ప్రోటీన్ల లోపం ఉంటే శ‌రీరంలో కనిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన స్థూల పోషకాల్లో ప్రోటీన్లు ఒక‌టి. ఇవి మ‌న శ‌రీరానికి శ‌క్తిని అందించ‌డంతోపాటు శ‌రీర నిర్మాణానికి, కండ‌రాల ప‌నితీరుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. శాకాహారాలు లేదా మాంసాహారులు ఎవ‌రైనా స‌రే ప్రోటీన్లు ఉన్న ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి. దీని వ‌ల్ల పోష‌ణ ల‌భిస్తుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. శాకాహారుల‌కు అయితే తృణ ధాన్యాలు, న‌ట్స్‌, విత్త‌నాలు, సోయా ఉత్ప‌త్తులు, పాల‌కూర‌, ప‌చ్చి బ‌ఠానీలు వంటి ఆహారాల ద్వారా ప్రోటీన్లు ల‌భిస్తాయి. మాంసాహారులు అయితే గుడ్లు, మాంసం, … Read more

డయాబెటిస్‌ ఉన్నవారు బ్లడ్‌ షుగర్‌ టెస్టును ఏ సమయంలో చేయాలి ? ఎలా చేయాలి ?

ఇంటర్నేషనల్‌ డయాబెటిస్‌ ఫెడరేషన్‌ చెబుతున్న లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 42.5 కోట్ల మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. 2045వ సంవత్సరం వరకు ఈ సంఖ్య 62.9 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏటా పెరుగుతున్న డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య నిపుణులను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుత తరుణంలో యుక్త వయస్సులో ఉన్నవారికి కూడా డయాబెటిస్‌ వస్తుండడం మరింత కలవరానికి గురి చేస్తోంది. అమెరికన్‌ డయాబెటిస్ అసోసియేషన్‌ చెబుతున్న ప్రకారం డయాబెటిస్‌ ఉన్నవారు తీసుకునే ఆహారాలు, శారీరక … Read more

కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న‌వారిలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

మన శ‌రీరంలోని ముఖ్య‌మైన అవ‌యవాల్లో కిడ్నీలు కూడా ఒక‌టి. ఇవి నిరంత‌రం ప‌నిచేస్తూనే ఉంటాయి. మ‌నం తినే ఆహార ప‌దార్థాలు, తాగే ద్ర‌వాల్లో ఉండే వ్య‌ర్థాల‌ను ఫిల్ట‌ర్ చేసి బ‌య‌టకు పంపుతాయి. అందువ‌ల్ల కిడ్నీలు చాలా ముఖ్య‌మైన పాత్ర‌ను పోషిస్తాయని చెప్ప‌వ‌చ్చు. అయితే కొంద‌రిలో ప‌లు కార‌ణాల వ‌ల్ల కిడ్నీలు స‌రిగ్గా ప‌నిచేయ‌వు. దీంతో వారిలో కిడ్నీల్లో వ్య‌ర్థాలు పేరుకుపోతాయి. దీంతో కొంత కాలానికి కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. కానీ కిడ్నీలు స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోవ‌డం ప్రారంభ‌మైన‌ప్పుడే మ‌న … Read more

సంతానోత్ప‌త్తిపై కోవిడ్ టీకా ప్ర‌భావం చూపిస్తుందా ? సందేహాలు, స‌మాధానాలు..!

క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రికీ స‌వాల్ గా మారింది. ఆ వైర‌స్ బారిన ప‌డ‌కుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి వ‌స్తోంది. అలాగే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తినీ పెంచుకోవాల్సి వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులంద‌రూ క‌లిసి క‌రోనా వైర‌స్‌కు ర‌క్ష‌ణ క‌వ‌చాల‌ను అభివృద్ధి చేస్తున్నారు. వ్యాక్సిన్లు ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే కోవిడ్ టీకాల‌ను తీసుకోవ‌డంలో అనేక మందికి భ‌యాలు నెల‌కొన్నాయి. అనేక మంది అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోవ‌డం … Read more

రోజుకు మ‌నం ఎంత ఉప్పు తిన‌వ‌చ్చు ? మ‌న‌కు ఎంత ఉప్పు అవ‌స‌రం ?

ఒక వంటకం రుచిని పూర్తిగా మార్చేయ‌గల ముఖ్యమైన పదార్థాలలో ఒకటి ఉప్పు. అయినప్పటికీ మనం రోజూ తీసుకునే సాధారణ ఉప్పులో ఉండే సోడియం అనారోగ్యకరమైనదని కూడా మ‌న‌కు తెలుసు. కారణం.. సోడియం రక్తపోటు (హైబీపీ) స్థాయిలను పెంచుతుంది. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్‌లకు కార‌ణ‌మ‌వుతుంది. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం అధిక రక్తపోటు మూడవ అతి ముఖ్యమైన ప్రమాద కారకంగా ఉంది. సుమారుగా 33 శాతం పట్టణ, 25 శాతం గ్రామీణ భారతీయులు రక్తపోటుతో … Read more

డ‌యాబెటిస్ వ‌చ్చిన వారిలో ఆరంభంలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

మన శరీరంలో సహజంగా రక్తంలో చక్కెర (గ్లూకోజ్‌) కొంత శాతం ఉంటుంది. కానీ చక్కెర స్థాయిలు నిర్దిష్ట‌మైన‌ మొత్తాన్ని దాటినప్పుడు అది హైపర్ గ్లైసీమియాకు దారితీస్తుంది. రక్తంలో అధిక చక్కెర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఇది కిడ్నీలు, కాలేయం, మెదడు, ఇతర ముఖ్యమైన అవయవాలను నేరుగా ప్రభావితం చేస్తుంది. డయాబెటిస్ వ‌చ్చేందుకు అస‌లు ప్రధాన కారణం తెలియదు. కానీ రక్తంలో చక్కెర అధికంగా ఉంటే వైద్యుడిని సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకోవాలి. అలాగే జీవనశైలిని మెరుగుపరుచుకోవ‌డం, ఆరోగ్యకరమైన … Read more

డిప్రెష‌న్ బారిన ప‌డ్డ‌వారిలో క‌నిపించే 9 ల‌క్ష‌ణాలు ఇవే..!

డిప్రెష‌న్ అనేది స‌హ‌జంగానే చాలా మందికి వ‌స్తుంటుంది. కానీ కొంద‌రు ఎల్ల‌ప్పుడూ పాజిటివ్ దృక్ప‌థంతో ఉంటారు. అలాంటి వారిని డిప్రెష‌న్ ఏమీ చేయ‌దు. కొంత సేపు విచారంగా ఉంటారు. త‌రువాత వారే ఆటోమేటిగ్గా మంచి మూడ్‌లోకి వ‌స్తారు. డిప్రెష‌న్ అంతా ఎగిరిపోతుంది. కానీ కొంద‌రు మాత్రం ఎంత ప్ర‌య‌త్నించినా డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట ప‌డ‌లేరు. అయితే డిప్రెష‌న్ వ‌చ్చిన వారిలో స‌హ‌జంగానే మ‌న‌కు ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటాయి. వాటిని ప‌సిగట్ట‌డం ద్వారా ఎదుటి వారు డిప్రెష‌న్‌కు గుర‌వుతున్నార‌ని … Read more

కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో కనిపించే 10 లక్షణాలు ఇవే..!

మన శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపించేందుకు కిడ్నీలు ఎప్పుడూ శ్రమిస్తూనే ఉంటాయి. అందుకుగాను మనం నీటిని ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. అలాగే కిడ్నీలను సురక్షితంగా ఉంచే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొందరిలో పలు కారణాల వల్ల కిడ్నీ సమస్యలు వస్తుంటాయి. ఈ క్రమంలోనే వారిలో కొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తే దాన్ని కిడ్నీ సమస్యగా అనుమానించాలి. అయితే డయాబెటిస్‌ ఉన్నవారిలో సహజంగానే … Read more

పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలు త‌క్కువ‌గా ఉంటే క‌నిపించే 10 ల‌క్ష‌ణాలు ఇవే..!

టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ పురుషుల్లో ఉత్ప‌త్తి అవుతుంది. వృషణాలు ఈ హార్మోన్‌ను ఉత్ప‌త్తి చేస్తాయి. ఈ హార్మోన్ వ‌ల్ల శుక్ర క‌ణాలు త‌యార‌వుతాయి. అలాగే పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. అయితే ఒక పురుషుడిలో ఒక డెసిలీట‌ర్‌కు 300 నానోగ్రాముల క‌న్నా తక్కువగా టెస్టోస్టిరాన్ స్థాయిలు ఉంటే అప్పుడు ఆ వ్య‌క్తిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ త‌క్కువ‌గా ఉన్న‌ట్లు నిర్దారిస్తారు. ఈ క్ర‌మంలోనే ఈ హార్మోన్ స్థాయిలు త‌క్కువ‌గా ఉంటే శ‌రీరంలో ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అవేమిటంటే… 1. … Read more

కొవ్వు ప‌దార్థాల‌ను తిన‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతామా ?

మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల కొవ్వు ప‌దార్థాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అన్ని ర‌కాల కొవ్వు ప‌దార్థాలు చెడువి కావు. అంటే.. మ‌న ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డే కొవ్వు ప‌దార్థాలు కూడా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌న‌కు మంచి చేసే, చెడు చేసే కొవ్వు ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి క‌దా. ఒక‌దాన్ని మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌) అంటారు. రెండో దాన్ని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) అంటారు. … Read more