రోజూ ఉద‌యం 2 నిమిషాల పాటు ఈ ఆస‌నం వేయండి.. పొట్టంతా క్లీన్ అవుతుంది..!

దాదాపుగా అన్ని వ‌య‌స్సుల వారిని మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఇబ్బందుల‌కు గురి చేస్తుంటుంది. దీంతో త‌ల‌నొప్పి వ‌స్తుంది. మూడ్ మారుతుంది. ప‌నిచేయ‌బుద్దికాదు. మ‌ల‌బ‌ద్ద‌కం వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అధ్య‌య‌నాల ప్ర‌కారం.. ఫైబ‌ర్ ఎక్కువ‌గా తిన‌క‌పోవ‌డం వ‌ల్ల‌, ద్ర‌వాల‌ను ఎక్కువ‌గా తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం వ‌స్తుంటుంద‌ని వెల్ల‌డైంది. మ‌ల‌బ‌ద్ద‌కం వ‌స్తే విరేచ‌నం గ‌ట్టిగా అవుతుంది. చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుంది. క‌డుపులో నొప్పి, వికారం, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే పండ్లు, కూర‌గాయ‌లు, ఆకుకూర‌లు, … Read more

ఎలాంటి ఆటంకాలు లేకుండా స‌రైన రీతిలో యోగా చేయాల‌నుకుంటే పాటించాల్సిన సూచ‌న‌లు..!

అనేక ర‌కాల వ్యాధులు రాకుండా ఉండేందుకు నిత్యం మ‌నం పౌష్టికాహారం తీసుకోవ‌డంతోపాటు వ్యాయామం లేదా యోగా వంటివి చేయ‌డం అత్యంత ఆవ‌శ్య‌కం అయింది. యోగాకు ప్ర‌స్తుతం చాలా మంది ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నారు. అయితే యోగా చేయ‌డంలో కొంద‌రికి ఆటంకాలు వ‌స్తుంటాయి. కొంద‌రు యోగా స‌రిగ్గా చేయ‌లేక‌పోతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన సూచ‌న‌ల‌ను పాటిస్తే దాంతో ఎలాంటి అడ్డంకి లేకుండా స‌జావుగా యోగా చేయ‌వచ్చు. యోగా ద్వారా క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను పూర్తి స్థాయిలో పొంద‌వచ్చు. అందుకు ఏం … Read more

Yoga For Digestion: భోజనం చేసిన త‌రువాత ఈ 2 యోగాస‌నాలు వేయండి.. జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది..!

Yoga For Digestion: రోజూ రాత్రి పూట భోజ‌నం చేసిన వెంట‌నే నిద్రించ‌రాదు. రాత్రి భోజ‌నానికి, నిద్ర‌కు మ‌ధ్య క‌నీసం 3 గంట‌ల వ్య‌వ‌ధి ఉండాలి. లేదంటే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అధికంగా బ‌రువు పెరుగుతారు. జీర్ణ‌శ‌క్తి న‌శిస్తుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాదు. అందువ‌ల్ల రాత్రి భోజ‌నం చేసిన వెంట‌నే నిద్రించ‌రాదు. క‌నీసం 3 గంట‌ల స‌మ‌యం ఉండేలా చూసుకోవాలి. ఇక అజీర్ణ స‌మ‌స్య ఉన్న‌వారు, మ‌ల‌బ‌ద్ద‌కంతో బాధ‌ప‌డుతున్న‌వారు భోజ‌నం చేసిన త‌రువాత కింద … Read more

సైన‌స్, జ‌లుబు ఇబ్బంది పెడుతున్నాయా ? అయితే ఈ 5 యోగాస‌నాలు వేయండి..!

చ‌లికాలంతోపాటు వ‌ర్షాకాలంలోనూ సైన‌స్ స‌మ‌స్య ఇబ్బందులు పెడుతుంటుంది. దీనికి తోడు జ‌లుబు కూడా వ‌స్తుంటుంది. ఈ రెండు స‌మ‌స్య‌లు ఉంటే ఒక ప‌ట్టాన త‌గ్గ‌వు. అనేక అవ‌స్థలు ప‌డాల్సి వ‌స్తుంది. అయితే యోగాలో ఉన్న ఈ 5 ఆస‌నాల‌ను వేయ‌డం వ‌ల్ల ఆ రెండు స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి ఆ ఆస‌నాలు ఏమిటంటే.. 1. పాద‌హ‌స్తాస‌నం నిటారుగా నిల‌బ‌డి కింద‌కు వంగి చేతుల‌తో పాదాల‌ను తాకాలి. ఆరంభంలో క‌ష్టంగా ఉంటే మోకాళ్ల‌ను కొద్దిగా వంచ‌వ‌చ్చు. ఇలా … Read more

గ‌ర్భిణీలు, పాలిచ్చే త‌ల్లుల‌కు యోగా వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

యోగా అనే సంస్కృత పదం ‘యుజ్’ నుండి వచ్చింది, దీని అర్థం ‘ఏకం కావడం’. ఇది మనస్సు, శరీరం, ఆత్మ మధ్య ఏకీకృత సమతుల్యతను సూచిస్తుంది. గర్భధారణలో యోగా అనేది గర్భం యొక్క అనేక సవాళ్లను ఎదుర్కోవటానికి, శారీరక, మానసిక, భావోద్వేగ, మేథోపరమైన ప్ర‌క్రియ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్రసవం అనేది ఒక భావోద్వేగ అనుభవం. కానీ ఒక అనుభూతిని ఆనందంగా, ఉల్లాసంగా ఆస్వాదించేందుకు యోగా ఉప‌యోగ‌ప‌డుతుంది. యోగా భావోద్వేగ నియంత్రణకు సహాయపడుతుంది.శ‌రీరానికి శ‌క్తిని అందిస్తుంది. గ‌ర్భిణీల‌కు త‌మ గ‌ర్భంలో … Read more