షుగ‌ర్ ఉన్న‌వారు ఏయే ఆహారాల‌ను తినాలి.. వేటిని తిన‌కూడదు..!

డయాబెటిక్ రోగులకు ఏ రెండు భోజనాలకు మధ్య వ్యవధి అధికంగా వుండరాదు. వ్యవధి అధికంగా వుంటే రక్తంలో గ్లూకోజ్ స్ధాయి పడిపోతుంది. భోజనం తీసుకున్న వెంటనే బాగా పెరిగిపోతుంది. కనుక వారు తినే ఆహారాన్ని మూడు సార్లుగా అంటే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయాలలో తీసుకుంటూ ఉదయం 11 గం.లకు సాయంత్రం 5 గం.లకు లైట్ గా స్నాక్స్ వంటివి తీసుకోవాలి. ఇతరులవలెనే, డయాబెటిక్ రోగులకు కూడా అన్ని రకాల ఆహారాలు కావాలి. అయితే, వీరు త్వరగా … Read more

షుగ‌ర్ ఉన్న‌వారు ఇలా చేస్తే ఇన్సులిన్ స‌రిగ్గా వినియోగం అవుతుంది..!

ఒకసారి బరువు తగ్గించుకుంటే మరోమారు అది రాకుండా చూసుకోవడం చాలామందికి అసాధ్యంగానే వుంటుంది. కాని వివిధ రకాల ఆహారాలు, డైటింగ్ విధానాలు వ్యాయామాలు డయాబెటిక్ రోగుల ఆరోగ్యంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. వ్యాయామం చేస్తే అది రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ ను నియంత్రించి టైప్ 2 డయాబెటీస్ రాకుండా చేస్తుంది. గ్లైసిమిక్ నియంత్రణ మెరుగైన రీతిలో వుండేలా చేస్తుంది. ఇప్పటికే టైప్ 2 డయాబెటీస్ వున్నవారికి క్రమంతప్పకుండా రోజూ వ్యాయామాలు చేస్తే వారి శారీరక సామర్ధ్యం పెరిగి, … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఇలా చేస్తే హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవ‌చ్చు..!

డయాబెటీస్ రోగుల రక్తనాళాలు గట్టిపడతాయి. నాళాలలో గడ్డలు ఏర్పడతాయి. వీరి రక్తంలోని కొన్ని పదార్ధాలు విభిన్నంగా వుండి ఎల్లపుడూ గడ్డ కట్టేందుకు రెడీగా వుంటుంది. గుండెకు రక్తం చేరవేసే రక్తనాళాలలో గడ్డలు ఏర్పడితే, గుండెకు రక్తం అందక గుండెపోటు వచ్చే అవకాశం వుంది. కుటుంబం సభ్యులలో గుండె జబ్బు చరిత్ర వుంటే డయాబెటీస్ రోగులకు గుండె జబ్బు తప్పక వస్తుంది. అది కూడా కుటుంబ సభ్యులు పురుషులు 55 సంవత్సరాల లోపు, మహిళలు 65 సంవత్సరాల లోపు … Read more

మీ పిల్ల‌ల‌కు ఈ మిల్లెట్స్‌ను పెట్టండి.. వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు..

ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు తమ రోజువారీ ఆహారంలో మిల్లెట్స్ ని చేర్చుకుంటున్నారు. పెద్దవారు మిల్లెట్స్ తినడం ఆరోగ్యానికి మంచిదే. మరి చిన్న పిల్లలకి ఇవి పెట్టవచ్చా? పెడితే ఏమవుతుంది? ఇలాంటి సందేహాలు చాలామందికి ఉన్నాయి. అయితే పిల్లలు మిల్లెట్స్ తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల ఎదుగుదలకి పోషకాహారం చాలా ముఖ్యం. ఎంత మంచి ఫుడ్ ఇస్తే వారి ఎదుగుదల అంత బావుంటుంది. మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజాలతో ఉండే ఫుడ్స్ పిల్లలకి శక్తిని … Read more

మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినండి..!

పచ్చి పల్లీలు ఆరోగ్యానికి చాలా మేలు చూస్తాయి. చాలా మంది పల్లీలను వంటల్లో వాడుతూ ఉంటారు. అలానే నానబెట్టుకుని తింటూ ఉంటారు.పచ్చి పల్లిల్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ మొదలైనవి. అలానే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తాయి. పచ్చిపల్లిలలో ఉండే మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి చెడు కొలెస్ట్రాల్ ని … Read more

నిద్ర లేచిన‌ వెంట‌నే త‌ల‌నొప్పిగా ఉంటుందా.. అయితే ఇలా చేయండి..

వారాంతపు సెలవులు వస్తే, సాధారణంగా అధిక సమయం నిద్రిస్తూంటారు. మరి ఇంతసేపు నిద్రిస్తే ఎంతో హుషార్ గా చురుకుగా వుండాలి. కానీ కొంతమంది అధిక సమయం నిద్రిస్తే పూర్తిగా సోమరిగా, చురుకుదనం లేకుండా తలనొప్పిగా వుందని చెపుతూంటారు. నిద్ర చాల లేదని, మరింత విశ్రాంతి కావాలని కోరతారు. అయితే, నమ్మశక్యం కాని విషయం ఏమంటే, అధిక సమయం నిద్రించటమనేది చెడు కలిగిస్తుంది. నిద్రతో వచ్చే తలనొప్పులు గృహిణులకు, ఉద్యోగస్తులకు, విద్యార్ధులకు సాధారణంగా వుంటాయి. ఈ తలనొప్పి కొద్దిపాటి … Read more

బ‌ల‌మైన కండ‌లు కావాలంటే ఈ ఆహారాల‌ను తినండి

బలమైన కండరాలు శరీరం ఫిట్ గాను ఆరోగ్యంగాను వున్నట్లు చెపుతాయి. మరి కండలు తిరిగిన శరీరం త్వరగా కావాలంటే ఏ రకమైన ఆహారాలు తీసుకోవాలనేది పరిశీలించండి. ప్రొటీన్లు అధికంగా వుండే పాల వంటి ద్రవాహారాలే కాక, ఎమినో యాసిడ్లు వుండే ప్రొటీన్ ఆహారాలు శరీరాన్ని పెంచి ఆరోగ్యంగా వుండేలా చేస్తాయి. లీన్ బీన్స్, ఆల్మండ్స్, బచ్చలి, తోటకూరవంటి ఆకు కూరలు, చేప, లీన్ మీట్, పీతలు ఇతర ప్రొటీన్లు వుండే ధాన్యం గింజలు తినాలి. ఆహారంలో విటమిన్లు, … Read more

ప‌చ్చ క‌ర్పూరం వ‌ల్ల ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

మన పూర్వీకులు ఏ ఆచారాన్ని మొదలుపెట్టినా దాని వెనుక ఓ శాస్త్రీయ రహస్యం కచ్చితంగా ఉంటుంది. పూర్వం పూజ గదిలో తప్పకుండా పచ్చ కర్పూరాన్ని ఉంచేవారట. అలా చేయడం వలన లక్ష్మీ కటాక్షంతో పాటు ఆరోగ్యం కూడా వృద్ధి చెందుతుందని వారి విశ్వాసం. అయితే కర్పూరం లో మూడు రకాలు ఉన్నాయి. హారతి కర్పూరం, పచ్చ కర్పూరం, ముద్ద కర్పూరం. ఇప్పుడు మనం ఈ మూడింటి మధ్య వ్యత్యాసం, పచ్చ కర్పూరం విశిష్టత గురించి తెలుసుకుందాం. పచ్చకర్పూరాన్ని … Read more

కేవలం పండ్లు లేదా వెజిట‌బుల్ జ్యూస్‌ల‌ను తాగితే క‌లిగే లాభాలు ఇవే..!

డైటింగ్ చేసేవారు చాలామంది కొద్ది వారాలపాటు జ్యూస్ తీసుకుంటూ తమ అధిక బరువు తగ్గించుకుంటారు. పోషకాహార నిపుణుల మేరకు ప్రధాన పోషకాలు కల పండ్ల రసాలు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యమే. మరి సమర్ధవంతంగా బరువు తగ్గాలంటే సరైన రీతిలో పండ్లరసాలు ఎలా తాగాలో చూడండి. పండ్ల రసాల వలన ప్రయోజనాలు అనేకం. సాధారణంగా సెలిబ్రిటీలు, మోడల్స్, సైజ్ జీరో అవ్వాలనుకునేవారంతా పండ్లు, కూరల రసాలు ఆహారం బదులుగా 4 లేదా 5 వారాలపాటు తాగి బరువు తగ్గించేసుకుంటారు. … Read more

డైటింగ్ చేసే వారు కామ‌న్‌గా చేసే మిస్టేక్స్ ఇవే… ఆ మిస్టేక్స్ ఏమిటో తెలుసుకోండి..!

నేటి త‌రుణంలో అధికంగా బ‌రువు ఉన్న వారు త‌మ శ‌రీర బ‌రువును త‌గ్గించుకునేందుకు త‌ప‌న ప‌డుతుంటే స‌రైన బ‌రువు ఉన్న‌వారు దాన్ని నియంత్రించుకోవ‌డం కోసం శ్ర‌మిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఎక్స‌ర్‌సైజ్‌లు, యోగాలు చేయ‌డం, కొవ్వులు త‌క్కువ‌గా, ప్రోటీన్లు, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉన్న ఆహారం తీసుకోవ‌డంపై శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్నారు. ఇంకొంద‌రైతే ఏకంగా తిండి మానేసి దానికి డైటింగ్ అని పేరు పెట్టి బ‌రువు త‌గ్గేందుకు క‌ష్టాలు ప‌డుతున్నారు. అయితే డైటింగ్ అంటే తిండి పూర్తిగా మానేయ‌డం కాదు, తిండిని … Read more