మ‌ట‌న్‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా..? కొలెస్ట్రాల్‌పై దీని ప్ర‌భావం ఏమిటి..?

మ‌ట‌న్‌ను ఇంతవరకు కొల్లెస్టరాల్ పెంచుతుందనే అందరూ భావించేవారు. అయితే తాజాగా చేసిన ఒక అధ్యయనంలో శరీరంలోని చెడు కొల్లెస్టరాల్ అరికట్టాలంటే మ‌ట‌న్‌ బాగా పనిచేస్తుందని తేలింది. మ‌ట‌న్‌ను ప్రతిరోజూ తింటే…ఎల్ డిఎల్ లేదా చెడు కొల్లెస్టరాల్ తగ్గుతుందని, గుండె ఆరోగ్యంగా వుండాలంటే తినే ఆహారాలతో సమానంగా మ‌ట‌న్‌ కూడా పనిచేస్తుందని పరిశోధకులు చెపుతున్నారు. ఈ పరిశోధన పెన్సిల్వానియా యూనివర్శిటీ రీసెర్చర్లు చేశారు. కొల్లెస్టరాల్ అధికంగా వున్న వారికి మ‌ట‌న్‌ను ప్రతిరోజూ తినిపించి పరిశోధించి అది వారిలోని చెడు … Read more

రోజూ చేప‌ల‌ను తింటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ట‌..!

స్పెయిన్ దేశస్ధులు డయాబెటీస్ రాకుండా రోజుకో చేపను తింటారట. ఇలా తినే వీరిలో డయాబెటీస్ మచ్చుకైనా కనపడటం లేదంటారు ఈ అంశంపై రీసెర్చి చేసిన వాలెన్షియా మెనర్సిడస్ సోటోస్ ప్రీటో యూనివర్శిటీ పరిశోధకులు. పరిశోధకులు 55 నుండి 80 సంవత్సరాల వయసున్న గుండెజబ్బు రోగులను షుమారు వేయి మంది పురుషులు, మహిళలను పరిశోధించారు. వీరిలో వున్న డయాబెటీస్ సైతం వీరు తినే చేప ఆహారానికి తగ్గుముఖం పట్టిందని తేలినట్లు చెపుతున్నారు. రెడ్ మాంసాన్ని అధికంగా తినటం, బ్లడ్ … Read more

మ‌ధ్యాహ్నం నిద్ర మంచిదే కానీ.. అక్క‌డే ఉంది అస‌లు కిటుకు..

చాలామందికి మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉంటుంది. నిజంగానే మధ్యాహ్న భోజనం చేసాక ఓ చిన్న కునుకు తీస్తే ఆ సుఖమే వేరు. ఫుల్ గా పంచభక్ష పరమాన్నాలతో భోజనం అయ్యాక నిద్రలోకి జారుకుంటే స్వర్గం కనిపిస్తుంది. అందుక‌నే చాలా మంది ఆఫీసుల్లో ప‌నిచేస్తున్న‌ప్ప‌టికీ మ‌ధ్యాహ్నం లంచ్ చేయ‌గానే విప‌రీత‌మైన ఆవులింత‌లు వ‌చ్చి నిద్ర‌లోకి జారుకుంటారు. అయితే వాస్త‌వానికి మ‌ధ్యాహ్నం నిద్ర మంచిదే అయిన‌ప్ప‌టికీ కొద్ది సేపే నిద్రించాల‌ట‌. కానీ ఆ నిద్ర 90 నిమిషాలు దాటితే మాత్రం … Read more

రోజూ న‌వ్వితే హార్ట్ ఎటాక్ అస‌లు రాద‌ట‌.. సైంటిస్టుల ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డి..

నవ్వటంకూడా ఒక మంచి ఆహారం లాంటిదేనంటారు రీసెర్చర్లు. కడుపుబ్బేలా నవ్వేస్తే, గుండెకు రక్త ప్రసరణ అధికమవుతుందని ఒక కొత్త అధ్యయనం తెలుపుతోంది. దేర్ ఈజ్ సమ్ ధింగ్ అబౌట్ మేరీ అనే సినిమా చూసేటపుడు కొన్ని అంశాలు కడుపుబ్బ నవ్వించేవి. చూసిన వ్యక్తులకు రక్తనాళాలు పరిశీలిస్తే అవి వ్యాకోచం చెందాయట. అయితే వీరికే విచారకరమైన ఫిలిం సేవింగ్ ప్రయివేట్ ర్యాన్ చూపినపుడు అందులోని సంఘటనలకు రక్తనాళాలు కుచించుకుపోయి గుండెకు రక్తప్రసరణ సరిగా జరగలేదట. నవ్విన తర్వాత ఏర్పడే … Read more

పొలాల దగ్గర పెరిగిన పిల్లలకే….రోగాలు తట్టుకునే శక్తి ఎక్కువ.! ఎందుకో తెలుసా?

ప‌ట్ట‌ణాల్లో పిల్ల‌ల కంటే పొలాల వ‌ద్ద పెరిగిన పిల్ల‌ల‌కు వ్యాధి నిరోద‌క శ‌క్తి ఎక్కువట! భ‌విష్య‌త్ లో రాబోయే వ్యాధులను తట్టుకునే పవర్ పొలాల వద్ద పెరిగిన పిల్లలకే అధికమట! పొలాల వ‌ద్ద ఉండే వాతావర‌ణం లో ఉండే A- 20 అనే ప్రొటిన్ పిల్ల‌ల ఆరోగ్యాన్ని రెట్టింపు చేస్తుంద‌ట.. ఎలుకల మీద ప్రయోగం చేసిన డాక్టర్లు ఈ విషయాన్ని ధృవీకరించారు. స్వఛ్చమైన వాతావరణంతో పాటు ఆరోగ్యాన్ని రెట్టింపు చేసే ప్రొటీన్ కారణంగా ఈ పిల్లలు అన్ని … Read more

ఈ క్రీమును రాస్తే ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగానే క‌నిపిస్తార‌ట‌.

మానవ చర్మ కణాలను పుట్టించే యాంటీ ఏజింగ్ క్రీమ్ ను సైంటిస్టులు కనిపెడుతున్నట్లు వెల్లడించారు.లండన్ లోని ప్రపంచ ప్రసిధ్ధ, లా ఓరియల్ కాస్మెటిక్ కంపెనీలోని రీసెర్చర్లు చర్మంపై ముడుతలు, చర్మం ఎక్కడైనా చెడితే దానికొరకు ఒక క్రీమును కనిపెట్టారు. అది ఈ సంవత్సరంలో మార్కెట్ లోకి కూడా ప్రవేశపెట్టనున్నట్లు లండన్ లోని ది డైలీ మెయిల్ వార్తా పత్రిక వెల్లడించింది. ఈ క్రీము చర్మానికి రాస్తే, వున్న వయసు కంటే కూడా తక్కువగా కనపడేట్లు చేస్తుందని రీసెర్చర్ల … Read more

35 ఏళ్ల‌కు పైబ‌డిన మ‌హిళ‌ల్లో పెరుగుతున్న హార్ట్ ఎటాక్ ముప్పు.. జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌వు..

ఈమధ్య కాలంలో హృదయ సంబంధిత సమస్యలు బాగా ఎక్కువైపోయాయి. చాలామంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలు ఏమి లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటించాలి. ఆరోగ్యానికి మేలు చూసే ఆహార పదార్థాలని డైట్ లో చేర్చుకుంటూ ఉండాలి. దాంతో పాటుగా మంచి పద్ధతుల్ని అనుసరిస్తూ ఉండాలి. ఎక్కువగా యువతుల్లో గుండె సమస్యలు బాగా విపరీతంగా పెరిగిపోయాయి. అటువంటి గుండె సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యానికి మేలు చేసే పద్ధతులని తప్పక పాటించాలని ఆరోగ్య … Read more

త‌ర‌చూ  శృంగారంలో పాల్గొంటే గుండె పోటు రాద‌ట‌..!

గుండెపోటు, గుండెసంబంధిత తదితర వ్యాధులనుండి దూరంగా వుండాలనుకుంటే, క్రమం తప్పకుండా ఆరోగ్యకరమైన రతిక్రియ చేయాలని తమ రీసెర్చిలో వెల్లడైనట్లు మసాచ్యూసెట్ లోని న్యూ ఇంగ్లాండ్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. రతిక్రియ వారానికి కనీం రెండు లేదా మూడు సార్లు జరుపుతూంటే, గుండె సంబంధిత రక్తనాళాలు చురుకుగా పనిచేస్తాయని గుండెపోటు నుండి దూరంగా వుండవచ్చని తెలుపుతున్నారు. ఇంతకంటే ఎక్కువ సార్లు కూడా రతిక్రియలో పాల్గొన్నా ప్రయోజనమేనని ప్రత్యేకించి పురుషులలో 45 శాతం మేరకు రతిక్రీడ గుండె జబ్బులను … Read more

పొగ తాగే వారికి దూరంగా ఉంటే గుండె పోటు రాద‌ట‌..!

పొగతాగే చట్టాలు చేయడం, పొగ నిషేధిత ప్రాంతాలు ఏర్పరచడం, పొగతాగే వారికి దూరంగా వుండటం వంటివి చేస్తే ఆకస్మిక గుండెపోటు మరణాలు, గుండె పోట్లు, తగ్గించవచ్చని తాజాగా ఒక పరిశోధనలో మేయో క్లినిక్ రీసెర్చర్లు వెల్లడించారు. అమెరికాలోని ఆల్మస్టెడ్ కౌంటీ, మిన్, ప్రాంతంలో పొగరహిత చట్టాలను చేసిన తర్వాత గుండెపోట్లు, ఆకస్మిక గుండెపోటు మరణాలు సగానికి సగం తగ్గిపోయాయని రీసెర్చి వెల్లడించింది. ఈ అంశాన్నిమేయో క్లినిక్ నికోటైన్ డిపెండెన్స్ సెంటర్ డైరెక్టర్ మరియు రీసెర్చర్ రిచర్డ్ హర్ట్ … Read more

పురుషులూ.. వింటున్నారా.. న‌పుంస‌క‌త్వ స‌మ‌స్య పెరుగుతోంద‌ట‌..

ప్రస్తుత సమాజంలో ప్రజల జీవనశైలి అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. కరోనా వల్ల కాస్త చక్కబడ్డా చాలా వరకు ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన అలవాట్లు లేవు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కొందరిలో అనారోగ్యకర అలవాట్ల వల్ల సంతానలేమి కూడా కలుగుతోంది. ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు వంధ్యత్వ సమస్యతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మొత్తం జనాభాలో 17.15 శాతం మందిలో ఈ సమస్య ఉందని, దీనిని అధిగమించడానికి అత్యవసరంగా సంతాన సాఫల్య చర్యలు … Read more