బంగారం తక్కువ ధర కి కొని కొంచెం ధర పెరిగాక అమ్మాలంటే ఏం చెయ్యాలి..?

బంగారం దుకాణం వాళ్ళు మనకి అమ్ముతారు కానీ మళ్ళా మన దగ్గర పెరిగిన ధర కి కొంటారా? బంగారం తక్కువ ధరకు కొని, ధర పెరిగాక అమ్మడం ఒక రకమైన పెట్టుబడి వ్యూహం. దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కింది సమాచారం దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను వివరిస్తుంది. బంగారం 24 క్యారెట్, 22 క్యారెట్ లేదా 18 క్యారెట్ అని హాల్‌మార్క్ (BIS సర్టిఫికేషన్) ఉందో లేదో చూడండి. హాల్‌మార్క్ ఉన్న బంగారమే కొనడం మంచిది.కొనుగోలు … Read more

F.I.R అంటే ఏమిటో… దాన్ని ఎలా ఫైల్ చేయాలో… దాంతో ఉప‌యోగమేంటో మీకు తెలుసా..?

ఏదైనా నేరం జ‌రిగిన‌ప్పుడు పోలీసులు ముందుగా ఎఫ్ఐఆర్ (ఫ‌స్ట్ ఇన్ఫ‌ర్మేష‌న్ రిపోర్ట్‌) న‌మోదు చేసి అందుకు అనుగుణంగా కేసు ద‌ర్యాప్తు చేస్తార‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే నిజానికి అస‌లు ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి..? దీన్ని ఎవ‌రైనా న‌మోదు చేయ‌వ‌చ్చా..? అస‌లు ఎఫ్ఐఆర్ లో ఏముంటాయి..? వ‌ంటి వివ‌రాలు మీకు తెలుసా..? వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం. పోలీసులకు ఏదైనా కాగ్నిజ‌బుల్ (విచారించ‌ద‌గ్గ‌) నేరం గురించి తెలిస్తే దాని గురించి మొద‌ట‌గా న‌మోదు చేసే స‌మాచారాన్ని ఎఫ్ఐఆర్ అంటారు. … Read more

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

మనలో చాలామంది రైలు ప్రయాణం చేసే ఉంటారు. రైలు పట్టాలను చూసినప్పుడు గానీ ప్రయాణం చేయడానికి వెళ్ళినప్పుడు గాని రైలు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తాం తప్ప ఇతర విషయాలను గమనించి ఉండరు. అలాగే మనం రైల్వే గురించి కొన్ని విషయాలను పెద్దగా పట్టించుకోము. అయితే రైలులో జనరల్ బోగీలు ముందు లేదా చివర ఉంటాయి. కారణమేంటో తెలుసా? ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. రైల్వే అధికారుల ప్రకారం, మిగతా కోచ్ లలో కంటే జనరల్ … Read more

నేష‌న‌ల్ హైవే ల‌కు…నెంబ‌రింగ్ ఎలా ఇస్తారో తెలుసా? ఇంట్ర‌స్టింగ్ టాపిక్!

హైద్రాబాద్ టు విజ‌య‌వాడ‌…N.H-9 అని గ‌తంలో ఉండేది..ఇప్పుడు దాన్ని N.H-65 గా మార్చారు.? ఎందుకు ? ఏమిటి? ఎలా ? అని న‌న్ను నేను ప్ర‌శ్నించుకొని శోధించుకున్న త‌ర్వాత తెల్సిన విష‌యాన్ని మీతో పంచుకుంటున్న‌.!. ఈ నెంబ‌ర్ మార్పు 2010 ఏప్రిల్ 28 న జ‌రిగింది. రోడ్ల‌ను గుర్తించ‌డంలో గంద‌ర‌గోళం లేకుండా…. సింపుల్ గా గుర్తించేందుకు అప్ప‌టి కేంద్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని తెలిసింది.! రోడ్ల‌కు నెంబ‌రింగ్ ఎలా ఇస్తారు? రోడ్ల‌కు…..ప‌డ‌మ‌ర టు తూర్పు, ఉత్త‌రం … Read more

రైల్వే స్టేషన్‌లో టర్న్ టేబిల్ (తిప్పు పరికరం) గురించిన వివరాలు ఏమిటి?

ఇది నలభయి ఏళ్ళ కిందటి సంగతి. మా ఊరికి మీటర్ గేజి రైలు బండి వచ్చేది. గుప్పు గుప్పు మని పొగ వదులుతూ,పెద్ద దర్జాగా ఉండేది దాని రాజసం. ఊరి బయట ఉన్నప్పుడే దాని కూత, దాని శబ్ద లయ విన్యాసాలు, చెవికి చేరేంత శబ్ద కాలుష్యం, తక్కువగా ఆరోజుల్లో ఊరిలో ఉండేదేమో. అక్కడి నుంచి కథ మొదలెడదాం. ఆ పొగ బండ్ల కి ఒక వైపే ముఖం, సరదాగా దాన్ని ఏకముఖి అనుకుందాం. ఇప్పుడొస్తున్న డీజిల్, … Read more

కరెన్సీ నోట్లపై ఈ నలుపు గీతలు గమనించారా ? అవి ఎందుకు ఉంటాయి ?

మన దేశంలో కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిత్యం మనం కరెన్సీ నోట్లను ఏదో ఒక అవసరానికి ఖర్చు చేస్తూనే ఉంటాం కానీ.. అసలు కరెన్సీ నోట్ల పైన చివర ఉండే గీతలను ఎప్పుడైనా పరిశీలించారా..? ఆ గీతలను బట్టి నోటు విలువ మారుతుందని తెలుసా..? అసలు ఆ గీతలతో విలువ ఎలా పెరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి వాటి సంఖ్యను బట్టి నోటు విలువ మారుతుంది. … Read more

రెస్టారెంట్ లు GST బిల్లులు పేరుతో మనల్ని ఎంతలా మోసం చేస్తున్నారో తెలుసా ?

చాలామంది భోజనం చేసి బిల్లు చెల్లించిన తర్వాత రెస్టారెంట్ నుంచి బయలుదేరుతారు. కానీ బిల్లును చెక్ చేయరు. చాలాసార్లు బిల్లు కూడా చూడకుండా డబ్బులు చెల్లించి వెళ్ళిపోతారు. అలా చెల్లించి వెళ్ళిపోతే మీ ఈ నిర్లక్ష్యం మీ జేబుకు చిల్లు పెట్టినట్లే. కొన్ని రెస్టారెంట్లు ఈ కేటగిరీ కిందకు రానప్పటికీ మీకు GST బిల్లును వసూలు చేస్తున్నాయి. మీరు ఆహారం కోసం ఎక్కువ బిల్లును ఎలా వసూలు చేస్తున్నారని ప్రశ్నించవచ్చు. రెస్టారెంట్లు ఎలా మోసం చేస్తున్నాయో ఇక్కడ … Read more

మ‌ల్టీప్లెక్స్‌ల‌లో పాప్ కార్న్ ల‌ను విక్రయిస్తూ ప్రేక్ష‌కుల నుంచి డ‌బ్బులు ఎలా దోపిడీ చేస్తున్నారో తెలిస్తే షాక‌వుతారు..!

మ‌ల్టీప్లెక్స్ స్క్రీన్లు లేదా సాధారణ థియేట‌ర్ల‌లో సినిమాలు చూసేట‌ప్పుడు చాలా మంది ప్రేక్ష‌కులు పాప్ కార్న్‌ తింటారు క‌దా. సాధార‌ణ థియేటర్స్ మాటేమోగానీ మ‌ల్టీప్లెక్స్‌ల‌లో పాప్‌కార్న్‌లకు గాను ప్రేక్ష‌కుల్ని వీర‌బాదుడు బాదుతారు. చాలా త‌క్కువ మొత్తంలో ఇచ్చే ప‌రిమాణానికే ఎక్కువ ధ‌ర వ‌సూలు చేస్తారు. 50, 100, 200 గ్రాముల్లో అందించే పాప్ కార్న్‌ల‌కు మ‌ల్టీప్లెక్స్‌ల యాజ‌మాన్యాలు ప్రేక్ష‌కుల నుంచి రూ.100, రూ.200 అలా వ‌సూలు చేస్తారు. అయిన‌ప్ప‌టికీ చాలా మంది ఆ రేటు చూడ‌రు. వాటిని … Read more

కారు బానెట్‌లోకి ఎలుకలు రాకుండా ఎలా నిరోధించాలి?

నేను బెంగుళూరులో HSR లేఅవుట్‌కు ఇల్లు మారినప్పుడు అక్కడ జనసాంద్రత బాగా తక్కువ. పైగా ఇంటి ఎదురుగా పెద్ద పార్కు. అది చాలక ఇంటి పక్కన ఖాళీ స్థలాలు. ఎలుకలు, పాములు నిత్యదర్శనం. ఎలుకలు కారు బానెట్‌లోకి ఎక్కటం, అక్కడి నుండి ఏసీ వెంట్‌లో చెత్త పేర్చటం జరిగి ఒకానొక రోజు దుర్వాసనకు సర్వీస్ సెంటర్‌కు తీసుకెళితే వాళ్ళు మొత్తం విప్పదీసి తీసిన చెత్త దాదాపు రెండు కిలోలు – పేపర్లు, ఎముకలు, వగైరా వగైరా. అప్పుడు … Read more

డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌పై ఉండే VISA, MASTER CARD, RuPay CARD ల గురించి మీకు తెలుసా..?

నిత్యం మ‌నం ఎన్నో విష‌యాల‌ను గ‌మ‌నిస్తుంటాం. ఎన్నో వ‌స్తువుల‌ను వాడుతుంటాం. అలాంటి వాటిలో ఏటీఎం, డెబిట్‌, క్రెడిట్ కార్డులు కూడా ఒక‌ట‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే వీటిపై ఉండే అక్ష‌రాలు, చిహ్నాల‌ను మీరు ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేనండీ చాలా వ‌ర‌కు కార్డుల‌పై VISA, MASTER CARD, RuPay CARD అని ఉంటుంది క‌దా. అవును అవే. అయితే వాటి గురించి మీకు తెలుసా..? మ‌నం వాడే ఏటీఎం, డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌పై వీటిలో ఏదో ఒక‌టి క‌చ్చితంగా ఉంటుంది. … Read more