ప్రయాణాల్లో ప్రాణానికే ప్రమాదం అనిపించిన పరిస్థితులను ఎదుర్కొన్నారా? దానిలోంచి ఎలా బయటపడ్డారు?
నాకు శ్రీశైలంలో జరిగింది. అసలు ప్రయాణం ఎలా మొదలైంది? మా బాబు పుట్టిన ఐదు నెలలకు, హైదరాబాద్ తీసుకు వచ్చారు. మా అత్తగారు ప్రసవం సాఫీగా సాగితే శ్రీశైలంతో పాటు తిరుపతి, షిరిడి వస్తానని మొక్కుకున్నారు. హైదరాబాద్ వచ్చినా ఊరిలో వ్యవసాయ పనుల నిమిత్తం వారు ఇక్కడ ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి లేదు. నేను కూడా సినిమాలలో వినటమే కానీ, శ్రీశైలం, నల్లమల్ల అడవి చూసింది లేదు. అప్పటికే దేశంలో కోవిడ్ మొదటి కేసు వచ్చి…