రాజకీయ నాయకులు తరచూ దర్శించే ఆలయం ఇది.. ఒక్కసారి దర్శిస్తే అపజయం అన్నది ఉండదు..
దేశంలో ఒక్కో దేవాలయం ఒక్కో కోరికను తీరుస్తుంది. అంతేకాదు ఆయా దేవాలయాల్లో దేవతారాధనతో రాజకీయాల్లో సైతం ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. మరికొన్ని చోట్లకు వెళితే పదవీచ్యుతులు అవుతారని కూడా నమ్మకం. అలాంటి విశేషం కలిగిన ఓ దేవాలయం గురించి తెలుసుకుందాం… తమిళనాట విల్లుపురం జిల్లా. ఆ జిల్లాలో తిరువక్కరై అనే చిన్న గ్రామం. కానీ ఆ ఊరిలో ఉన్న చంద్రమౌళీశ్వరుని ఆలయం చాలా ప్రసిద్ధమైంది. తరువక్కురైలో వరాహ నదీతీరాన వెలసిన చంద్రమౌళీశ్వరుడు గురించి రెండువేల సంవత్సరాల నుంచే…