రోజూ ఉద‌యాన్నే నిమ్మ‌ర‌సం తాగితే.. అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

చాలా మంది నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే కాఫీ, టీ వంటివి తాగుతుంటారు. కానీ నిజానికి వాటికి బ‌దులుగా నిమ్మ‌ర‌సం తాగాలి. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మ‌ర‌సం క‌లుపుకుని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగాలి. దీని వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. విట‌మిన్ సి… నిమ్మకాయ‌ల్లో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్‌లా ప‌నిచేస్తుంది క‌నుక శ‌రీర క‌ణజాలాన్ని … Read more

ద‌గ్గు స‌మ‌స్య బాధిస్తుందా ? వీటిని తీసుకోండి..!

ద‌గ్గు అనేది స‌హ‌జంగా ఎవ‌రికైనా వ‌స్తూనే ఉంటుంది. సీజ‌న్లు మారిన‌ప్పుడు చేసే జ‌లుబుతోపాటు ద‌గ్గు వ‌స్తుంది. ఇక కొంద‌రికి అల‌ర్జీలు, బాక్టీరియా, వైర‌ల్ ఇన్‌ఫెక్ష‌న్ల వ‌ల్ల కూడా ద‌గ్గు వస్తుంటుంది. అయితే ద‌గ్గుకు ఇంగ్లిష్ మెడిసిన్ ను వాడాల్సిన ప‌నిలేదు. మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే ద‌గ్గును త‌గ్గించుకోవ‌చ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. తేనె… ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో 2 టీస్పూన్ల‌ తేనె, 1 టీస్పూన్‌ నిమ్మ‌ర‌సం వేసి బాగా క‌లిపి … Read more

గోధుమ గ‌డ్డి జ్యూస్‌తో క‌లిగే అద్భుత‌మైన‌ ప్ర‌యోజ‌నాలు..!

గోధుమ‌గ‌డ్డిని మ‌నం ఇండ్ల‌లోనే పెంచుకోవ‌చ్చు. గోధుమ‌ల‌ను మొల‌కెత్తించి అనంత‌రం వాటిని నాటితే గోధుమ‌గ‌డ్డి కొద్ది రోజుల్లోనే పెరుగుతుంది. కొద్దిగా పెర‌గ‌గానే లేత‌గా ఉండగానే ఆ గ‌డ్డిని సేక‌రించి దాన్ని జ్యూస్‌లా చేసుకుని నిత్యం తాగాల్సి ఉంటుంది. అయితే గోధ‌మ‌గ‌డ్డిని పెంచ‌లేని వారికి గోధుమ గ‌డ్డి జ్యూస్ ల‌భిస్తుంది. దీంతోపాటు ట్యాబ్లెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటిలో దేన్నయినా ఉప‌యోగించ‌వ‌చ్చు. దీంతో మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. సూప‌ర్ ఫుడ్‌… గోధుమ‌గ‌డ్డిని సూప‌ర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఎందుకంటే … Read more

అద్భుత గుణాల తుల‌సి.. వాడితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు..!

భార‌త‌దేశంలోనే కాదు, ఇత‌ర దేశాల్లో ఉండే హిందువులు కూడా తులసి మొక్క‌ల‌ను త‌మ ఇళ్ల‌లో పెంచుకుంటుంటారు. కొంద‌రు పూజ‌లు చేయ‌కున్నా తుల‌సి మొక్క‌ల‌ను కావాల‌ని చెప్పి పెంచుకుంటుంటారు. ఈ మొక్క ఆకుల వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. తుల‌సి మొక్క‌కు చెందిన అన్ని భాగాలు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఆ మొక్క భాగాల‌ను ప‌లు ఆయుర్వేద మందుల‌ను త‌యారు చేయ‌డంలో వాడుతారు. అయితే తుల‌సి ఆకుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. పోష‌కాలు… … Read more

గ్యాస్ స‌మ‌స్య‌కు ఆయుర్వేద చిట్కాలు..!

గ్యాస్ స‌మ‌స్య స‌హ‌జంగానే చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తుంటుంది. జీర్ణాశ‌యంలో అధికంగా గ్యాస్ చేర‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య వ‌స్తుంది. అయితే ఎప్పుడో ఒక‌సారి గ్యాస్ స‌మ‌స్య వ‌స్తే ఆయుర్వేద చిట్కాల‌ను ఉప‌యోగించి ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. కానీ ప‌దే ప‌దే గ్యాస్ స‌మ‌స్య వ‌స్తుంటే వైద్యున్ని సంప్ర‌దించి అందుకు అనుగుణంగా ప‌రీక్ష‌లు చేయించుకుని చికిత్స తీసుకోవాలి. ఇక సాధార‌ణ గ్యాస్ స‌మ‌స్య‌కు కింద తెలిపిన ఆయుర్వేద చిట్కాల‌ను పాటిస్తే చాలు. దాంతో … Read more

అజీర్ణం స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేసే అద్భుత‌మైన చిట్కాలు..!

చ‌లికాలంలో స‌హ‌జంగానే మ‌న‌కు తిన్న ఆహారం జీర్ణ‌మ‌వ‌డంలో ఇబ్బందులు త‌లెత్తుతుంటాయి. కొంద‌రికి ఆహారం నెమ్మ‌దిగా జీర్ణ‌మ‌వుతుంటుంది. ఇక కొంద‌రికైతే అస‌లు జీర్ణం కాదు. జీర్ణ స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. అలాంటి వారు ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన ప‌నిలేదు. మన ఇండ్ల‌లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే అజీర్ణం స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. వాటిని తీసుకుంటే జీర్ణ ప్ర‌క్రియ సాఫీగా జ‌రుగుతుంది. ఇత‌ర జీర్ణ స‌మ‌స్య‌లు కూడా పోతాయి. మ‌రి అజీర్ణాన్ని త‌గ్గించే ఆ చిట్కాలు ఏమిటంటే… అల్లం, ఉప్పు, నిమ్మ‌ర‌సం… … Read more

ఈ చిట్కాలతో 100ల మంది కీళ్ల నొప్పులను తగ్గించుకున్నారు..!!

ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య ఉన్న‌వారికి స‌హ‌జంగానే ఎప్ప‌టికప్పుడు నొప్పులు వ‌స్తుంటాయి. చ‌లికాలంలో ఈ స‌మ‌స్య మ‌రింత తీవ్రంగా ఉంటుంది. దీంతో వారు నొప్పితో బాధ‌కు విల‌విలలాడుతుంటారు. ఆర్థ‌రైటిస్‌లో నిజానికి ప‌లు ర‌కాలు ఉన్న‌ప్ప‌టికీ కొన్నింటిలో కీళ్ల నొప్పులు చాలా తీవ్రంగా ఉంటాయి. అయితే కింద తెలిపిన ప‌లు చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. అలొవెరా (క‌ల‌బంద‌) ను అనేక ఆయ‌ర్వేద ఔష‌ధాల త‌యారీలో … Read more

క్వినోవా లేదా బ్రౌన్ రైస్‌.. అధిక బ‌రువు త‌గ్గేందుకు రెండింటిలో ఏది మంచిదంటే..?

ప్ర‌స్తుతం అనే మందిలో ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ పెరిగింది. అందులో భాగంగానే వారు త‌మ ఆరోగ్యాన్ని ప‌దిలంగా ఉంచుకోవ‌డం కోసం బ్రౌన్ రైస్‌, క్వినోవా వంటి ఆహారాల‌ను తీసుకుంటున్నారు. అధిక బ‌రువు త‌గ్గేందుకు కూడా కొంద‌రు వీటిని ఆప్ష‌న్లుగా ఎంచుకుంటున్నారు. అయితే క్వినోవా లేదా బ్రౌన్ రైస్‌.. అధిక బ‌రువు త‌గ్గేందుకు రెండింటిలో ఏది స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తుంది ? దేన్ని తీసుకోవాలి ? అంటే… క్వినోవాలో మ‌న శ‌రీరానికి అవ‌సరం అయ్యే అనేక పోష‌కాలు ఉంటాయి. ఒక … Read more

క్రాన్ బెర్రీలను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుతమైన ప్ర‌యోజ‌నాలు..!

క్రాన్ బెర్రీలు ఉత్త‌ర అమెరికాలో ఎక్కువ‌గా పండుతాయి. అక్క‌డి అనేక ప్రాంతాల్లో క్రాన్ బెర్రీల‌ను పండిస్తారు. అందువ‌ల్ల ఈ పండ్లు అక్క‌డి నేటివ్ ఫ్రూట్స్‌గా మారాయి. వీటిని సూప‌ర్‌ఫుడ్‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. ఇవి పుల్ల‌గా ఉంటాయి. అందువ‌ల్ల వీటిని చాలా మంది జ్యూస్ లేదా ఇత‌ర ప‌దార్థాల‌తో కలిపి తీసుకుంటారు. వీటితో సాస్‌, పొడి, స‌ప్లిమెంట్లు త‌యారు చేసి తీసుకుంటారు. ఇక డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ ఇవి మ‌న‌కు ల‌భిస్తాయి. అయితే క్రాన్ బెర్రీలలో అద్భుత‌మైన పోష‌కాలు ఉంటాయి. … Read more

నీటిని తాగ‌డం వ‌ల్ల కూడా అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

శ‌రీరాన్ని ఎల్ల‌ప్పుడూ మనం హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. అంటే ఎప్పుడూ శ‌రీరంలో త‌గినంత నీరు ఉండేలా చూసుకోవాల‌న్న‌మాట‌. దీంతో ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. నిత్యం త‌గినంత నీటిని తాగ‌డం వ‌ల్ల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఏ సీజ‌న్ అయినా, ఎక్క‌డ ఉన్నా, ఎప్పుడు అయినా స‌రే.. రోజులో తాగాల్సిన నీటి కోటాను క‌చ్చితంగా పూర్తి చేయాలి. దీంతో శ‌రీరంలో నీరు త‌గినంత ఉంటుంది. అయితే నీటిని నిత్యం త‌గిన మోతాదులో తాగడం వ‌ల్ల కూడా అధిక బ‌రువు తగ్గ‌వ‌చ్చు. అవును.. … Read more