గుండె జ‌బ్బుల కార‌ణంగానే చాలా మంది మ‌ర‌ణిస్తున్నార‌ట‌..!

అమెరికాలో మరణాలకు ప్రధానంగా కరోనరీ గుండె జబ్బులే కారణమని ఇటీవల సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్ధ నిపుణులు జారీ చేసిన నివేదికలో వెల్లడైంది. అమెరికాలో గుండెజబ్బుల వైద్యం కొరకు వైద్యులను సంప్రదించిన కేసులు 6.7 శాతం నుండి 6 శాతంకు పడినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఈ తగ్గుదలకు కారణం పొగతాగేవారు, రక్తపోటు రోగులు,కొల్లెస్టరాల్ అధికంగా వున్నవారు తగ్గటం కావచ్చునంటున్నారు పరిశోధకులు. తగ్గుదల ఈ విధంగా వున్నప్పటికి అమెరికా దేశంలో మరణాలు అధికంగా గుండె … Read more

పుట్టిన‌ప్పుడు శ‌రీరం చిన్న సైజులో ఉండే వారికి గుండె జ‌బ్బులు వ‌స్తాయ‌ట‌..!

పుట్టినపుడు శరీరం చిన్న సైజులో వుండి యవ్వనంలో అధిక బరువు పొందితే ఇక ఆపై గుండె జబ్బులు తప్పదంటోంది తాజాగా చేసిన ఒక అధ్యయనం. ఇంతేకాక, ఈ అధ్యయంనంలో పిండ దశ నుండి, బాల్యం, యవ్వనం, వరకు ఆరోగ్య జీవన విధానాలను ఎలా ఆచరించి గుండె సమస్యలు లేకుండా కూడా చేసుకోవచ్చనేది సూచిస్తోంది. ఈ స్టడీలో, రీసెర్చర్లు 5, 840 మంది వ్యక్తులను వారి పిండ దశ నుండి 31 సంవత్సరాల వయసు వరకు పరిశీలించి పుట్టినపుడుండే … Read more

మీరు డార్క్ చాక్లెట్లను తింటారా..? అయితే మీకు గుడ్ న్యూస్‌..!

చాక్లెట్ ను ఇప్పటికే అనేక ఆరోగ్య ప్రయోజనాలకు వాడుతున్నారు. ఇక ఇపుడు చాక్లెట్లు తినేవారికి మరింత శుభవార్తగా డార్క్ చాక్లెట్ డైలీ తింటే గుండె జబ్బులు కూడా దూరమవుతున్నాయంటున్నారు ఒక ఫుడ్ సైంటిస్ట్. ఒక్కటి తింటే చాలు ఆరోగ్యంలో గణనీయమైన మార్పు కనపడుతుందని చెపుతున్నారు ప్రొఫెసర్ రోజర్ కార్డర్. గతంలో చేసిన చాక్లెట్లు గుండెజబ్బుల అధ్యయనాన్ని మరోమారు సమీక్షించిన ప్రొఫెసర్ కార్డర్ ఖచ్చితమైన డోస్ అంటే ఒక ఔన్సు లేదా 25 గ్రాములు అంటే షుమారు రెండు … Read more

Salt : ఉప్పును ఈ మోతాదు క‌న్నా మించి తీసుకుంటున్నారా.. అయితే మీ గుండెకు ముప్పు పొంచి ఉన్న‌ట్లే..!

Salt : ఉప్పు.. ఇది తెలియ‌ని వారు అలాగే ఇది లేని వంట గ‌ది లేద‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌నం వంటింట్లో చేసే ప్ర‌తి వంట‌లోనూ దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. మ‌నం చేసే వంట‌ల‌కు చ‌క్క‌టి రుచిని తీసుకురావ‌డంలో ఉప్పు మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. ఉప్పు.. దీనినే సోడియం క్లోరైడ్ అని అంటారు. ఇది మ‌న శ‌రీరానికి చాలా అవ‌స‌రం. మ‌న శ‌రీరంలో త‌గినంత నీరు ఉండేలా చేయ‌డంలో, న‌రాల వ్య‌వ‌స్థ స‌రిగ్గా ప‌ని చేసేలా చేయ‌డంలో, కండ‌రాల … Read more

Heart Health : యువ‌త‌లో పెరిగిపోతున్న గుండె స‌మ‌స్య‌లు.. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంటనే జాగ్ర‌త్త ప‌డాల్సిందే..!

Heart Health : గుండె జ‌బ్బుల స‌మ‌స్య‌లు ఒక‌ప్పుడు కేవ‌లం వ‌య‌స్సు మీద ప‌డిన వారికి మాత్ర‌మే వ‌చ్చేవి. కానీ ప్ర‌స్తుతం యువ‌త కూడా హార్ట్ ఎటాక్ ల బారిన ప‌డుతున్నారు. ఎక్కువ మంది కార్డియాక్ అరెస్ట్‌తో ప్ర‌మాదాల‌ను కొని తెచ్చుకుంటున్నారు. గుండెకు అనుసంధానం అయి ఉండే ర‌క్త నాళాల్లో ఏమైనా అడ్డంకులు ఉంటే హార్ట్ ఎటాక్ వ‌స్తుంది. అదే గుండె కండ‌రాల‌కు ఆక్సిజ‌న్‌, ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా జ‌ర‌గ‌క‌పోయినా.. వాటి స‌ర‌ఫ‌రా నిలిచిపోయినా.. కార్డియాక్ అరెస్ట్ … Read more

Heart Care : శీతాకాలంలో ఎక్కువగా గుండె జబ్బులు రావడానికి గల కారణం ఏమిటో తెలుసా?

Heart Care : సాధారణంగా కాలానికి అనుగుణంగా వాతావరణంలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలోనే శీతాకాలంలో  ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవడం చేత ఎంతో చల్లగా ఉంటుంది. దీంతో మన శరీర ఉష్ణోగ్రతలు కూడా  పడిపోతాయి. ఇలా మన శరీరం ఎక్కువ చల్లగా ఉండటం వల్ల అధికంగా గుండె జబ్బులకు కారణమవుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. శీతాకాలంలో శరీర ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గిపోతాయి. ఈ క్రమంలోనే దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు రావడంతో ఊపిరి తీసుకోవడానికి … Read more

చెవుల‌పై వెంట్రుక‌లు ఎక్కువ‌గా పెరుగుతున్నాయా ? అయితే గుండె జ‌బ్బులు వ‌స్తాయి.. సైంటిస్టుల అధ్య‌య‌నం..!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏటా కొన్ని కోట్ల మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. అందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అధికంగా బరువు ఉండ‌డం, హైబీపీ, డ‌యాబెటిస్ వంటి స‌మ‌స్యల కార‌ణంగా చాలా మందికి గుండె జ‌బ్బులు వ‌స్తున్నాయి. అయితే గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటే ఆ ల‌క్ష‌ణాల‌ను ముందుగానే క‌నిపెట్ట‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. అందుకు చెవుల‌పై పెరిగే వెంట్రుక‌ల‌ను వారు ఉదాహ‌ర‌ణ‌లుగా చెబుతున్నారు. పురుషుల్లో కొంద‌రికి టెస్టోస్టిరాన్ స్థాయిలు ఎక్కువ‌గా ఉంటాయి. దీంతో వారి చెవుల‌పై వెంట్రుక‌లు … Read more

రక్తనాళాల్లో చేరిన వ్యర్థాలను బయటకు పంపి గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. వీటిని తీసుకోవాలి..!

మన శరీరంలో అన్ని అవయవాల్లోకెల్లా గుండె అత్యంత ముఖ్యమైన అవయవం. అందువల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. రోజూ పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు వ్యాయామం చేస్తుండాలి. దీంతో గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా అడ్డుకోవచ్చు. అయితే కొందరికి రక్త నాళాల్లో ప్లేక్‌ (plaquе) పేరుకుపోతుంది. దీంతో బీపీ పెరుగుతుంది. రక్తనాళాలు వాపులకు గురవుతాయి. ఫలితంగా హార్ట్‌ ఎటాక్‌లు వస్తాయి. కనుక రక్త నాళాలను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఆ సమస్య ఉన్నవారు కింద తెలిపిన … Read more

హార్ట్ ఎటాక్ వ‌చ్చేందుకు నెల రోజుల ముందు ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసా ?

రోజూ మ‌నం పాటించే జీవ‌న విధానం, తీసుకునే ఆహారాలు.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల గుండె ఆరోగ్యం ప్ర‌భావిత‌మ‌వుతుంటుంది. స‌రైన అల‌వాట్లు పాటిస్తూ, నిత్యం వ్యాయామం చేయ‌డంతోపాటు పౌష్టికాహారం తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. లేదంటే హార్ట్ ఎటాక్ లు లేదా ఇత‌ర గుండె జ‌బ్బులు వ‌స్తాయి. అయితే హార్ట్ ఎటాక్ అనేది సైలెంట్ కిల్ల‌ర్‌. అది ఎప్పుడు ఎవ‌రికి ఎలా వ‌స్తుందో అస్స‌లు తెలియదు. కానీ హార్ట్ ఎటాక్ వ‌చ్చేందుకు నెల రోజుల ముందు మ‌న … Read more