కోవిడ్ మృతుల కుటుంబాల‌కు రూ.50వేల న‌ష్ట‌ప‌రిహారం.. ఈ వెబ్‌సైట్‌లో ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి..!

క‌రోనా వ‌ల్ల దేశ‌వ్యాప్తంగా ఎంతో మంది మృతి చెందారు. ఈ క్ర‌మంలోనే కోవిడ్ వ‌ల్ల న‌ష్ట‌పోయిన కుటుంబాల‌కు ప‌రిహారం అందించేందుకు గాను కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే సిద్ధ‌మైంది. కోవిడ్ మృతుల కుటుంబాల‌కు రూ.50వేల న‌ష్ట‌ప‌రిహారం అందించ‌నున్న‌ట్లు ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలోనే ఈ ప్ర‌క్రియ‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేసేందుకు ఏపీ ప్ర‌భుత్వం ఓ నూత‌న వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఏపీలో కోవిడ్ బాధిత కుటుంబాల‌కు స‌త్వ‌ర‌మే ప‌రిహారం అందేలా చేసేందుకుగాను ఏపీ ప్ర‌భుత్వం కొత్త‌గా https://covid19.ap.gov.in/exgratia … Read more

భార‌త్ లో విస్త‌రిస్తున్న ఒమిక్రాన్ వేరియెంట్‌.. ఏయే రాష్ట్రాల్లో ఎన్ని కేసులు ఉన్నాయంటే..?

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం త‌గ్గుతోంది.. అంతా స‌ద్దుమ‌ణుగుతోంది.. అనుకుంటున్న త‌రుణంలో.. ఆ వైర‌స్ మళ్లీ ఒమిక్రాన్ రూపంలో వ్యాప్తి చెందుతూ ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌ల‌ను మళ్లీ భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తోంది. ఈ క్ర‌మంలోనే మ‌న దేశంలోనూ రోజు రోజుకీ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండ‌డం మ‌రింత ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. మ‌న దేశంలో శుక్ర‌వారం ఒక్క రోజే కొత్త‌గా 26 ఒమిక్రాన్ కేసులు న‌మోదు కాగా.. మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 100కు చేరుకుంది. మంగ‌ళ‌, … Read more

చిన్నారుల‌కూ వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియెంట్‌.. వారిలో క‌నిపిస్తున్న ల‌క్ష‌ణాలు ఇవే..!

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని ఇప్పుడ‌ప్పుడే వ‌దిలేలా క‌నిపించ‌డం లేదు. ఎన్నో వేరియెంట్లుగా మారి ఇప్ప‌టికే ఎంతో మందిని బ‌లిగొంది. ఎంతో ప్రాణ న‌ష్టాన్ని మిగిల్చింది. తాజాగా ఒమిక్రాన్ రూపంలో ఇంకో కొత్త వేరియెంట్ మాదిరిగా క‌రోనా మ‌ళ్లీ విజృంభిస్తోంది. క‌రోనా ఒమిక్రాన్ వేరియెంట్‌ను ముందుగా సౌతాఫ్రికాలో గుర్తించారు. అయితే ఈ వైర‌స్ ఇప్పుడు అన్ని దేశాల‌కూ విస్త‌రించింది. దీంతో అనేక దేశాలు అల‌ర్ట్ అయ్యాయి. ఒమిక్రాన్ బాధితుల‌ను ప్ర‌త్యేకంగా గుర్తిస్తూ వారికి చికిత్స‌ను అందిస్తున్నారు. ఇక ఈ … Read more

శుభ‌వార్త‌.. దేశంలో స‌గం మంది పూర్తి స్థాయిలో టీకాలు తీసుకున్నారు..!

క‌రోనా మూడో వేవ్ వ‌స్తుంద‌న్న హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త‌ను చెప్పింది. దేశంలో 50 శాతం మంది పెద్ద‌లు పూర్తి స్థాయిలో కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నార‌ని వెల్ల‌డించింది. ఈ మేర‌కు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వివ‌రాల‌ను వెల్ల‌డించింది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 127.61 కోట్ల కోవిడ్ టీకాల‌ను వేశార‌ని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియ‌జేసింది. ఈ సంద‌ర్బంగా ఆ శాఖ మంత్రి డాక్ట‌ర్ మ‌న్‌సుఖ్ మాండ‌వియా మాట్లాడుతూ.. దేశంలోని … Read more

Covid 19 Omicron : క‌రోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ ప్ర‌ధాన ల‌క్ష‌ణం ఇదే.. వ్యాప్తి చెందే అవ‌కాశాలు కూడా ఎక్కువే..!

Covid 19 Omicron : ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొన్ని నెల‌లుగా కోవిడ్ కేసులు త‌గ్గుతుండ‌డంతో అంతా స‌ర్దుకుంటుంద‌ని ప్ర‌జ‌లు అనుకున్నారు. కానీ ఒమిక్రాన్ రూపంలో క‌రోనా మ‌ళ్లీ కొత్త రూపం దాల్చి తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. సౌతాఫ్రికాతోపాటు అనేక దేశాల్లో ఇప్ప‌టికే ఈ వేరియెంట్ బారిన ప‌డిన రోగుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. దీంతో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) అప్ర‌మ‌త్త‌మైంది. క‌రోనా ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. కాగా ఒమిక్రాన్ బారిన ప‌డిన … Read more

దేశంలో కొత్త‌గా 47,092 కోవిడ్ కేసులు.. 509 మంది మృతి..

గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా కొత్త‌గా 47,092 కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,28,57,937కు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,89,583కి చేరుకుంది. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వివ‌రాల‌ను వెల్ల‌డించింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 509 మంది కోవిడ్ వ‌ల్ల చ‌నిపోగా మొత్తం మ‌ర‌నాల సంఖ్య 4,39,529 కి చేరుకుంది. మొత్తం ఇన్ఫెక్ష‌న్ల‌లో యాక్టివ్ కేసుల సంక్య 1.19 శాతం ఉండ‌గా, రిక‌వ‌రీ రేటు 97.48 శాతానికి … Read more

కరోనా వైరస్‌ను చంపేసే పాము విషం.. కనుగొన్న సైంటిస్టులు..

కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది సైంటిస్టులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మహమ్మారి అంత సులభంగా పోదని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే కరోనా వైరస్‌ ఎప్పటికప్పుడు బలపడి కొత్త కొత్త రూపాల్లో ప్రజలకు వ్యాప్తి చెందుతోంది. అందువల్ల దీన్ని రాకుండా ఉండేందుకు టీకాలను వేసుకోవడం ఒక్కటే మార్గమని చెబుతున్నారు. అయితే కరోనా వైరస్‌ను ఓ జాతికి చెందిన పాము విషం చంపేయగలదని సైంటిస్టులు గుర్తించారు. బ్రెజిల్‌కు చెందిన కొందరు … Read more

మ‌హారాష్ట్ర‌లో కోవిడ్‌ డెల్టా ప్ల‌స్ బారిన ప‌డిన 5 మంది మృతి.. నిర్దారించిన ప్ర‌భుత్వం..

క‌రోనా గ‌తేడాది క‌న్నా ఈ సారి మ‌రింత ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఆ వైర‌స్‌కు చెందిన ప‌లు వేరియెంట్లు ప్ర‌స్తుతం ప్ర‌పంచ దేశాల‌ను భ‌య‌పెడుతున్నాయి. ఇక కోవిడ్ డెల్టా ప్ల‌స్ వేరియెంట్‌ను ఈ ఏడాది మార్చిలో మొద‌టి సారిగా యూర‌ప్‌లో గుర్తించారు. అయితే ఇది భార‌త్‌తోపాటు ప్ర‌పంచాన్ని కూడా భ‌య‌పెడుతోంది. మ‌హారాష్ట్ర‌లో ఆగ‌స్టు 13, 2021 శుక్ర‌వారం వ‌ర‌కు కోవిడ్ డెల్టా ప్ల‌స్ వేరియెంట్ కార‌ణంగా 5 మంది చ‌నిపోయారు. ఈ వివ‌రాల‌ను ఆ రాష్ట్ర … Read more

భార‌త్‌కు చెందిన కోవిడ్ వేరియెంట్ 44 దేశాల్లో గుర్తింపు.. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్ర‌క‌ట‌న‌..

క‌రోనా నేప‌థ్యంలో అనేక కొత్త కొత్త స్ట్రెయిన్లు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే భార‌త్‌లో గ‌తేడాది బి.1.617 అనే వేరియెంట్‌ను గుర్తించారు. అయితే ఈ వేరియెంట్ ప్ర‌స్తుతం 44 దేశాల్లో వ్యాప్తి చెందుతుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా వెల్ల‌డించింది. ఈ వేరియెంట్ ప్ర‌స్తుతం ఆందోళ‌న క‌లిగిస్తుంద‌ని పేర్కొంది. మే 11వ తేదీ వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా 44 దేశాల నుంచి 4500 శాంపిళ్ల‌ను సేక‌రించి ప‌రిశీలించారు. దీంతో స‌ద‌రు వేరియెంట్ ఆ శాంపిల్స్‌లో … Read more

భార‌తీయ యువ‌త‌లో పెరుగుతున్న గుండె జ‌బ్బులు.. అవి వ‌చ్చేందుకు కార‌ణాలు ఇవే..!

గ‌త ఏడాదిన్న‌ర కాలంగా భార‌త దేశంలో వైద్య, ఆరోగ్య వ్య‌వ‌స్థ‌పై కోవిడ్ తీవ్ర ప్ర‌భావం చూపిస్తోది. ఈ క్ర‌మంలోనే గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. వారిలో యువ‌త ఎక్కువ‌గా ఉండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. క్లినిక‌ల్ అండ్ డ‌యాగ్న‌స్టిక్ రీసెర్చ్ కు చెందిన జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించిన వివరాల ప్రకారం భార‌తీయుల్లో ప్ర‌స్తుతం యువ‌త‌లో గుండె జ‌బ్బులు ఎక్కువ‌గా వ‌స్తున్నాయ‌ని తేలింది. గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్న వారిలో ఎక్కువ‌గా యువ‌తే ఉంటున్నార‌ని వెల్ల‌డించారు. … Read more