హైబీపీ ఉంద‌ని తెలిపే ప‌లు ల‌క్ష‌ణాలు ఇవే..!

ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మందిని ఇబ్బందుల‌కు గురిచేస్తున్న స‌మ‌స్య‌ల్లో.. హైబీపీ కూడా ఒక‌టి. ఇది వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ర‌క్త‌నాళాల గోడ‌ల‌పై ర‌క్తం తీవ్ర‌మైన ఒత్తిడిని క‌లిగిస్తుంటుంది. దీన్నే హైబీపీ అంటారు. అయితే ర‌క్త‌పోటును నిర్ల‌క్ష్యం చేస్తే.. గుండె జ‌బ్బులు, స్ట్రోక్స్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. కానీ ఆరంభంలోనే ర‌క్త‌పోటు వ‌చ్చింద‌ని తెలిపే ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వాటిని గుర్తించి అందుకు త‌గిన విధంగా చికిత్స తీసుకుంటే.. ర‌క్త‌పోటు స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. … Read more

మ‌ల్బ‌రీ పండ్ల‌తో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు..!

ప‌ట్టు పురుగుల‌ను పెంచేందుకు మ‌ల్బ‌రీ ఆకుల‌ను ఎక్కువ‌గా వాడుతార‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ఆ మొక్క‌ల‌కు పండ్లు కూడా కాస్తాయి. వాటిని మ‌ల్బ‌రీ పండ్ల‌ని పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కొంద‌రు వాటిని బొంత పండ్లు అని వ్య‌వ‌హ‌రిస్తారు. అయితే వాటిని మ‌నం తిన‌వ‌చ్చు. ఇత‌ర బెర్రీ పండ్ల‌లాగే అవి కూడా మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * మ‌ల్బ‌రీ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు … Read more

సంతాన లోప స‌మ‌స్య.. ఎండోమెట్రియోసిస్‌కు.. ఇలా చెక్ పెట్ట‌వ‌చ్చు..!

మ‌హిళ‌ల‌కు స‌హ‌జంగానే సంతానం కావాల‌నే ఆశ ఎక్కువ‌గా ఉంటుంది. అయితే ప‌లు కార‌ణాల వ‌ల్ల కొంద‌రు సంతానం పొంద‌లేక‌పోతుంటారు. ఆ కార‌ణాల్లో ఎండోమెట్రియోసిస్ కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య ఉన్న‌వారిలో గ‌ర్భాశ‌యానికి బ‌య‌టి ప‌క్క ఓ విధ‌మైన క‌ణ‌జాలం పెరుగుతుంది. దీంతో తీవ్ర‌మైన క‌డుపు నొప్పి, రుతు స‌మ‌స్య‌లు వ‌స్తాయి. రుతు క్ర‌మం స‌రిగ్గా ఉండ‌దు. దీంతో కొన్నిసార్లు అండాలు పక్వ‌ద‌శ‌కు రాకండానే దెబ్బ తింటాయి. ఈ క్ర‌మంలో సంతానం క‌ల‌గ‌దు. అయితే ఈ ఎండోమెట్రియోసిస్ స‌మ‌స్య … Read more

డైటింగ్ పాటించేవారు, బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు.. చేసే పొర‌పాట్లు ఇవే..!

అధిక బ‌రువు అనేది ప్ర‌స్తుతం చాలా మందికి కామ‌న్ స‌మ‌స్య అయింది. అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు అనేక మంది అనేక ర‌కాల ప‌ద్ధ‌తులు పాటిస్తున్నారు. ఇక చాలా మంది బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని, బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంద‌ని చెప్పి.. డైట్ పాటిస్తుంటారు. అయితే అంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. వారు డైట్ పేరిట కొన్ని చిన్న‌పాటి త‌ప్పులు చేస్తుంటారు. వాటిని చేయ‌కుండా ఉంటే.. అధిక బ‌రువును త్వ‌ర‌గా త‌గ్గించుకోవ‌డంతోపాటు.. ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. మ‌రి డైటింగ్ … Read more

జీల‌కర్ర‌తో సింపుల్‌గా ఇలా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు..!

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలంగా జీల‌క‌ర్ర‌ను వాడుతున్నారు. వారి వంట ఇంటి పోపు దినుసుల్లో జీల‌క‌ర్ర ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీంతో మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజనాలు క‌లుగుతాయి. ముఖ్యంగా జీల‌క‌ర్ర‌ను నిత్యం కింద తెలిపిన విధంగా తీసుకుంటే.. అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతుంది. శ‌రీరంలో ఉండే కొవ్వు క‌రుగుతుంది. మ‌రి అందుకు ఏం చేయాలంటే… * ఒక‌ గ్లాస్ నీటిని పాత్ర‌లో తీసుకుని అందులో టీస్పూన్ జీల‌క‌ర్రను వేయాలి. ఆ నీటిని బాగా మ‌రిగించి చ‌ల్లార్చాలి. … Read more

విరేచ‌నాలు అవుతున్నాయా..? ఈ చిట్కాలు పాటించండి..

కారం, మ‌సాలాలు ఎక్కువ‌గా ఉన్న ఆహారాల‌ను తిన‌డం.. క‌లుషిత ఆహారం, నీరు తీసుకోవ‌డం.. ఆహార ప‌దార్థాలు ప‌డ‌క‌పోవ‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల మ‌న‌లో చాలా మందికి అప్పుడ‌ప్పుడు విరేచ‌నాలు వ‌స్తుంటాయి. అయితే వాటికి మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే చెక్ పెట్ట‌వ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. * నీళ్ల విరేచ‌నాలు ఏర్ప‌డిన‌ప్పుడు గ‌డ్డ పెరుగు తినాలి. రోజులో క‌నీసం 2 నుంచి 3 క‌ప్పుల పెరుగు తింటే నీళ్ల విరేచ‌నాలు త్వ‌ర‌గా … Read more

స‌ర‌స్వ‌తి మొక్క ఆకు.. ప్ర‌యోజ‌నాలు మెండు..

భూమిపై ఉన్న అనేక వృక్ష‌జాతుల్లో స‌ర‌స్వ‌తి మొక్క కూడా ఒక‌టి. ఆయుర్వేద వైద్యంలో దీన్ని ఎక్కువ‌గా వాడుతారు. ఈ మొక్క ఆకులను ప‌లు ఆయుర్వేద మందుల త‌యారీలో ఉప‌యోగిస్తారు. దీన్ని ఇంట్లో కూడా మ‌నం పెంచుకోవ‌చ్చు. ఈ మొక్క వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. * స‌ర‌స్వ‌తి మొక్క పేరుకు త‌గిన‌ట్లుగానే ప‌నిచేస్తుంది. ఈ మొక్క ఆకులు మెద‌డు ప‌నితీరును మెరుగు ప‌రుస్తాయి. జ్ఞాప‌క‌శక్తిని పెంచుతాయి. నిత్యం 4 స‌రస్వ‌తి ఆకులను అలాగే … Read more

పైల్స్ స‌మ‌స్య‌ను తగ్గించే.. స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..

పైల్స్ స‌మ‌స్య ఉన్న‌వారి బాధ మాట‌ల్లో చెప్ప‌లేం. వారు ఆ స‌మ‌స్య‌తో న‌ర‌క యాత‌న అనుభ‌విస్తారు. అయితే ఈ స‌మ‌స్య వ‌చ్చేందుకు ఎన్నో కార‌ణాలుంటాయి. అయిన‌ప్ప‌టికీ కింద తెలిపిన ప‌లు స‌హ‌జ సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటిస్తే.. దాంతో పైల్స్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! * ఒక పాత్ర‌లో కొద్దిగా నీటిని తీసుకుని అందులో కొన్ని బిర్యానీ ఆకులు (బే లీవ్స్‌), 3 వెల్లుల్లి రెబ్బ‌‌లు వేయాలి. అనంత‌రం … Read more

నోరు బాగా దుర్వాస‌న వ‌స్తుందా.. ఇలా చేయండి..!

నోటి దుర్వాసన సమస్య చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. దంత సమస్యలు ఉన్నా, లేకున్నా.. నోటి దుర్వాసన  ఉంటే నలుగురిలోనూ మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. అయితే ఇందుకు విచారించాల్సిన పనిలేదు. కింద తెలిపిన పలు చిట్కాలను పాటిస్తే నోటి దుర్వాసన సమస్య నుంచి బయట పడవచ్చు. ఈ క్రమంలో నోట్లో ఉండే బాక్టీరియా కూడా నాశనం అవుతుంది. మరి ఆ చిట్కాలు ఏమింటే… * పెరుగులో స‌మృద్ధిగా ఉండే ప్రొబ‌యోటిక్స్ నోట్లో ఉండే బాక్టీరియాను … Read more

కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలివే.. వీటిని తరచూ తీసుకోవాలి..!

మన శరీరంలోని ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం అవసరమనే విషయం అందరికీ తెలిసిందే. కాల్షియం వల్ల నిజానికి ఎముకలకే కాదు.. నాడీ వ్యవస్థకు, కండరాలకు కూడా ఎంతో మేలు కలుగుతుంది. అందువల్ల నిత్యం కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. దీంతో ఆయా ప్రయోజనాలు పొందవచ్చు. * కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్లో మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పాలు. పాలు సులభంగా జీర్ణం అవుతాయి. దాంట్లో ఉండే పోషకాలను మన శరీరం సులభంగా గ్రహిస్తుంది. … Read more