రోజూ 15 నిమిషాల పాటు స్కిప్పింగ్ చేస్తే చాలు.. ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

ఆరోగ్యంగా, దృఢంగా ఉండేందుకు ప్ర‌జ‌లు ర‌క ర‌కాల మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. కొంద‌రు జిమ్‌ల‌కు వెళితే కొంద‌రు ర‌న్నింగ్ చేస్తారు. ఇంకొంద‌రు స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు చేస్తారు. అయితే స్కిప్పింగ్ చేయ‌డం వ‌ల్ల కూడా ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీంతో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుదాం. 1. స్కిప్పింగ్ చేయ‌డం వ‌ల్ల అధిక మొత్తంలో క్యాల‌రీలను త‌క్కువ స‌మ‌యంలోనే ఖ‌ర్చు చేయ‌వ‌చ్చు. స్కిప్పింగ్ చేస్తే నిమిషానికి సుమారుగా 15 నుంచి 20 క్యాల‌రీలు ఖ‌ర్చ‌వుతాయి. అంటే 15 … Read more

రోజూ 30 నిమిషాల పాటు సైకిల్ తొక్కితే ఇన్ని లాభాలు క‌లుగుతాయా..?

ఇప్పుడంటే వాహనాలు వచ్చాయి. కనుక ప్రయాణాలు సులభతరం అయ్యాయి. చిన్నపాటి దూరాలకు కూడా చాలా మంది వాహనాలను ఉపయోగిస్తున్నారు. కానీ ఒకప్పుడు సైకిళ్లను ఎక్కువగా వాడేవారు. అందువల్ల వారు ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో సైకిల్‌ను తొక్కేవారు ఎక్కువే. అయితే సైకిల్ తొక్కడం వల్ల మన శరీరానికి అద్భుతమైన వ్యాయామం జరుగుతుంది. ఈ క్రమంలోనే రోజుకు కనీసం 30 నిమిషాల పాటు అయినా సైకిల్‌ తొక్కడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. … Read more

వెనక్కి వాకింగ్‌ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..?

రోజూ వాకింగ్‌ చేయడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వాకింగ్‌ వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మానసిక ఉల్లాసం కలుగుతుంది. డయాబెటిస్‌, కొలెస్ట్రాల్‌, అధిక బరువు వంటి సమస్యలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా ఎన్నో ఉపయోగాలు వాకింగ్‌ వల్ల మనకు కలుగుతాయి. అయితే నేరుగా వాకింగ్‌ చేయకుండా రివర్స్‌లో వాకింగ్‌ చేయడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటంటే… 1. వెనక్కి వాకింగ్‌ చేయడం అనే విషయం మీకు … Read more

రోజూ 30 నిమిషాల పాటు స్కిప్పింగ్ చేస్తే క‌లిగే లాభాలివే..!

ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ త‌గినన్ని గంట‌ల‌పాటు నిద్రపోవాలి. పౌష్టికాహారాన్ని వేళ‌కు తీసుకోవాలి. త‌గినంత నీటిని తాగాలి. అలాగే రోజూ వ్యాయామం కూడా చేయాలి. ఈ క్ర‌మంలోనే చాలా మంది త‌మ అనుకూల‌తల‌ను, స్థోమ‌త‌ను బ‌ట్టి రోజూ ర‌క‌ర‌కాల వ్యాయామాలు చేస్తుంటారు. అయితే శ‌రీరానికి అధికంగా ఉప‌యోగ‌ప‌డే వ్యాయామాల్లో స్కిప్పింగ్ ఒక‌టి. నిజానికి 45 నిమిషాల పాటు వాకింగ్ చేయ‌డం క‌న్నా 10 నిమిషాల పాటు స్కిప్పింగ్ చేస్తేనే ఎక్కువ క్యాల‌రీలు ఖ‌ర్చ‌వుతాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. క‌నుక … Read more

పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును, అధిక బ‌రువును త‌గ్గించే వ్యాయామం.. చేయ‌డం సుల‌భ‌మే..!

do plank exercise daily for improving metabolism

అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించుకునేందుకు అనేక ర‌కాల వ్యాయామాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఒక‌టి ప్లాంక్ (Plank) ఎక్స‌ర్‌సైజ్‌. చూసేందుకు ఈ వ్యాయామం తేలిగ్గానే అనిపిస్తుంది. కానీ ఈ వ్యాయామం చేయ‌డం కొద్దిగా క‌ష్ట‌మే. అయితే దీన్ని నిత్యం కొంత‌సేపు చేసినా చాలు. అద్భుతమైన ఫ‌లితాలు వ‌స్తాయి. ప్లాంక్ ఎక్స‌ర్‌సైజ్ ఇలా చేయాలి చిత్రంలో చూపిన‌ట్లుగా బోర్లా ప‌డుకుని మోచేతులను, పాదాల మునివేళ్ల‌ను నేల‌పై ఆనించి ఆయా భాగాల స‌పోర్ట్‌తో పైకి లేవాలి. … Read more

రోజుకు 15 నిమిషాలు ఈ విధంగా చేస్తే చాలు.. బ‌రువు ఇట్టే త‌గ్గుతారు..!

అధిక బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా ? ఏవేవో వ్యాయామాలు చేస్తూ అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు అనేక క‌ష్టాలు ప‌డుతున్నారా ? అయితే అంత క‌ష్ట‌ప‌డాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే కింద తెలిపిన సింపుల్ వ్యాయామాల‌ను నిత్యం 15 నిమిషాల పాటు చేస్తే చాలు. అధిక బ‌రువు త‌గ్గుతారు. ఫిట్‌గా ఉంటారు. ఇందులో ప‌లు వ్యాయామాలు క‌లిపి ఉంటాయి. దీన్నే హై ఇంటెన్సిటీ ఇంట‌ర్వెల్ ట్రెయినింగ్ (HIIT) అంటారు. ఈ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల స‌మ‌యం ఆదా అవుతుంది. త‌క్కువ … Read more

రోజుకు 1000 క్యాల‌రీల‌ను ఎలా ఖ‌ర్చు చేయ‌వ‌చ్చు ?

నిత్యం మ‌న శ‌రీరానికి సుమారుగా 1500 నుంచి 1800 క్యాల‌రీలు అవ‌స‌రం అవుతాయి. కూర్చుని ప‌నిచేసే వారికి 1500 క్యాల‌రీలు స‌రిపోతాయి. శారీర‌క శ్ర‌మ చేసే వారికి అయితే 1800 నుంచి 2500 క్యాల‌రీలు అవ‌స‌రం అవుతాయి. అయితే శారీర‌క శ్ర‌మ చేసేవారికి ఎలాగూ నిత్యం వ్యాయామం అవుతుంది. క‌నుక వారు క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేయ‌డం గురించి దిగులు చెందాల్సిన ప‌నిలేదు. కానీ కూర్చుని ప‌ని చేసేవారు క‌చ్చితంగా నిత్యం శారీర‌క శ్ర‌మ ఉండేలా చూసుకోవాలి. నిత్యం … Read more

వ్యాయామానికి వారంలో ఒక రోజు విరామం ఇవ్వాలి.. ఎందుకో తెలుసుకోండి.. త‌ప్పక తెలుసుకోవాల్సిన విష‌యం..!

ఆరోగ్యం బాగుండాలంటే ఎవ‌రైనా స‌రే రోజూ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఈ విష‌యం ఎవ‌ర్ని అడిగినా చెబుతారు. వైద్యులు అయితే ఆరోగ్యంగా ఉండేందుకు నిత్యం వ్యాయామం చేయాల‌ని సూచిస్తుంటారు. అయితే ఇది నిజ‌మే. కానీ వారంలో 6 రోజులు వ్యాయామం చేస్తే చాలు. ఒక రోజు వ్యాయామానికి విరామం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మేం చెప్ప‌డం లేదు. సైంటిస్టులు చెబుతున్నారు. వ్యాయామం చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా అధిక బ‌రువు త‌గ్గుతారు. అలాగే … Read more

వ్యాయామం చేయ‌డం వ‌ల్ల ముఖంలో కాంతి పెరుగుతుందా ?

అవును.. పెరుగుతుంది. వ్యాయామం చేయ‌డం వ‌ల్ల చ‌ర్మంపై ఉండే మృత క‌ణాలు పోతాయి. దీంతో చ‌ర్మం ప్ర‌కాశ‌వంతంగా, మెరుపుద‌నంతో ద‌ర్శ‌న‌మిస్తుంది. అయితే ముఖంలో వ‌చ్చిన కాంతి అలాగే కొన‌సాగాలంటే ఎప్పటికీ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. వ్యాయామం చేయ‌డం వ‌ల్ల ముఖంలో కాంతి పెరుగుతుందా ? అంటే క‌చ్చితంగా పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే క్రీడాకారులు, సెల‌బ్రిటీలు ఎప్పుడూ వ్యాయామం చేస్తుంటారు. క‌నుక‌నే వారికి వృద్ధాప్యం వ‌చ్చినా ముఖం మీద కాంతి అలాగే ఉంటుంది. వృద్ధాప్య ఛాయ‌లు క‌నిపించ‌వు. క‌నుక … Read more

అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు ఉత్త‌మ‌మైన వ్యాయామం ఏది ?

అధిక బ‌రువు త‌గ్గ‌డం అనేది ప్ర‌స్తుతం త‌రుణంలో చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. బ‌రువు పెరుగుతున్నారు కానీ త‌గ్గ‌డం అంత సుల‌భంగా వీలు కావ‌డం లేదు. దీంతో అనేక మంది ర‌క ర‌కాల వ్యాయామ ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తున్నారు. అయితే బ‌రువు త‌గ్గేందుకు అన్నింటికన్నా ఉత్త‌మ‌మైన వ్యాయామం ఏది ? నిత్యం ఏ వ్యాయామం చేస్తే అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతారు ? అంటే… * గంట‌కు సుమారుగా 8 మైళ్ల వేగంతో ర‌న్నింగ్ చేస్తే ఒక గంట‌లో … Read more