మ‌న శ‌రీరానికి ఎల‌క్ట్రోలైట్స్ కావాలి.. ఎల‌క్ట్రోలైట్స్ వాట‌ర్‌ను ఇలా త‌యారుచేసి తాగ‌వ‌చ్చు..!

నిత్యం త‌గినంత మోతాదులో నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీర ఉష్ణోగ్ర‌త నియంత్ర‌ణ‌లో ఉంటుంది. బీపీ కంట్రోల్ అవుతుంది. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. శ‌రీరంలోని ద్ర‌వాలు స‌మ‌తుల్యంలో ఉంటాయి. అయితే నిత్యం తాగే నీటిలో ఎల‌క్ట్రోలైట్‌ల‌ను క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల ఇంకా మేలు జ‌రుగుతుంది. అయితే ఇంత‌కీ ఎల‌క్ట్రోలైట్స్ అంటే ఏమిటి ? వాటితో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి ? ఎల‌క్ట్రోలైట్ వాట‌ర్‌ను ఎలా త‌యారు చేయాలి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

అధిక బరువును తగ్గించే సోంపు గింజల నీళ్లు.. ఇలా తయారు చేసుకుని తాగాలి..!

సోంపు గింజ‌ల‌ను చాలా మంది భోజ‌నం చేశాక తింటుంటారు. వీటిని తిన‌డం వ‌ల్ల నోరు దుర్వాస‌న రాకుండా తాజాగా ఉంటుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. గ్యాస్‌, అసిడిటీ స‌మ‌స్య‌లు ఉండ‌వు. అయితే సోంపు గింజ‌ల‌తో అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం తేలికే. అందుకుగాను కింద తెలిపిన విధంగా సోంపు గింజ‌ల నీళ్ల‌ను త‌యారు చేసుకుని తాగాలి. మ‌రి ఆ నీళ్ల‌ను ఎలా త‌యారు చేయాలంటే.. ఒక పాత్రలో ఒక లీటర్‌ నీటిని తీసుకుని అందులో 4 టీస్పూన్ల … Read more

ఆరోగ్య‌క‌ర‌మైన మున‌గాకుల సూప్‌.. ఇలా త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు..!

మున‌గ ఆకుల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు, పోష‌కాలు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అందువ‌ల్ల మున‌గ ఆకుల‌ను తీసుకోవాల‌ని చెబుతుంటారు. దీన్ని కొంద‌రు కూర‌గా చేసుకుని తింటారు. కొంద‌రు నీటిలో ఆ ఆకుల‌ను మ‌రిగించి తాగుతారు. అయితే మున‌గ ఆకుల‌తో సూప్ కూడా త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు. ఇది రుచిక‌రంగా ఉండ‌డ‌మే కాదు, పోష‌కాల‌ను కూడా అందిస్తుంది. అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. మ‌రి మున‌గ ఆకుల‌తో సూప్‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..! కావ‌ల్సిన ప‌దార్థాలు మున‌గ … Read more

ఈ 3 ప‌దార్థాల‌తో హెర్బ‌ల్ టీని త‌యారు చేసుకుని తాగితే ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

మ‌నకు తాగేందుకు అనేక ర‌కాల హెర్బ‌ల్ టీలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇంట్లోనే మ‌నం హెర్బ‌ల్ టీని త‌యారు చేసుకుంటే మంచిది. బ‌య‌ట మార్కెట్‌లో ల‌భించే హెర్బ‌ల్ టీ ల క‌న్నా మనం ఇంట్లో త‌యారు చేసుకునే హెర్బ‌ల్ టీలే శ్రేయ‌స్క‌రం. ఈ క్ర‌మంలోనే మ‌న వంట ఇంట్లో ఉండే మూడు ప‌దార్థాల‌తో హెర్బ‌ల్ టీని త‌యారు చేసుకుని తాగితే దాంతో ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం, వాము, నిమ్మ‌ర‌సం.. ఈ మూడూ … Read more

రోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక క‌ప్పు ట‌మాటా సూప్‌ను తాగాల్సిందే.. అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు..!

ట‌మాటాల్లో ఎన్నో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, వృక్ష సంబంధ స‌మ్మేళ‌నాలు ఉంటాయి. ఇవి మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల ప్ర‌కారం.. ట‌మాటాల్లో ఉండే పోష‌కాలు అనేక వ్యాధుల‌పై పోరాటం చేస్తాయి. ముఖ్యంగా గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులును రాకుండా మ‌న‌ల్ని ర‌క్షిస్తాయి. అందువ‌ల్ల ట‌మాటాల‌ను తీసుకోవాలి. అయితే రోజూ ట‌మాటాల‌ను నేరుగా తీసుకోలేని వారు సూప్ రూపంలోనూ వాటిని తీసుకోవ‌చ్చు. దీంతో అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. 1. ట‌మాటా … Read more

గోధుమ పిండి రొట్టెలే కాదు.. ఈ రొట్టెల‌ను కూడా తిన‌వ‌చ్చు.. అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

అధిక బ‌రువు త‌గ్గాల‌ని చెప్పి చాలా మంది రాత్రి పూట అన్నంకు బ‌దులుగా గోధుమ‌ల పిండితో త‌యారు చేసిన రొట్టెల‌ను తింటుంటారు. నిజానికి అన్నంలో ఎన్ని క్యాల‌రీలు ఉంటాయో గోధుమ రొట్టెల్లోనూ అన్నే క్యాల‌రీలు ఉంటాయి. అందువ‌ల్ల కొంద‌రు బ‌రువు త‌గ్గ‌లేక‌పోతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన వివిధ ర‌కాల రొట్టెల‌ను రోజూ తీసుకుంటే ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. 1. జొన్న రొట్టెలు చాలా రుచిక‌రంగా ఉండ‌డ‌మే కాదు, వాటిల్లో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. … Read more

అధిక బ‌రువును వేగంగా త‌గ్గించుకోవాల‌ని చూస్తున్న‌వారు రాత్రి పూట నిద్ర‌కు ముందు వీటిని తాగాలి..!

అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం అన్న‌ది అంత తేలికైన ప‌నేమీ కాదు. అందుకోసం ఎంతో శ్ర‌మించాల్సి ఉంటుంది. రోజూ వ్యాయామం చేయాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించాలి. తగినంత నీటిని తాగాలి. అయితే వీటితోపాటు రాత్రి నిద్ర‌కు ముందు కింద తెలిపిన డ్రింక్స్‌ను తాగుతుండాలి. దీని వ‌ల్ల శ‌రీరంలోని కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి ఆ డ్రింక్స్ ఏమిటంటే.. 1. క‌మోమిల్ (గ‌డ్డి చామంతి) పూల టీ ని తాగితే శ‌రీరంలో … Read more

కూర‌గాయ‌ల‌తో చేసే ఈ మిక్స్‌డ్ వెజిట‌బుల్ స‌లాడ్‌ను రోజూ తినండి.. బ‌రువు త‌గ్గుతారు..!

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అధిక బరువు వ‌ల్ల‌ ఇబ్బందులు పడుతున్నారు. బరువు పెరగడం వెనుక ఉన్న ఒక పెద్ద కారణం.. అస్త‌వ్య‌స్త‌మైన‌ జీవనశైలి. తినడానికి లేదా నిద్రించడానికి షెడ్యూల్ లేకపోతే అది మీ ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. అటువంటి జీవనశైలితో క్రమంగా బరువు పెరుగుతారు. మీరు మీ ఆహారం మీద శ్రద్ధ వహిస్తే మీ బరువును చాలా వరకు త‌గ్గించుకోవచ్చు. ఈక్ర‌మంలోనే ఓ అద్భుత‌మైన ఆహారం గురించి మీకు తెలియ‌జేయ‌డం జ‌రుగుతోంది. దీన్ని త‌యారు … Read more

జలుబు వేగంగా తగ్గాలంటే.. తులసి కషాయం తాగాల్సిందే..!

సాధారణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నప్పుడు ఎన్నో రకాల బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్ లకు గురవుతారు. ఈ క్రమంలోనే వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం వల్ల చాలామంది జలుబు సమస్యతో బాధపడుతుంటారు. ఈ విధంగా వాతావరణ పరిస్థితులలో మార్పులకు అనుగుణంగా దగ్గు, జలుబు రావడం సర్వసాధారణమే. అయితే దగ్గు, జలుబు మరింత ప్రమాదకరం ఏమీ కాదు కనుక మన ఇంట్లోనే కొన్ని నివారణ పద్ధతులను ఉపయోగించి ఈ జలుబు సమస్యనుంచి ఉపశమనం పొందవచ్చు. దగ్గు, జలుబును దూరం చేసే … Read more

తుల‌సి ఆకుల‌తో త‌యారు చేసే క‌షాయం.. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది..!

ఓ వైపు క‌రోనా సమ‌యం.. మ‌రోవైపు సీజ‌న్ మారింది.. దీంతో మ‌న శ‌రీరంపై దాడి చేసేందుకు సూక్ష్మ క్రిములు సిద్ధ‌మ‌వుతున్నాయి. వాటి వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. సీజ‌న్ మారిన‌ప్పుడు స‌హ‌జంగానే ద‌గ్గు, జ‌లుబు, ఫ్లూ జ్వ‌రం వ‌స్తాయి. కానీ కోవిడ్ స‌మయం క‌నుక ఇంకా జాగ్ర‌త్త‌గా ఉండాలి. అందుకు గాను రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే క‌షాయాల‌ను తాగాలి. అలాంటి ఓ క‌షాయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే క‌షాయం … Read more