పొగ తాగడం వ‌ల్ల గుండెకు ఎలాంటి న‌ష్టం జ‌రుగుతుందో తెలుసా..?

సిగరెట్ లోని లేదా పొగాకు లోని కార్బన్ మొనాక్సైడ్, రక్తం ఆక్సిజన్ ను రవాణా చేయకుండా చేస్తుంది. పొగతాగటం మొదలైన ఒక్క నిమిషంలో నాడి కొట్టుకోవడం పెరుగుతుంది. మొదటి 10 నిమిషాలలో నాడి కొట్టుకోవడం 30 శాతం వరకు పెరుగుతుంది. పొగ తాగటం రక్తపోటు అంటే బి.పి.ని కూడా అధికం చేస్తుంది. పొగతాగడం రక్తంలోని కొల్లెస్టరాల్ స్ధాయిలను పెంచుతుంది. మంచి కొల్లస్టరాల్ ను చెడు కొల్లెస్టరాల్ గా మారుస్తుంది. ఫిబ్రినోజన్, ప్లేట్ లెట్ ల ఉత్పత్తి స్ధాయిలను … Read more

గొంతులో తెమ‌‌‍‌డ ఏర్పడటం ఏమిటి? నివారణ ఏమైనా ఉందా?

గొంతులో తెమ‌‌‍‌డ‌ అంటే….. గొంతులో శ్లేష్మం పేరుకుపోవడం వలన గొంతులో చికాకు, దగ్గు వంటి లక్షణాలు ఏర్పడతాయి. ముక్కు పట్టేసి, గొంతు పట్టేసి తినడానికి, నిద్ర పోవడానికి కూడా ఇబ్బంది పెడుతుంది. గొంతులో తెమ‌‌‍‌డ‌ రావడానికి కారణాలు…. వైరల్ ఇన్ఫెక్షన్లు…. జలుబు, ఫ్లూ, శ్వాసకోశ వైరస్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు గొంతులో తెమ‌‌‍‌డ‌కి అత్యంత సాధారణ కారణాలు. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు….. స్ట్రెప్ థ్రోట్ వంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు కూడా గొంతులో తెమ‌‌‍‌డ‌కి కారణమవుతాయి. అలెర్జీలు….. ధూళి, పుప్పొడి, … Read more

నరివెట్ట సినిమా ఎలా ఉంది?

ఒక నిజాన్ని గొయ్యి తీసి పాతిపెడితే.. అక్కడే ఇంకో నిజం మొలుస్తుంది.. ఇక్కడ ఒక నిజం పాతిపెట్టబడిందనే ఇంకో వాస్తవం పుట్టుకొస్తుంది.. అదే మలయాళం నరివెట్ట సినిమా. ఇది 2003లో కేరళలో జరిగిన ముతంగ సంఘటన ఆధారంగా తీసిన సినిమా. వాస్తవ ఘటన ఆధారంగా తీసిన యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ. నరివెట్ట అంటే నక్కల వేట అని అర్థం. అనురాజ్ మనోహర్ దర్శకుడు, టోవినో థామస్ హీరో, సూరజ్ వెంజరమూడి కూడా కీలక పాత్రలో నటించారు. ఈ … Read more

పల్లవులు , చోళుల వారసులు ఇప్పుడు ఏమైపోయారు..?

ఏమీ అయిపోలేదండీ.. మన తెలుగు వారికి కూడా మన చరిత్ర తెలియకుండా కప్పెట్టేసారే అని పల్లవుల ఆత్మలు క్షోభిస్తున్నాయి అట.. చరిత్రకారుల అంచనా ప్రకారం పల్లవులు గోదావరి జిల్లాల నుంచి కానీ, గుంటూరు, నెల్లూరు జిల్లాల(నేటి పల్నాడు ప్రాంతం -పల్లవ నాడు అనే వాదన కూడా ఉంది) నుంచి కానీ వలస వెళ్ళి నేటి చెన్నై కి సమీపంలో ఉన్న కాంచీపురం (కంచి) లో తమ పల్లవ సామ్రాజ్యం స్థాపించారు.. పల్లవ రాజులు కొన్ని శాసనాల్లో తమని … Read more

చిరంజీవి మెగాస్టార్ అయ్యే క్రమంలో ఏయే హీరోల నుంచి పోటీ వచ్చింది?

నేను చిరంజీవి మొదటి సినిమా సుదర్శన్‌70mmలో మొదటి ఆట చూడ్డానికి వెళ్లినప్పుడే కొత్త నటుడు అని పేపర్‌ లో ad చూసే వెళ్లాను, ఒక యుగళగీతాన్ని ఇష్టపడ్డాను. చిరంజీవి క్రమంగా చిత్ర చిత్రానికి ఎదుగుతూ వచ్చారు. పున్నమి నాగులో మంచి గుర్తింపు, కోతలరాయుడులో మంచి మార్కులు కొట్టేసాడు. నాకు గుర్తు మా ఇంటి దగ్గరనే మా ఫ్రెండ్‌ ఇంటిలో కుక్క కాటుకు చెప్పు దెబ్బ షూటింగ్ విరామ సమయం‌లో హీరోయిన్‌ అస్సలు తనతో మాట్లాడేది కాదు, తను … Read more

వారానికి 2 బీర్లు తాగితే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఎన్నో..!

బీర్లు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన లాభాలు కలుగుతాయని శాస్త్రవేత్తలు నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది. కొన్ని ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడకుండా సురక్షితంగా ఉండొచ్చని వారు తమ నివేదికలో వెల్లడించారు. అలాగని ఎక్కువ లాగించేయకూడదు సుమీ.. పరిమితంగా తీసుకోవాలి. మహిళలు వారానికి రెండు బీర్లు తీసుకుంటే.. గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని చాలా సర్వేల్లో తేలింది. పురుషులు పరిమితంగా బీర్లు తీసుకుంటే.. మూత్రపిండాల్లో రాళ్లు పడే ప్రమాదం తగ్గుతుందని తెలిసింది. బీర్లలో సిలికాన్ సమృద్ధిగా … Read more

రోజూ ఇలాంటి వ్యాయామాలు చేస్తే ఆరోగ్యం మీ వెంటే..!

ప్రతిరోజూ వ్యాయామం చేస్తే మీ జీవితంలో ఏర్పడే ఒత్తిడి సంఘటనలను తేలికగా ఎదుర్కొంటారు. జీవితం ఒత్తిడి తెచ్చే ఎన్నో సంఘటనలతో కూడుకొని వుంటుంది. కనుక సులభమైన వ్యాయామాల ద్వారా అధిక ఒత్తిడి ఎలా నియంత్రించుకోవాలో పరిశీలించండి. శారీరక వ్యాయామం – ఒత్తిడి ఆందోళన తగ్గాలంటే, ఏదో ఒక శారీరక చర్యలలో పాల్గొనండి. అది నడక లేదా వర్కవుట్ కావచ్చు. కొంతసేపు చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. స్విమ్మింగ్ లేదా మీ కిష్టమైన ఆటలాడటం చేస్తే బోర్ అనిపించకుండా వుంటుంది. … Read more

విదురుడు చెప్పిన ప్ర‌కారం ఇలాంటి ల‌క్ష‌ణాలు ఉన్న‌వారే అదృష్ట‌వంతులు అట‌..!

ఈ భూ ప్ర‌పంచంలో అదృష్ట‌వంత‌మైన వ్య‌క్తులు ఎవ‌రు? అంటే మీరు ఏం స‌మాధానం చెబుతారు..? ఏముందీ… ఎవ‌రికి ఎక్కువ డ‌బ్బు ఉండి ధ‌న‌వంతులుగా ఉంటారో వారే అదృష్ట‌వంత‌మైన వ్య‌క్తులు… అని అన‌బోతున్నారా..? అయితే మీరు పప్పులో కాలేసిన‌ట్టే. ఎందుకంటే ధ‌న‌మే కాదు, ఇంకా కొన్ని విష‌యాలు కూడా అదృష్ట‌వంత‌మైన వ్య‌క్తులు అవునా, కాదా అనే విష‌యాన్ని నిర్దారిస్తాయ‌ట‌. అవును, మేం చెబుతోంది నిజ‌మే. విదురుడు తెలుసుగా..? ధృత‌రాష్ట్రుడు, పాండురాజుల త‌మ్ముడు. కౌర‌వ సామ్రాజ్యానికి స‌ల‌హాదారుడిగా ఉండి, ఆ … Read more

వ‌య‌స్సు పైబ‌డుతున్న వారికి వ‌యాగ్రా ఇత‌ర ర‌కాలుగా కూడా మేలు చేస్తుంద‌ట‌..!

యవ్వనంలో ఉన్నప్పుడు వీలైనన్ని సార్లు శృంగారం చేయాలి. నిజానికి సెక్స్‌ అనేది పెళ్లి తర్వాతే చేయాలని రూలేం లేదు. కానీ మన దగ్గర శృంగారం అనేది ఒక నైతికవిలువకు అద్దం. పెళ్లికి ముందే శృంగారం చేస్తే వాళ్లు చెడ్డవాళ్లు, క్యారెక్టర్‌ లేదని అనుకుంటారు. ఇది కూడా ఎంజాయ్‌మెంట్‌లో ఒక భాగం మాత్రమే. కానీ ఇలా అర్థం చేసుకునే మెంటాలిటీ చాలా మందికి లేదు కదా..! శృంగారం అనగానే మనకు గుర్తుకువచ్చేది కండోమ్‌ అయితే దాని తర్వాత వయాగ్రా … Read more

పుత్రులు 5 ర‌కాలుగా ఉంటార‌ట తెలుసా..? వారు ఎవ‌రంటే..?

కుమార్తెలు ఎంత మంది ఉన్నా.. ఒక్క కొడుకు అయినా కావాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. కొడుకు వల్లనే వంశం ముందుకు వెళ్తుంది కాబట్టి.. కొడుకు కోసం చాలా మంది కలలు కంటారు. అయితే పుత్రులు ఐదు రకాలుగా ఉంటారని సనాతన ధర్మం చెబుతోంది. కుమారులలో ఉండే గుణాలు మరియు ప్రవర్తనల ఆధారంగా, క్రింద పేర్కొన్న విధంగా విభజించవచ్చు. శత్రు కొడుకు.. చిన్నప్పటి నుండి తండ్రి చేసే పనులన్నిటినీ వ్యతిరేకించే కొడుకు, అతని ఏ పనితోనూ సంతృప్తి చెందని … Read more