పేగుల్లో పురుగులు.. ఆయుర్వేద చికిత్స‌..

పేగుల్లో ఎవ‌రికైనా స‌రే పురుగులు వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. మ‌ట్టి, గోడ‌కు వేసిన సున్నం, చాక్ పీస్‌లు, బ‌ల‌పాలు తిన‌డం, బియ్యంలో మ‌ట్టిగ‌డ్డ‌లు తిన‌డం వంటి కార‌ణాల వ‌ల్ల పేగుల్లో పురుగులు ఏర్ప‌డుతుంటాయి. మూత‌పెట్ట‌ని, స‌రిగ్గా నిల్వ చేయ‌ని ఆహార ప‌దార్థాలను తిన‌డం వ‌ల్ల, టాయిలెట్‌కు వెళ్లిన‌ప్పుడు శుభ్ర‌త‌ను పాటించ‌క‌పోవ‌డం వ‌ల్ల‌, అప‌రిశుభ్రంగా ఉన్న నీటిని తాగ‌డం వ‌ల్ల‌, గోళ్లలో మ‌ట్టి పేరుకుపోయినా అలాగే వేళ్ల‌తో తిన‌డం వ‌ల్ల‌.. పేగుల్లో పురుగులు ఏర్ప‌డుతాయి. పేగుల్లో ఏర్ప‌డే … Read more

జుట్టు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే.. మందారం పువ్వులు, ఆకులు..!

జుట్టు స‌మ‌స్య‌లు స‌హ‌జంగానే చాలా మందికి ఉంటాయి. వెంట్రుక‌ల చివర్లు చిట్లడం, రాలడం, నెరవడం… వంటి సమస్యలు చాలామందికి ఎదురవుతుంటాయి. వీటిని త‌గ్గించుకోవాలంటే మన పెరట్లో ఉండే మందార ఆకులు, పువ్వుల‌తో కింద తెలిపిన విధంగా చేయాల్సి ఉంటుంది. దీంతో వెంట్రుక‌ల స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. జుట్టు రాలకుండా ఉండేందుకు ఏడెనిమిది చొప్పున మందార పువ్వులు, ఆకుల్ని శుభ్రంగా కడిగి ముద్దలా చేయాలి. ఒక కప్పు కొబ్బరి నూనెను వేడిచేసి ఈ మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలపాలి. … Read more

జుట్టు స‌మ‌స్య‌ల‌న్నింటికీ కొబ్బ‌రినూనె ఉత్త‌మ‌మైంది.. ఎందుకో తెలుసా..?

కొబ్బరినూనెను నిత్యం సేవించ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయని అంద‌రికీ తెలుసు. అయితే కొబ్బ‌రినూనె అనేది శ‌రీరం క‌న్నా జుట్టుకు ఇంకా అద్భుతంగా ప‌నిచేస్తుంది. జుట్టు స‌మ‌స్య‌ల‌కు ఆ నూనె ప‌వ‌ర్‌ఫుల్ టానిక్‌లా ఉప‌యోగ‌ప‌డుతుంది. కొబ్బ‌రినూనె వ‌ల్ల ఏయే జుట్టు స‌మ‌స్య‌ల‌ను ఎలా త‌గ్గించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. * నిత్యం బాగా ఎండలో తిరిగేవారికి అనేక జుట్టు స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అయితే ఎండ‌లో తిరుగుతాం అనుకునేవారు కొబ్బ‌రినూనె నిత్యం త‌ల‌కు రాసుకోవ‌డం మంచిది. దీంతో ఎండ నుంచి … Read more

చుండ్రు త‌గ్గాలంటే ఏం చేయాలి ? స‌హ‌జసిద్ధ‌మైన చిట్కాలు !

మ‌న‌లో అధిక‌శాతం మందిని త‌ర‌చూ చుండ్రు స‌మ‌స్య వేధిస్తుంటుంది. దీంతో అనేక షాంపూలు గ‌ట్రా వాడుతుంటారు. అయిన‌ప్ప‌టికీ చుండ్రు స‌మ‌స్య ప‌రిష్కారం కాదు. అయితే కింద తెలిపిన‌ చిట్కాలను పాటిస్తే చుండ్రు స‌మ‌స్య నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. * వారంలో కనీసం రెండు సార్లయినా కుంకుడుకాయతో లేదా శీకాయతో త‌ల‌స్నానం చేయాలి. దీని వ‌ల్ల చుండ్రు స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. * కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి … Read more

క‌ళ్లు పొడిగా మారి దుర‌ద పెడుతున్నాయా..? ఇలా చేయండి..!

ప్ర‌స్తుత ఆధునిక యుగంలో కంప్యూట‌ర్ల ఎదుట కూర్చుని ప‌నిచేయ‌డం ఎక్కువైపోయింది. అలాగే స్మార్ట్‌ఫోన్ల వాడ‌కం కూడా పెరిగింది. దీంతో కంటి స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా కొంద‌రికి క‌ళ్లు పొడిగా మారుతూ.. దుర‌ద‌లు వ‌స్తున్నాయి. అలాగే క‌ళ్ల నుంచి నీరు కార‌డం, క‌ళ్లు మంట‌లుగా అనిపించ‌డం వంటి స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతున్నాయి. అయితే కింద తెలిపిన ప‌లు చిట్కాల‌ను పాటిస్తే.. ఆయా కంటి స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే… * ఒక శుభ్ర‌మైన … Read more

యాల‌కుల‌తో ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎలా న‌యం చేసుకోవ‌చ్చంటే ?

యాల‌కులు.. చాలా మంది ఇండ్లలో ఇవి వంట ఇంటి పోపుల డ‌బ్బాలో ఉంటాయి. వీటిని ఎక్కువ‌గా తీపి వంట‌కాల్లో వేస్తుంటారు. అలాగే బిర్యానీలు, ఇత‌ర మాంసాహార వంట‌కాలు, ప్ర‌త్యేక‌మైన శాకాహార వంట‌కాలు చేసిన‌ప్పుడు కూడా వీటిని వేస్తుంటారు. వీటితో వంట‌కాల‌కు చ‌క్క‌ని వాస‌న, రుచి వ‌స్తాయి. అయితే యాల‌కుల‌ను ఉప‌యోగించి మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. మ‌రి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా..! * ఒక యాల‌క్కాయను ఒక టీస్పూన్ తేనెతో రోజుకు ఒక‌సారి తీసుకుంటే … Read more

మ‌ల‌బ‌ద్ద‌కంతో ఇబ్బందులు ప‌డుతున్నారా..? ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు పాటించండి..!

స్థూల‌కాయం, థైరాయిడ్ స‌మ‌స్య‌లు, డ‌యాబెటిస్‌, టైముకు భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, మాంసాహారం ఎక్కువగా తిన‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల మ‌న‌లో చాలా మందికి మ‌ల‌బ‌ద్ద‌కం వ‌స్తుంటుంది. అయితే కింద తెలిపిన ప‌లు స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటిస్తే.. మ‌ల‌బ‌ద్ద‌కం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే… * ప్ర‌తి రోజూ రాత్రి నిద్రించ‌డానికి ముందు ఒక గ్లాసు గోరు వెచ్చ‌ని పాల‌ను తాగాలి. లేదా పాల‌లో ఆముదం క‌లుపుకుని కూడా తాగ‌వ‌చ్చు. దీంతో మ‌రుస‌టి రోజు … Read more

గొంతు నొప్పిని త‌గ్గించే స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..!

సాధార‌ణంగా మ‌న‌లో అధిక శాతం మందికి అప్పుడ‌ప్పుడు గొంతు నొప్పి వ‌స్తుంటుంది. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. జ‌లుబు చేసిన‌ప్పుడు లేదా చ‌ల్ల‌ని ద్ర‌వాల‌ను ఎక్కువ‌గా తాగిన‌ప్పుడు లేదా ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా గొంతు నొప్పి వ‌స్తుంటుంది. అయితే కింద తెలిపిన చిట్కాలు పాటిస్తే గొంతు నొప్పిని సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. * గొంతు నొప్పి ఎక్కువ‌గా ఉన్న‌వారు.. ఓ బౌల్‌లో వేడి వేడిగా చికెన్ సూప్ తాగాలి. చికెన్ సూప్ శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌కు ఔష‌ధంగా … Read more

మెద‌డు చురుగ్గా మారాలంటే.. ఈ చిట్కాలు పాటించండి..!

సాధార‌ణంగా మ‌న‌లో కొంద‌రికి మెద‌డు అంత యాక్టివ్‌గా ఉండ‌దు. నిజానికి అది వారి త‌ప్పు కాదు. ఎందుకంటే.. ఒక మనిషికి తెలివితేట‌లు అనేవి ఎవ‌రో నేర్పిస్తే రావు.. అవి పుట్టుక‌తో వ‌స్తాయి. అందువ‌ల్ల మెద‌డు యాక్టివ్ లేద‌ని ఎవ‌ర్నీ నిందించాల్సిన ప‌నిలేదు. ఇక వ‌యస్సు మీద ప‌డే వారిలో, పలు అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న వారిలో స‌హ‌జంగానే మెద‌డు యాక్టివ్‌గా ఉండ‌దు. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే.. మెద‌డును ఎల్ల‌ప్పుడూ చురుగ్గా ఉంచుకోవ‌చ్చు. దీంతో జ్ఞాప‌క‌శ‌క్తి … Read more

జ‌లుబు, ముక్కు దిబ్బ‌డ‌కు అద్భుత‌మైన ఇంటి చిట్కా..!

జ‌లుబు చేసిన‌ప్పుడు మ‌న‌కు స‌హ‌జంగానే ముక్కు దిబ్బ‌డ వ‌స్తుంటుంది. ముక్కు రంధ్రాలు ప‌ట్టేసి గాలి ఆడ‌కుండా అయిపోతాయి. దీంతో నోటి ద్వారా శ్వాస తీసుకోవాల్సి వ‌స్తుంటుంది. ఇక కొంద‌రికి జ‌లుబు ఉండ‌క‌పోయినా అప్పుడ‌ప్పుడు ముక్కు దిబ్బ‌డ వ‌స్తుంటుంది. దీంతో రాత్రిళ్లు నిద్ర‌పోలేక‌పోతుంటారు. అయితే కింద ఇచ్చిన చిట్కాను పాటిస్తే ముక్కు దిబ్బ‌డ‌, జ‌లుబు త్వ‌ర‌గా త‌గ్గుతాయి. మ‌రి ఆ చిట్కా ఏమిటంటే.. ముక్కు దిబ్బడ‌, జ‌లుబును త‌గ్గించేందుకు వాము అద్భుతంగా ప‌నిచేస్తుంది. వాము, ఉప్పుల‌ను సమభాగాలుగా చేసి … Read more