జ‌న‌వ‌రి 31వ తేదీ వ‌ర‌కు దేశంలో కోవిడ్ ఆంక్ష‌ల పొడిగింపు.. కేంద్ర హోం శాఖ ఉత్త‌ర్వులు..

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో కేంద్రం కోవిడ్ ఆంక్ష‌ల‌ను జ‌న‌వ‌రి 31వ తేదీ వ‌ర‌కు పొడిగించింది. ఈ మేర‌కు కేంద్ర హోం మంత్రిత్వ‌శాఖ సోమ‌వారం ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న నిబంధ‌న‌లే జ‌న‌వ‌రి 31వ తేదీ వ‌ర‌కు అమ‌లులో ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది. ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య త‌క్కువ‌గానే ఉన్న‌ప్ప‌టికీ యూకే ద్వారా కొత్త క‌రోనా స్ట్రెయిన్ వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో కోవిడ్ ఆంక్ష‌ల అమ‌లును పొడిగిస్తున్న‌ట్లు తెలిపింది. దీంతో జ‌న‌వ‌రి 31వ … Read more

కొత్త క‌రోనా స్ట్రెయిన్‌తో 2021లో ఎక్కువ మ‌ర‌ణాలు సంభ‌వించే అవ‌కాశం: నిపుణులు

క‌రోనా ప్ర‌భావం ఇప్పుడిప్పుడే త‌గ్గుతుంద‌నుకుంటే ఆ మ‌హమ్మారి రూపం మార్చుకుని మ‌ళ్లీ వ‌చ్చి విజృంభిస్తోంది. మొద‌ట‌గా యూకేలో కొత్త క‌రోనా స్ట్రెయిన్ కేసులు బ‌య‌ట ప‌డ‌గా ఆ ప్ర‌భుత్వం అల‌ర్ట్ అయింది. ఈ క్ర‌మంలోనే అక్క‌డ మ‌ళ్లీ గ‌తంలో మాదిరిగా కోవిడ్ ఆంక్ష‌ల‌ను విధించారు. ఇక ఇత‌ర దేశాలు కూడా యూకేకు ప్ర‌యాణాన్ని నిషేధించాయి. భార‌త్ కూడా విమానాల‌ను నిషేధించింది. అయితే ఇప్ప‌టికే యూకే నుంచి ప‌లువురు భార‌తీయులు స్వదేశానికి రావ‌డంతో ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు అలాంటి … Read more

మ‌హిళ‌లు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 పోష‌కాల‌ను రోజూ తీసుకోవాలి..!

మ‌హిళ‌లు త‌మ జీవితంలో అనేక ద‌శ‌ల్లో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటుంటారు. టీనేజ్‌లో, యుక్త వ‌య‌స్సులో, పెళ్లి అయ్యి త‌ల్లి అయ్యాక‌, త‌రువాతి కాలంలో, మెనోపాజ్ ద‌శ‌లో అనేక స‌మస్య‌ల‌ను వారు అనుభ‌విస్తుంటారు. ఒక్కో ద‌శలో అనారోగ్య స‌మ‌స్య‌లు వారిని వేధిస్తుంటాయి. అయితే ఏ ద‌శ‌లో అయినా స‌రే అనారోగ్య స‌మ‌స్య‌లు ఇబ్బందుల‌కు గురి చేయ‌కుండా ఉండాల‌న్నా.. ఆరోగ్యంగా ఉండాల‌న్నా.. అందుకు స‌మ‌తుల ఆహారాన్ని నిత్యం తీసుకోవాలి. అందులో త‌గిన పోష‌కాలు కూడా ఉండాలి. మ‌హిళ‌లు ఆరోగ్యంగా … Read more

తిప్ప‌తీగ క‌షాయంతో ఎన్నో లాభాలు.. ఇలా త‌యారు చేయాలి..!

తిప్ప‌తీగ‌ను ఆయుర్వేదంలో ఎంతో పురాత‌న కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. దీన్ని ప‌లు ఆయుర్వేద ఔషధాల‌ను త‌యారు చేసేందుకు వాడుతారు. తిప్ప‌తీగ వల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే తిప్ప‌తీగ‌ను ఎలా తీసుకోవాలో చాలా మందికి తెలియ‌దు. దీన్ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. తిప్ప‌తీగ‌ను క‌షాయంలా చేసి తీసుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే… తిప్ప‌తీగ‌తో క‌షాయం చేయ‌ద‌లిస్తే అందుకు తిప్ప‌తీగ‌కు చెందిన 6 ఇంచుల కాండం ఉప‌యోగిస్తే చాలు. ఇది పెద్ద‌ల‌కు క‌లిగే వ్యాధుల‌ను నయం … Read more

తిప్ప‌తీగ‌తో క‌లిగే 7 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

ఆయుర్వేదంలో ఎంతో పురాత‌న కాలం నుంచి తిప్ప‌తీగ‌ను ప‌లు ఔష‌ధాల త‌యారీలో ఉప‌యోగిస్తున్నారు. దీన్నే సంస్కృతంలో అమృత అని పిలుస్తారు. నిజంగా ఈ మొక్క మ‌న‌కు అమృతంలాగే ప‌నిచేస్తుంది. దీంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి. తిప్పతీగ‌లో అనేక అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉన్నాయి. అవి మ‌న‌కు క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డ‌మే కాదు, మ‌న‌కు ఆరోగ్యాన్ని అంద‌జేస్తాయి. ఈ క్ర‌మంలోనే తిప్ప‌తీగ వ‌ల్ల క‌లిగే ప్రయోజ‌నాల‌ను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. రోగ నిరోధ‌క శ‌క్తి … Read more

జాజికాయ‌ల‌తో కలిగే 8 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

జాజికాయ మ‌సాలా దినుసుల జాబితాకు చెందుతుంది. దీన్ని భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి త‌మ వంట ఇళ్ల‌లో ఉప‌యోగిస్తున్నారు. వీటిని పొడిగా చేసి వంట‌ల్లో వేస్తుంటారు. దీంతో వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే జాజికాయ‌ల వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వాటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. 1. జాజికాయ‌ల్లో శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మ‌న శ‌రీర క‌ణ‌జాలాన్ని నాశ‌నం చేసే ఫ్రీ ర్యాడిక‌ల్స్ ను నిర్మూలిస్తాయి. క్యాన్స‌ర్లు, … Read more

జామ ఆకుల‌తో కలిగే 7 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

మ‌న‌కు సీజ‌న‌ల్‌గా ల‌భించే అనేక ర‌కాల పండ్ల‌లో జామ పండ్లు కూడా ఒక‌టి. కొంద‌రు వీటిని ప‌చ్చిగా ఉండ‌గానే తింటారు. అయితే ఇవి సాధార‌ణంగా మ‌న‌కు చాలా త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తాయి. అందుక‌నే దీన్ని పేద‌వాడి ఆపిల్ అని పిలుస్తారు. ఇక జామ‌కాయ‌ల వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే వాటితోపాటు జామ ఆకులు కూడా మ‌న‌కు అనేక లాభాల‌ను అందిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జామ పండ్లే కాదు, జామ ఆకులు … Read more

టీ, కాఫీలు తాగేముందు క‌చ్చితంగా నీరు తాగాలి.. ఎందుకంటే..?

మ‌న‌లో అధిక‌శాతం మంది టీ లేదా కాఫీ తాగేముందు ఒక గ్లాస్ నీటిని తాగుతుంటారు. అయితే కొంద‌రు నిజానికి ఈ విధంగా ఎందుకు చేస్తారో తెలియ‌దు. ఇత‌రులు పాటిస్తున్న అల‌వాటును చూసి ఎవ‌రైనా అల‌వాటు చేసుకుంటారు. అస‌లు టీ, కాఫీ తాగేముందు నీటిని ఎందుకు తాగుతున్నారో తెలియ‌కుండానే ఆ ప‌ని చేస్తున్నారు. కానీ నిజానికి అలా చేయ‌డం మంచిదే. సైంటిస్టులు ఇందుకు ప‌లు కార‌ణాల‌ను కూడా చెబుతున్నారు. అవేమిటంటే… * టీ, కాఫీలు ఆమ్ల (యాసిడ్‌) స్వ‌భావాన్ని … Read more

అర‌టి పండు తొక్క‌ల‌తో క‌లిగే 15 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

సాధార‌ణంగా మ‌న‌లో అధిక శాతం మంది అర‌టి పండ్ల‌ను తిని తొక్క పారేస్తుంటారు. నిజానికి అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నకు ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో.. వాటి తొక్క‌ల‌ను తిన‌డం వ‌ల్ల కూడా అన్నే ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అర‌టి పండు తొక్క‌ల‌ను ఎవ‌రైనా తింటారా..? అని మీరు ఆశ్చ‌ర్య‌పోవ‌చ్చు. అయినా ఇది నిజ‌మే. ఎందుకంటే.. అర‌టి పండు తొక్క‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు లాభాలు క‌లుగుతాయని సాక్షాత్తూ సైంటిస్టులే చెబుతున్నారు. అందువల్ల ఈ సారి మీరు అర‌టి … Read more

మ‌సాలా చాయ్‌.. రోజూ తాగితే ఏ వ్యాధీ రాదు..!

మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకుంటానికి, ఇన్‌ఫెక్ష‌న్లు, శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు రాకుండా ఉండ‌డానికి ఆయుర్వేదం అనేక ర‌కాల స‌హ‌జ‌సిద్ధ‌మైన ఔష‌ధాల‌ను సూచిస్తోంది. అందులో మ‌సాలా చాయ్ కూడా ఒక‌టి. ల‌వంగాలు, యాల‌కులు, దాల్చిన‌చెక్క‌, న‌ల్ల మిరియాలు, పసుపు, అనాస పువ్వు, తుల‌సి, తేనె త‌దిత‌ర ప‌దార్థాల‌తో త‌యారు చేసుకునే మ‌సాలా టీని వేడి వేడిగా తాగితే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి గ‌ణ‌నీయంగా పెరుగుతుంది. దీంతో వ్యాధులు రాకుండా ఉంటాయి. మ‌రి ఆ మ‌సాలా టీ … Read more