకు ఎవరికి ఎంత మిగులుతుంది అనేది చూడాలా? ఎవరి అప్పులు ఎంత … Read more

ఇంట్లో నుంచి ద‌రిద్ర దేవ‌త పోయి లక్ష్మీదేవి రావాలంటే ఏం చేయాలి.. చిన్న క‌థ‌..!

అనగనగా.. ఒకసారి లక్షీదేవి ఒక వ్యక్తి పై కోపగించుకొని ఈ ఇంటినుండి వెళ్లి పోతున్నాను. ఇక మీ ఇంటికి దరిద్ర దేవత రాబోతుంది. కాకపోతే నీకో వరం ఇవ్వదలచుకొన్నాను. అడుగు! అని అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో ఇలా అంటాడు… అమ్మా నీవు వెళ్లుతుంటే ఆపే శక్తి నాకు లేదు. అలాగే దరిద్రదేవత వస్తుంటే ఆపే శక్తి అంతకన్నా లేదు. మీలో ఒకరు వున్నచోట ఒకరు వుండరు. కాబట్టి దరిద్ర దేవత వచ్చిన వేళ మా … Read more

భోజ‌రాజుకు క‌లిగిన వింత కోరిక‌.. అందుకు కాళిదాసు ఏమ‌న్నాడో తెలుసా..?

అనగనగా… ఒక సారి భోజరాజుకు వింత కోరిక కలిగింది. నేను మరణించిన తర్వాత కాళిదాసు తన గురించి ఏమి చెప్తాడు? అని. వెంటనే కాళిదాసును పిలిపించి తన కోరిక చెప్పాడు. దానికి కాళిదాసు.. మీ కోరిక పిచ్చిగానూ, అమంగళకరము గానూ ఉంది. నేను తీర్చలేను క్షమించండి అన్నాడు. రాజాజ్ఞను ధిక్కరించిన వారికి దేశ బహిష్కారమే శిక్ష అన్నాడు రాజు అలాగైనా భయపడి చెప్తాడేమో నని. కానీ, కాళిదాసు మాత్రం విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని చెప్పి ధారా … Read more

గ్యాస్ స‌మ‌స్య ఉన్న‌వారు ఈ సూచ‌న‌లు పాటిస్తే ఈజీగా దాన్నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..

అజీర్ణం ఎంతో చికాకు కలిగిస్తుంది. త్రేన్పులు పై నుండి, గ్యాస్ మలద్వారం నుండి పోతూవుంటుంది. ఒకొక్కపుడు బయటకు పోకుండా తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది. దీనికి కారణం….అనారోగ్యకర పదార్ధాలు విచ్చలవిడిగా తినేయడమే. వీటి కారణంగా పొట్టలో యాసిడ్ తయారై పొట్టనుండా పైభాగానికి ప్రవహించి కొన్ని సార్లు గుండెమంట కూడా కలిగిస్తుంది. మరి ఈ అజీర్ణం కలిగించే పదార్ధాలు ఏమిటో తెలుసుకోండి. – నూనెలు, కొవ్వులు అధికంగా వుండే పదార్ధాలు అజీర్ణం కలిగించి పొట్టలో గ్యాస్ పుట్టిస్తాయి. పొట్టలోని నూనె … Read more

మ‌హిళ‌ల‌కు డ‌యాబెటిస్ ఉంటే వారి గ‌ర్భంలో ఉన్న శిశువుల‌కు కూడా అది వ‌స్తుందా..?

గర్భవతి మహిళలలో హార్మోన్ల స్ధాయి పెరగటం వలన డయాబెటీస్ వచ్చే అవకాశాలుంటాయి. స్వీట్లు అధికంగా తినడం, శరీరానికి తగిన వ్యాయామం లేకపోవటం ఈ సమస్యకు కారణంగా చెప్పవచ్చు. గర్భవతిలో వచ్చే షుగర్ వ్యాధి డెలివరీ సమస్యలను కూడా కలిగిస్తుంది. సాధారణంగా గర్భం ధరించిన తర్వాత మహిళల‌కు తిండిపై అధిక ధ్యాస ఏర్పడి తీపి పదార్ధాలు సైతం అధికంగా తినటంతో ఈ సమస్య ఏర్పడుతుంది. అయితే, గర్భవతులకు వచ్చే డయాబెటీస్ ఆహార మార్పు, ఒత్తిడి కలిగించని జీవన విధానం, … Read more

రోజూ బాదంప‌ప్పుల‌ను తింటే మీ గుండెకు శ్రీ‌రామ‌ర‌క్ష‌..

బాదం పప్పులో విటమిన్ ఇ, మెగ్నీషియం, మేంగనీస్, అధిక మొత్తంలో పీచు, కాపర్, ఫాస్పరస్, రిబోఫ్లావిన్ లుంటాయి. అంతేకాక ఒక ఔన్సులో 13 గ్రాముల కొవ్వు, 1 గ్రాము సంతృప్త కొవ్వు వుండి కొల్లేస్టరాల్ లేకుండా వుంటాయి. ఆరోగ్యంగా జీవించాలంటే పోషకాలు కావాలి. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, ఫ్యాట్స్ వలెనే విలమిన్లు, మినరల్స్ కూడా అవసరం. గుండె సమస్యలు తగ్గించాలంటే ప్రతిరోజూ ఒక గుప్పెడు బాదం పప్పులు తింటే ఫలితాలు బాగా వుంటాయి. బాదం పప్పు ప్రతి ఔన్సులో … Read more

త‌ర‌చూ మీకు గుండె ద‌డ‌గా ఉంటుందా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసుకోండి..

ఆరోగ్యంగా ఉండటం అంటే పైకి అందంగా కనపించడం కాదు.. చూడ్డానికి హెల్తీగానే ఉంటారు కానీ లోపల ఏదో తెలియని టెన్షన్‌. ఒక్కోసారి మనసు గందరగోళంగా, భయం భయంగా, హార్ట్‌ బీట్‌ ఉన్నట్టుండి పెరిగిపోతున్నట్లు అనిపిస్తుంది. ఏదైనా కీడు జరుగుతుందని మనం అలా ఆలోచిస్తాం. కానీ ఇలా తరచూ జరుగుతుందంటే.. మీ బాడీలో విటమిన్‌ b12లోపం ఏర్పడినట్లే.! నిజానికి ఇది అన్ని విటమిన్లలా కాదు. మీరు సరిపడా అందిస్తే.. నాలుగు సంవత్సరాల వరకూ అయినా బాడీ నిల్వచేసుకుంటుంది. అయినా … Read more

ఉసిరికాయ‌లు మాత్ర‌మే కాదు, వాటి గింజ‌ల‌తోనూ ఎన్నో లాభాలు ఉన్నాయి..

కొన్ని కాయలే కాదు.. వాటిలో విత్తనాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెప్తుంటారు. ఖర్జూరం, చింతపండు విత్తనాలు ఇలా.. ఈ లిస్ట్‌లోకి ఉసిరికాయ కూడా చేరింది. ఉసిరికాయ గింజల్లో కూడా బోలెడు ఔషధగుణాలు ఉన్నాయట. ఆయుర్వేదంలో ఉసిరికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉసిరి గింజలకు అంతే విశిష్టత ఉందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అసలు ఉసిరి గింజల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయంటే. ఉసిరి గింజలలో విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్, … Read more

ఈ ఫ్యాట్ బ‌ర్నింగ్ డ్రింక్‌ను తాగితే 7 రోజుల్లోనే అద్భుతమైన ఫ‌లితం పొంద‌వ‌చ్చు..

బరువు పెరగడం చాలా సులువు అయ్యిపోయింది. పెరగడం ఎంత ఈజీనో తగ్గడం అంత కష్టం.ఆహారపు అలవాట్లు, శరీరానికి శ్రమ లేకపోవడం, నిద్రను నిర్లక్ష్యం చేయడం, ఒత్తిడి, మద్యపానం వంటివి అధిక బరువుకు ప్రధాన కారణాలు. కాగా,మధుమేహం, గుండె జబ్బులు, జీవక్రియ రుగ్మతలు తలెత్తే అవకాశాలు పెరుగుతాయి. అందుకే శరీర బరువును అదుపులో ఉంచుకోవాలని ఆరోగ్య నిపుణులు ఎప్పటికప్పుడు చెబుతుంటారు. బరువు తగ్గడం కోసం ఆహారంలో ఎన్నెన్నో మార్పులు చేర్పులు చేసుకుంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ డ్రింక్‌ను … Read more