ప‌ల్స్ ఆక్సీమీట‌ర్‌లో 80-85 రీడింగ్ చూపిస్తోంది.. దీని అర్థం ఏమిటి ? ఆందోళ‌న చెందాల్సిన విష‌య‌మేనా ?

ప‌ల్స్ ఆక్సీమీట‌ర్ ద్వారా రెండు ర‌కాల రీడింగ్స్‌ను తెలుసుకోవ‌చ్చు. ఒక‌టి.. బ్ల‌డ్ ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ లేదా ఆక్సిజ‌న్ శాచురేష‌న్ లెవ‌ల్స్ (ఎస్‌పీవో2). ప‌ల్స్ లేదా హార్ట్ రేట్ (బీపీఎం). ఆక్సిజ‌న్ శాచురేష‌న్ లెవ‌ల్స్‌ (ఎస్‌పీవో2) 95 నుంచి 100 శాతం మ‌ధ్య ఉంటే నార్మ‌ల్‌గానే ఉన్నాయ‌ని అర్థం. అయితే ఆక్సిజ‌న్ శాచురేష‌న్ లెవ‌ల్స్ 92 శాతం క‌న్నా త‌క్కువ ఉంటే దాన్ని హైపాక్సియా అంటారు. అంటే శ‌రీర క‌ణాల‌కు త‌గినంత ఆక్సిజ‌న్ ల‌భించ‌డం లేద‌ని అర్థం. ఇక … Read more

రోజూ మీరు త‌గిన‌న్ని గంట‌ల‌పాటు నిద్ర‌పోతున్నారా ? నిద్ర త‌గ్గితే ఏం జ‌రుగుతుందో తెలుసుకోండి..!

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయ‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డంతోపాటు త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించాలి. ప్ర‌తి మ‌నిషికి రోజూ క‌నీసం 7-8 గంటల నిద్ర అవ‌స‌రం. వృద్ధులు, చిన్నారుల‌కు అయితే 10 గంట‌ల నిద్ర అవ‌స‌రం. అయితే ప్ర‌స్తుతం చాలా మంది అనుభ‌విస్తున్న బిజీ లైఫ్ కార‌ణంగా రాత్రిపూట ఆల‌స్యంగా నిద్రిస్తున్నారు. ఉద‌యం ఆల‌స్యంగా నిద్ర లేస్తున్నారు. రోజూ త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించ‌డం లేదు. అయితే రోజూ స‌రిగ్గా నిద్రించ‌క‌పోతే ఎలాంటి దుష్ప‌రిణామాలు క‌లుగుతాయో … Read more

కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నాక చేయికి ఎందుకు నొప్పి క‌లుగుతుందో తెలుసా ?

క‌రోనా నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా చేప‌ట్టిన కోవిడ్ టీకాల పంపిణీ కార్య‌క్ర‌మం శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. అన్ని రాష్ట్రాల్లోనూ చురుగ్గా టీకాల‌ను వేస్తున్నారు. అయితే కోవిడ్ టీకాను తీసుకున్న అనంత‌రం స‌హ‌జంగానే ఎవ‌రికైనా ప‌లు సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తుంటాయి. కొంద‌రికి జ్వ‌రం వ‌స్తుంది. ఇంకొంద‌రికి వేరే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అలా వ‌స్తేనే వ్యాక్సిన్ బాగా ప‌నిచేస్తున్న‌ట్లు అర్థం అని నిపుణులు చెబుతున్నారు. ఇక వ్యాక్సిన్ వేసిన చేయి స‌హ‌జంగానే వాపుకు గుర‌వుతుంది. ఆ ప్ర‌దేశంలో నొప్పి వ‌స్తుంది. ఇలా … Read more

హార్ట్ ఎటాక్ వ‌చ్చేందుకు నెల రోజుల ముందు ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసా ?

రోజూ మ‌నం పాటించే జీవ‌న విధానం, తీసుకునే ఆహారాలు.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల గుండె ఆరోగ్యం ప్ర‌భావిత‌మ‌వుతుంటుంది. స‌రైన అల‌వాట్లు పాటిస్తూ, నిత్యం వ్యాయామం చేయ‌డంతోపాటు పౌష్టికాహారం తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. లేదంటే హార్ట్ ఎటాక్ లు లేదా ఇత‌ర గుండె జ‌బ్బులు వ‌స్తాయి. అయితే హార్ట్ ఎటాక్ అనేది సైలెంట్ కిల్ల‌ర్‌. అది ఎప్పుడు ఎవ‌రికి ఎలా వ‌స్తుందో అస్స‌లు తెలియదు. కానీ హార్ట్ ఎటాక్ వ‌చ్చేందుకు నెల రోజుల ముందు మ‌న … Read more

డాక్టర్ల వద్దకు వెళితే నాలుక చూస్తారు.. నాలుక చూసి వారు ఏం తెలుసుకుంటారు..?

సాధారణంగా మనం అనారోగ్యాల బారిన పడినప్పుడు ఏ వైద్యుడి వద్దకు వెళ్లినా సరే నాలుకను చూపించమంటారు. నాలుక స్థితి, రూపు రేఖలు, ఇతర అంశాలను పరిశీలించి వైద్యులు మనకు మందులు రాస్తారు. దాని ప్రకారం మనం మందులను వాడుతాం. అయితే నాలుకను చూడడం వల్ల వారికి ఏం తెలుస్తుంది ? అంటే.. శరీరంలో ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్లు ఏర్పడినా లేదా జీర్ణ సమస్యలు ఉన్నా, డయాబెటిస్‌ సమస్య ఉన్నవారిలో నాలుకపై తెల్లని మచ్చలు ఏర్పడుతాయి. కొందరికి ఆ మచ్చలు … Read more

బొడ్డులో కాటన్‌ తరహాలో ఉండే పదార్థం ఏమిటి ? అది ప్రమాదకరమా ?

బొడ్డు అనేది అందరికీ ఒకేలా ఉండదు. భిన్నంగా ఉంటుంది. కొందరికి అది పైకి వచ్చి ఉంటుంది. రంధ్రంలా ఉండదు. కొందరికి లోపలికి ఉంటుంది. అయితే బొడ్డులో సాధారణంగానే వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. అది మనకు కాటన్‌ రూపంలో కనిపిస్తుంది. అయితే అసలు ఆ పదార్థం ఏమిటి ? అది మనకు ప్రమాదాన్ని కలిగిస్తుందా ? అంటే.. బొడ్డు వద్ద వెంట్రుకల పెరుగుదల భిన్నంగా ఉంటుంది. దీని వల్ల బొడ్డులోకి అనేక చిన్న చిన్న పదార్థాలు ఆకర్షితమవుతాయి. మనం ధరించే … Read more

కిడ్నీ స్టోన్లు ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. ముందే తెలుసుకుని జాగ్ర‌త్త ప‌డండి..!

మూత్రంలో కాల్షియం, ఆగ్జ‌లేట్‌, యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువైతే అవి బ‌య‌టకు పోవు. దీంతో అవి మూత్ర పిండాల్లో పేరుకుపోయి రాళ్లు ఏర్ప‌డుతాయి. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. త‌గినంత నీటిని తాగ‌క‌పోవ‌డం, కాల్షియం అధికంగా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం, అస్త‌వ్య‌స్తమైన జీవన విధానం, ప‌లు ర‌కాల మందుల‌ను వాడ‌డం వంటి కార‌ణాల వల్ల చాలా మందికి కిడ్నీ స్టోన్లు వస్తుంటాయి. కిడ్నీ స్టోన్లు వ‌చ్చిన వారిలో ప‌లు ర‌కాల ర‌క్ష‌ణాలు ముందుగానే క‌నిపిస్తాయి. వాటిని ప‌రిశీలించ‌డం … Read more

పిత్త దోషం అంటే ఏమిటి ? దీని వ‌ల్ల వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌లు, తీసుకోవాల్సిన ఆహారాలు..!

ఆయుర్వేద ప్ర‌కారం మ‌న శ‌రీరంలో వాత‌, పిత్త‌, క‌ఫ అనే మూడు దోషాల్లో వ‌చ్చే అస‌మ‌తుల్య‌తల వ‌ల్లే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఒక్కో దోషం హెచ్చు త‌గ్గులను బ‌ట్టి వ్యాధులు వ‌స్తుంటాయి. ఇక అగ్ని, జ‌లం క‌ల‌యికే పిత్తం. ఇది వేడి, నూనె, కాంతి అనే స్వ‌భావాల‌ను క‌లిగి ఉంటుంది. శ‌రీరంలో పిత్తం ఎక్కువైతే పిత్త దోషం వ‌స్తుంది. పిత్త దోషం శ‌రీరం ఆరోగ్యంగా ఉండేందుకు, చెమ‌ట ప‌ట్టేందుకు, నిద్ర‌కు, ఆలోచించేందుకు, … Read more

కోవిడ్ వ‌చ్చిపోయింద‌నే విష‌యం చాలా మందికి తెలియ‌దు.. గోళ్ల ద్వారా తెలుసుకోవ‌చ్చు..!

కోవిడ్ వ‌చ్చిన వారికి స‌హ‌జంగానే ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటి ల‌క్ష‌ణాలు ఉంటాయ‌న్న సంగతి తెలిసిందే. కొంద‌రికి కొన్ని ల‌క్ష‌ణాలు ఉంటాయి. కొంద‌రికి అవే ల‌క్ష‌ణాల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటుంది. ఇక కొంద‌రికైతే అస‌లు ఏ ల‌క్ష‌ణాలు ఉండ‌వు. కానీ కొంద‌రిలో గోర్ల రంగు, స్వ‌రూపం మారుతాయి. అవును.. ఈ విధంగా జ‌రిగితే కొంద‌రికి అస‌లు కోవిడ్ వ‌చ్చి పోయిన‌ట్లే తెలియ‌దు. కానీ వారు త‌మ గోళ్ల‌ను ప‌రిశీలించ‌డం ద్వారా త‌మ‌కు కోవిడ్ వ‌చ్చిందా, రాలేదా.. అనే … Read more

ఏయే సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్‌ను కలవాలి..? తెలుసుకోండి..!

మనకు ఎప్పటికప్పుడు అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. కొన్ని సమస్యలు ఎలాంటి చికిత్స తీసుకోకపోయినా అవే నయం అవుతాయి. కొన్నింటికి చికిత్స అవసరం అవుతుంది. అయితే కొన్ని అనారోగ్య సమస్యలకు మాత్రం దీర్ఘకాలం చికిత్స లేదా సర్జరీ వంటివి అవసరం అవుతుంటాయి. కానీ ఏ అనారోగ్య సమస్య వచ్చినా మన శరీరం పలు లక్షణాలను చూపిస్తుంది. వాటిని గమనించి డాక్టర్‌ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకుని అవసరం అయిన మేర మందులను వాడుకోవాలి. అనారోగ్యాలను నిర్లక్ష్యం చేస్తే … Read more